Jagananna Ammavodi; అమ్మ ఒడి ఫైనల్ అర్హుల లిస్టు విడుదల వెంటనే ఈ 1 పని చేయండి లేదంటే డబ్బులు రావు

Jagananna Ammavodi 2023:

Jagananna Ammavodi (అమ్మ ఒడి) పథకానికి సంబంధించి నాలుగో విడత డబ్బులను సీఎం జగన్మోహన్ రెడ్డి ఈనెల 28న అందరి ఖాతాలోకి వేయనున్నారు దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను ప్రభుత్వం పూర్తి చేసింది. ఈ పథకానికి సంబంధించిన 15 వేల రూపాయల్లో 1000 రూపాయలు స్కూల్ మెయింటెనెన్స్ కి మరో వెయ్యి రూపాయలు టాయిలెట్స్ మెయింటినెన్స్ కి ఏపీ రాష్ట్ర ప్రభుత్వమే ట్రాన్స్ఫర్ చేస్తుంది. మిగిలినటువంటి 13వేల రూపాయలను అర్హత కలిగిన విద్యార్థి తల్లి ఖాతాలోకి సీఎం జగన్మోహన్ రెడ్డి కంప్యూటర్లో బటన్ నొక్కి ట్రాన్స్ఫర్ చేయనున్నారు.

Jagananna Ammavodi (అమ్మ ఒడి) పథకానికి సంబంధించి ఒకటవ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువే విద్యార్థుల తల్లుల ఖాతాలోకి సంవత్సరానికి 15 వేల రూపాయలను సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా తీసుకువచ్చిన నవరత్నాలలో ప్రకటించడం జరిగింది. ఈ పథకానికి తొలి విడత ఏకింద 2020లో 15వేల రూపాయలను జనవరి 9వ తేదీన విడుదల చేశారు. అలాగే రెండో విడతలో జనవరి 9వ తేదీ 2021 సంవత్సరంలో 14 వేల రూపాయలను తల్లుల ఖాతాల్లోకి విడుదల చేశారు. ఇక మూడో విడత కింద జనవరి 9న 2020 రెండో సంవత్సరంలో తల్లుల ఖాతాలలోకి 13 వేల రూపాయలను ట్రాన్స్ఫర్ చేశారు.15 వేల లో రెండు వేల రూపాయలను పైన తెలిపిన విధంగా స్కూల్ మెయింటెనెన్స్ కి టాయిలెట్ మెంట్స్ కి ట్రాన్స్ఫర్ చేసి మిగిలిన 13000 రూపాయలను తల్లుల ఖాతాలోకి వేయడం జరిగింది. ఇక నాలుగో విడత కింద జూన్ 28వ తేదీ 2023వ సంవత్సరంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి కంప్యూటర్లో బటన్ నొక్కి విడుదల చేయనున్నారు.

Jagananna Ammavodi Final eligible List (అమ్మ ఒడి ఫైనల్ అర్హుల జాబితా):

Jagananna Ammavodi పథకానికి సంబంధించిన తుది జాబితాను రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని గ్రామ వార్డు సచివాలయాలలో పెట్టి ఉన్నారు. ఈ అర్హుల లిస్టులో ఎవరి పేరు అయితే వచ్చాయో వాళ్లు సచివాలయం లేదా మీ యొక్క వాలంటరీ దగ్గర e-KYC అంటే బయోమెట్రిక్ వేసి కన్ఫామ్ చేసుకోవాలి. ఈ విధంగా కన్ఫామ్ చేసుకున్న వారికి మాత్రమే అమ్మ ఒడి పథకానికి సంబంధించిన నాలుగో విడత నిధులను ఈనెల 28న సీఎం జగన్మోహన్ రెడ్డి విడుదల చేసిన వెంటనే ఖాతాలో జమవుతాయి. ఈ ఈ కేవైసీ చేసుకోకుండా ఉన్నట్లయితే అమ్మ ఒడి పథకానికి సంబంధించిన నిధులు విడుదల చేసినప్పుడు మీ ఖాతాలోకి రావు.

కాబట్టి మీరు వెంటనే మీ మీ వాలంటీర్ను సంప్రదించి e-KYC పూర్తి చేసుకోండి లేదా సచివాలయంలోకి వెళ్లి వెంటనే అక్కడ ఎడ్యుకేషనల్ అసిస్టెంట్ ని సంప్రదించి ఈ కేవైసీ పూర్తి చేసుకోండి. e-KYC పూర్తి చేసుకున్న ప్రతి ఒక్కరికి జూన్ 28న 13 వేల రూపాయలు ఖాతాలో జమవుతాయి.

Jagananna Ammavodi
Jagananna Ammavodi 2023

అలాగే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం DBT ద్వారా ఈ నిధులను విడుదల చేస్తుంది కాబట్టి ఆధార్ కార్డుతో బ్యాంక్ అకౌంట్ కి ఎన్ పి సి ఐ లింకు కచ్చితంగా కలిగి ఉండాలి లేదంటే అమౌంట్ విడుదల చేసినప్పుడు మీ ఖాతాకు ఎంపీసీఐ లింకు లేనందున డబ్బులు పడకుండా ఆగిపోవచ్చు అంటే పేమెంట్ అనేది ప్రాసెసింగ్ అనేది కాదు.

ఈ NPCI లింక్ ని మీరు కలిగి ఉన్నారా లేదో చెక్ చేసుకునేందుకు క్రింద ఇవ్వబడిన లింక్ ద్వారా తెలుసుకోవచ్చు.

