Ammavodi 2023; అమ్మ ఒడి 4 వ విడత ఇంకా మీకు పడలేదా? వెంటనే ఇలా చేస్తే 100% మీ ఖాతాలో ₹13,000 జమ అవుతుంది.

జగనన్న అమ్మఒడి 4వ విడత:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా విద్యార్థుల కోసం తీసుకువచ్చి అమలు చేస్తున్న పథకం జగనన్న అమ్మఒడి ఈ పథకం కింద అర్హత కలిగిన ప్రతి ఒక్క విద్యార్థి తల్లి ఖాతాలోకి ₹15 వేల రూపాయలను మన్యం జిల్లా కురూపంలో బహిరంగ సభ వేదికగా తనని ఖాతాల్లోకి నిధులు విడుదల చేశారు. ఈ ₹15 వేల లో ₹2000 రూపాయలు స్కూల్ మెయింటెనెన్స్ కి అలాగే టాయిలెట్ మెయింటెనెన్స్ కి ట్రాన్స్ఫర్ చేయగా మిగిలినటువంటి ₹13000 రూపాయలను తల్లులు ఖాతాలోకి విడుదల చేయడం జరిగింది.

ఈ జగనన్న అమ్మఒడి పథకానికి సంబంధించి నాలుగో విడత డబ్బులను సీఎం జగన్మోహన్ రెడ్డి పది రోజులపాటు అర్హత కలిగిన ప్రతి ఒక్క తల్లికి విడుదల చేస్తామని జూన్ 28న మన్యం జిల్లా కురూపం సభ వేదికగా ప్రకటించారు. ఆరోజు నుండే అర్హత కలిగిన ప్రతి ఒక్క విద్యార్థి తల్లి ఖాతాలోకి నిధులను జమ చేస్తూ వస్తున్నారు. అయితే అమ్మ ఒడి పథకానికి సంబంధించి చాలా మంది లబ్ధిదారులకు ఇంకా డబ్బులు జమ కాలేదు. అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి మాత్రం పది రోజులు పాటు ఈ జగనన్న అమ్మ మూడు పథకానికి సంబంధించిన నిధులను విడుదల చేస్తామని చెప్పినప్పటికీ చాలామంది లబ్ధిదారులు ఖాతాలోకి ఇంకా డబ్బులు పడకపోవడంతో ఆందోళన చెందుతున్నారు.

ఈ నేపథ్యంలో అమ్మ ఒడి పథకానికి సంబంధించిన లబ్ధిదారులకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మరో శుభవార్త చెప్పారు. ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ కేవైసీ పూర్తి చేసుకుంటే నేరుగా వారికి ఖాతాల్లోకి జూలై 7వ తేదీలోగా నిధులు జమవుతాయని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి నిన్న జరిగిన ప్రెస్ మీట్ లో ప్రకటించారు. ఈ జగనన్న అమ్మఒడి పథకానికి సంబంధించి ఇప్పటివరకు మన యొక్క ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం మూడు విడుదల డబ్బుల విడుదల చేసింది. ఇక 2023వ సంవత్సరానికి సంబంధించి నాలుగో విడత డబ్బులను జూన్ 28న లబ్ధిదారుల ఖాతాల్లోకి విడుదల చేసింది.

ఈ జగనన్న అంబటి పథకానికి సంబంధించిన నాలుగో విడత నిధులను దాదాపు 44 లక్షల మంది తల్లుల ఖాతాలోకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి కంప్యూటర్ల బటన్ నొక్కి విడుదల చేశారు. గత ఏడాది అమ్మ ఒడి పథకానికి సంబంధించిన నిధులు విడుదల చేసినప్పుడు కేవలం మూడు నుంచి ఐదు రోజుల మధ్యలోనే అర్హుల ఖాతాలోకి జమయ్యాయి. ఈసారి అమ్మ ఒడి నిధులు విడుదల చేసినప్పుడు దాదాపు నాలుగు రోజుల పాటు బ్యాంకులకు సెలవులు కూడా రావడం జరిగింది. ఈ కారణంగానే లబ్ధిదారుల ఖాతాలోకి నిధులు జమవడం మరింత ఆలస్యం అవుతుంది. దీంతో లబ్ధిదారులు ఆందోళన పడుతున్నారు ఇది గమనించిన మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారుల ఖాతాలోకి జూలై 7 వరకు అమ్మబడి నిధులను విడుదల చేస్తామని ఎవరు కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదని ప్రకటించింది.

జగనన్న అమ్మఒడి 2023
జగనన్న అమ్మఒడి 2023

జగనన్న అమ్మ ఒడి పథకానికి సంబంధించి అర్హులు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా ekyc కచ్చితంగా చేసుకోవాలని ఇలా ఈ కేవైసీ చేసుకున్న వారికి మాత్రమే అమ్మబడి పథకానికి సంబంధించిన నాలుగో విడత నిధులు జమతాయని తెలిపింది. ఈ యొక్క ఈ కేవైసీ నిజమైన అర్హులను గుర్తించడంలో సహాయపడుతుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కాబట్టి ఇంకా మీరు ఈ కేవైసీ చేసుకోకపోతే వెంటనే మీయొక్క వాలంటీర్నీ లేదా గ్రామ, వార్డు సచివాలయంలో గాని మీ యొక్క ఆధార్ కార్డు నెంబర్ తీసుకుని వెళ్లి ముద్ర తో కానీ లేదా మీ యొక్క ఫోటో తీసుకొని గానీ ఈ కేవైసీ చేయించుకోండి.