Click here

జగనన్న అమ్మఒడి పథకానికి సంబంధించిన అర్హుల జాబితా చెక్ చేసుకోవాలంటే క్రింద ఉన్న లింక్ ని క్లిక్ చేసి పూర్తిగా తెలుసుకోవచ్చు.

Click here

Jagananna Ammavodi (జగనన్న అమ్మ ఒడి) పథకానికి సంబంధించి నిధుల విడుదలకు రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన 13 జిల్లాలలో పార్వతీపురం మన్యం జిల్లాలోని కురుపాకం వేదికగా 54 లక్షల మంది తల్లుల ఖాతాలోకి 6500 కోట్ల రూపాయలను జూన్ 28న సీఎం జగన్మోహన్ రెడ్డి కంప్యూటర్లో బటన్ నొక్కి జమ చేయనున్నారు. దీనికి సంబంధించిన పూర్తి కార్యాచరణ మొత్తం పూర్తయినట్లు తెలుస్తోంది.

Jagananna Ammavodi (అమ్మ ఒడి) అర్హతలు:

• కుటుంబ ఆదాయం గ్రామాలలో అయితే నెలకు పదివేల రూపాయలు పట్టణాలలో అయితే 12 వేలకు మించకూడదు.

•ఇన్కమ్ టాక్స్ కట్టేవారు ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు అనర్హులు. అయితే పారిశుద్ధ్య కార్మికులు మాత్రం అర్హులు. వీళ్ళకు మాత్రం వెసులుబాటును కల్పించింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం.

• విద్యుత్ వినియోగం నెలకు 300 యూనిట్లకు మించ కూడదు.

• భూమి విస్తీర్ణం మెట్టైతే 10 ఎకరాలలోపు ఉండాలి. మా గాని అయితే మూడు ఎకరాల లోపు ఉండాలి. లేదా మెట్ట మాగాని రెండు కలిపి పది ఎకరాల లోపు ఉండాలి ఇంతకుమించి ఉన్నవారు అనర్హులు.

• పట్టణ ప్రాంతాలలో ఇంటి స్థలం అయితే వెయ్యి చదరపు అడుగులకు మించకూడదు.

• లబ్ధిదారులు ఖచ్చితముగా దారిద్రరేఖకు దిగువుగా గుర్తించబడిన తెల్ల రేషన్ కార్డును కలిగి ఉండాలి.

• నాలుగు చక్రాల వాహనాలు కలిగిన వారు అనర్హులు అయితే టాక్సీలు, ట్రాక్టర్లు కలిగిన వారు మాత్రమే అర్హులు వీళ్లకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది.

• విద్యార్థులు 75% హాజరును కలిగి ఉండాలి.

ELigible List

Note :

Jagananna Ammavodi (జగనన్న అమ్మ) ఒడి పథకం యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే ప్రతి ఒక్కరు కూడా చదువుకోవాలి చిన్న వయసు నుంచే బడులకు పంపే విధంగా తల్లిదండ్రులను ప్రోత్సహిస్తే వారు పిల్లల పట్ల శ్రద్ధ కలిగి పిల్లలను స్కూళ్లకు పంపి వాళ్లు బాగా చదువుకొని వాళ్ళ భవిష్యత్తును మెరుగుపరుచుకునేందుకు సహాయపడతారు. అందుకని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి ఈ అమ్మ ఒడి పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ పథకం కింద పిల్లలను బడికి పంపే ప్రతి తల్లికి 15 వేల రూపాయలను సంవత్సరానికి ఒకే విడతలో డిప్యూటీ ద్వారా అనగా నేరుగా తల్లి ఖాతాలోకి ఈ డబ్బులను జమ చేయడం జరుగుతుంది. ఇప్పటికే ఈ 4 విడత అమ్మఒడి పథకానికి సంబంధించి కార్యాచరణ మొత్తం పూర్తయింది ఈ కేవైసీ చేసుకున్న ప్రతి తల్లి ఖాతాలోకి జూన్ 28న సీఎం జగన్మోహన్ రెడ్డి 13వేల రూపాయలను అర్హత కలిగిన ప్రతి తల్లిఖాతంలోకి విడుదల చేయనున్నారు.

20 thoughts on “Jagananna Ammavodi; అమ్మ ఒడి ఫైనల్ అర్హుల లిస్టు విడుదల వెంటనే ఈ 1 పని చేయండి లేదంటే డబ్బులు రావు”

  1. అమ్మ ఓడి పథకం ఒక అబద్దం ఎందుకంటే మేము e kyc చేసాం పోస్టల్ అకౌంట్ తీసాం మాకు రాలేదు పోస్టల్ అకౌంట్ ప్రొఫైల్ లో మాది ఆధార్ కనెక్ట్ అయ్యి వుంది అయినా కానీ మాది ఆధార్ లింక్ అవలేదు అని దొంగ మాటలు చెపుతున్నారు మా ఆధార్ లింక్ అవకుండా ఉంటే మేము మీ సేవలో ఆధార్ ద్వారా డబ్బులు తీసుకున్నాం కూడా ఆలా లింక్ అవకుండా మీ సేవలో ఇవ్వరు కదా దయచేసి ఈ పథకాన్ని ఎవరు నమ్మవొద్దు ఇది కొందరికి మాత్రమే ఇస్తున్నారు చాలా మందికి ఇవ్వడంలేదు

  2. నాకు అమ్మబడి ఎలిజిబుల్ లిస్టులో రాలేదు ఇంకా అనిల్ జబల్ లిస్టులో కూడా రాలేదు నేనేం చేయాలి

  3. Anna maku enka ammavodi dabbulu raledu npci link iendi aadhar mapping iendi anni clear unnae anna

Comments are closed.

Verified by MonsterInsights