అమ్మ ఒడి పథకానికి సంబంధించిన ఈ కేవైసీ స్టేటస్ చెక్ చేసుకునేందుకు దీనిని క్లిక్ చేయండి. Click here

ఎందుకంటే మనకు జూలై 7వ తేదీ వరకు ఈ యొక్క అమ్మబడి పథకానికి సంబంధించిన నాలుగో విడత డబ్బులు జమవుతాయని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. అంతేకాకుండా మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి డబ్బులు విడుదల చేసినప్పుడు నేరుగా మన ఖాతాలకే పడాలంటే ఆధార్ కార్డుతో బ్యాంక్ అకౌంట్ కి లింక్ చేసుకోవాలి. దీనినే NPCI (NATIONAL PAYMENT CORPORATION OF INDIA) లింక్ అంటారు. ఇది మన ఖాతాలోకి DBT (direct beneficiary transfer) ద్వారా నిధులు విడుదల చేసినప్పుడు నేరుగా మన ఖాతాలోకి జమ అయ్యేలా చేస్తుంది.

కాబట్టి ప్రభుత్వ పథకాలకు సంబంధించిన అర్హులు ఎవరైతే ఉంటారో అటువంటి వారందరూ కూడా ప్రభుత్వం డబ్బులు రిలీజ్ చేసినప్పుడు పొందాలి అనుకుంటే కచ్చితంగా NPCI లింక్ చేసుకొని ఉండాలి. ఈ లింక్ ని కలిగి ఉండకపోతే ప్రభుత్వం డబ్బులు విడుదల చేసినప్పటికీ కూడా మన ఖాతాలోకి పడకుండా పేమెంట్ పెండింగ్ అయిపోతుంది. అందుకని మీరు మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కి ఆధార్ కార్డు నెంబర్తో NPCI మ్యాపింగ్ చేయించుకోవాలి. అలాగే బ్యాంక్ అకౌంట్ కూడా యాక్టివ్ లో ఉంచుకోవాలి. అంటే కనీసం ప్రతి మూడు నెలలకు ఒకసారైనా అకౌంట్లోకి డబ్బులు వేయడం లేదా తీయడం చేయాలి ఇలా చేయకపోతే మీయొక్క బ్యాంక్ అకౌంట్ ఇన్ యాక్టివ్ లోకి వెళ్ళిపోతుంది. ఇలా మీ బ్యాంక్ అకౌంట్ ఇన్ యాక్టివ్ లోకి వెళ్ళినా సరే మీకు డబ్బులు రావు.

NPCI మ్యాపింగ్ అయిందో లేదో తెలుసుకునేందుకు దీనిని క్లిక్ చేయండి. Click here

జగనన్న అమ్మఒడి పథకానికి సంబంధించి కొన్ని కారణాలవల్ల చాలామందికి అనర్హతలు వచ్చాయి. ఈ సంవత్సరం ఏప్రిల్ మే జూన్ నెలలో ఎండలు ఎక్కువగా ఉండటం వల్ల చాలామంది 300 యూనిట్లు కంటే కరెంటు ఎక్కువగా వాడారు. మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రూల్స్ ప్రకారం 300 యూనిట్ల కంటే ఎక్కువ కరెంటు వాడేవారు అమ్మ ఒడి పథకానికి అనర్హులు. ఈ కారణం వల్ల చాలామందికి ఈ పథకానికి సంబంధించిన నాలుగో విడత డబ్బుల పడకుండా ఆగిపోవడం జరిగింది.

జగనన్న అమ్మఒడి 2023
జగనన్న అమ్మఒడి 2023

అమ్మ ఒడి పథకానికి సంబంధించి కొన్ని సాధారణ రూల్స్:

  • విద్యార్థి తల్లి లేక సంరక్షకుడు ఒకే house hold mapping లో కలిగి ఉండాలి.
  • కరెంట్ బిల్లు 300 యూనిట్ల కంటే తక్కువగా ఉండాలి.
  • నాలుగు చక్రాల వాహనం కలిగి ఉండకూడదు, అయితే టాక్సీలు, ట్రాక్టర్లు కలిగి ఉండొచ్చు.
  • తల్లి లేక సంరక్షకుడు బ్యాంక్ అకౌంట్ కి ఆధార్ కార్డు నెంబర్ కలిగి ఉండాలి.
  • ఇంటి విస్తీర్ణం పట్టణ ప్రాంతాలలో 1000 చదరపు అడుగుల లోపు ఉండాలి.
  • భూమి అయితే మెట్ట మూడు ఎకరాల లోపు మాగానే అయితే ఏడు ఎకరాల లోపు మొత్తం కలిపి 10 ఎకరాలకు మించకుండా ఉండాలి.
  • ఇన్కమ్ టాక్స్ కట్టేవారుగా ఉండకూడదు.
  • ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్డ్ అయిన పెన్షన్ దారులు ఈ పథకానికి అనర్హులు.

పైన తెలిపిన కారణాలను బట్టి ఎవరైతే సాధిస్తారో వారికి మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అమ్మబడి పథకం ద్వారా ₹15000 రూపాయలు నేరుగా అర్హత కలిగిన తల్లుల ఖాతాల్లోకి జమ చేస్తుంది.

అమ్మ ఒడి పథకానికి సంబంధించి మీ ఖాతాలో నగదు జమయో లేదో తెలుసుకునేందుకు కింద ఉన్న దానిని క్లిక్ చేయండి 👇

PAYMENT STATUS

1 thought on “Ammavodi 2023; అమ్మ ఒడి 4 వ విడత ఇంకా మీకు పడలేదా? వెంటనే ఇలా చేస్తే 100% మీ ఖాతాలో ₹13,000 జమ అవుతుంది.”

Comments are closed.

Verified by MonsterInsights