ఆంధ్రప్రదేశ్ రైతులకు సీఎం జగన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా YSR RYTHU BHAROSA నిధులను విడుదల చేయనున్నారు. నవంబర్ 7వ తేదీన సీఎం జగన్ మోహన్ రెడ్డి శ్రీ సత్య సాయి జిల్లా పుట్టపర్తిలో పర్యటించనున్నారు.
ఈ సందర్భంగా YSR Rythu Bharosa – PM KISAN నిధులను రైతుల ఖాతాలలోకి కంప్యూటర్లో బటన్ నొక్కి జమ చేయనున్నారు. ఈ భారీ బహిరంగ సభ కార్యక్రమం కోసం సీఎం జగన్మోహన్ రెడ్డి మంగళవారం ఉదయం 9 గంటలకు తన నివాసమైన తాడేపల్లి నుండి బయలుదేరి శ్రీ సత్య సాయి జిల్లా పుట్టపర్తి కి వెళ్ళనున్నారు. అనంతరం ఆయన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించి ఆ తర్వాత కంప్యూటర్లో బటన్ నొక్కి rythu Bharosa – pm Kisan నగదును రైతుల ఖాతాలోకి జమ చేయనున్నారు ఇక ఈ కార్యక్రమం ముగిసిన అనంతరం మధ్యాహ్నం కానున్నారు ముఖ్యమంత్రి సీఎం జగన్.
YSR Rythu Bharosa -PM Kisan పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకునేందుకు క్రింది ఉన్న లింక్ ని క్లిక్ చేయండి:- Click here
YSR Rythu Bharosa ఈ ఏడాదికి సంబంధించిన తొలి విడత సాయాన్ని ఇప్పటికే రైతులు ఖాతాలోకి జమ చేసింది. ఇక రెండో విడత సాయాన్ని రేపు సీఎం జగన్ జమ చేయనున్నారు. YSR Rythu Bharosa పథకం కింద 53.53 లక్షల మంది రైతుల ఖాతాలోకి ₹2,204.77 కోట్ల రూపాయలు జమ చేయనున్నారు.
ఈ ఏడాది తొలి విడత కింద 7500 రూపాయలు చొప్పున 52.57 లక్షల మందికి గాను ₹3942.95 కోట్ల మేరకు నగదు సాయాన్ని అందించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఇప్పుడు రెండో విడత కింద ₹4000 చొప్పున 53.53 లక్షల మంది రైతులకు గాను ₹2204.77 కోట్ల రూపాయలను అందించనున్నారు.
కాగా YSR Rythu Bharosa కింద అర్హులైన ప్రతి రైతు కుటుంబానికి 13500 రూపాయల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తుంది. తొలి విడతలో 52,57,263 మంది ఖాతాలోకి నగదు విడుదల చేసింది. వీరిలో 50,19,187 సొంత భూమి కలిగిన వారు అయితే 1,46,324 మంది కవులు దారులు ఉన్నారు. 91752 మంది అటవీ భూ సాగుదారులు ఉన్నారు. వీరందరికీ ఒక్కొక్కరి ఖాతాలోకి 7500 రూపాయలు చొప్పున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి తొలి విడత కింద జూన్ 1వ తేదీన భూ యజమానదారులకు, సెప్టెంబర్ ఒకటో తేదీన కవులు దారులకు మరియు అటవీ సాగుదారులకు 3,942.95 కోట్ల రూపాయలను ఈ YSR Rythu Bharosa పథకం కింద అందించింది.
ఇక తాజాగా రెండో విడతలో 53,52,905 మంది రైతులు అర్హత పొందారు. వీళ్ళందరి ఖాతాలోకి ఏపీ సీఎం జగన్ రేపు కంప్యూటర్లో బటన్ నొక్కి నేరుగా వారి ఖాతాలోకి నిధులను జమ చేయనున్నారు. ఈ పథకంలో భాగంగా అర్హుల లిస్టు నుండి కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ అర్హుల లిస్టులో ఎవరి పేరు అయితే ఉంటుందో వారికి మాత్రమే రేపు డబ్బులు విడుదల చేసినప్పుడు ఖాతాలలో పడటం కూడా జరుగుతుంది.
అర్హుల లిస్టు చెక్ చేసుకునేందుకు ఈ క్రింది లింక్ ని క్లిక్ చేయండి:- Click here
ఈ వైయస్సార్ రైతు భరోసా పథకానికి వెబ్ లాండ్ ఆధారంగా అర్హులైన భూమి యొక్క యజమానుదారులతో పాటుగా దేవాదాయ అటవీ భూములను సాగు చేసే వారికి మాత్రమే కాకుండా సెంటు భూమి కూడా లేనటువంటి కవులు రైతులకు కూడా మే నెలలో తొలి విడత కింద ₹7500 రూపాయలు మరియు రెండవ విడత కింద అక్టోబర్ నెలలో ₹4000, మూడో విడత కింద జనవరి నెలలో ₹2000 రూపాయలు చొప్పున పెట్టుబడి సాయంని అందిస్తూ వస్తుంది.
ఈ పథకం కింద ఏపీ రాష్ట్ర ప్రభుత్వం 2019-20 లో 46,69,375 మంది రైతులకు 6173 కోట్ల రూపాయలను పెట్టుబడి సాయంగా అందించింది. 2020-21 లో 51,59,045 మందికి 6928 కోట్ల రూపాయలను లబ్ధి చేకూర్చగా 2021-22 లో 52,38,517 మంది రైతులకు 7016.59 కోట్ల రూపాయల సాయాన్ని పంపిణీ చేసింది. 2022-23 లో 51,40,943 మందికి 6944.50 కోట్ల రూపాయల పెట్టుబడి సాయం కింద రైతులు ఖాతాలోకి విడుదల చేసింది.
YSR Rythu Bharosa పథకం యొక్క పూర్తి వివరణ:
YSR Rythu Bharosa పథకంలో భాగంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి రైతుకి ₹13,500 సంవత్సరానికి విడతల వారీగా వేస్తుంది. అందులో కేంద్ర ప్రభుత్వం వాటా ₹6000 కాగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వాటా ₹7,500. మా యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రెండు విడతల్లో రైతుల ఖాతాలోకి నగదును చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం మాత్రం మూడు విడతల్లో జమ చేస్తుంది. ఈ నేపథ్యంలో మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తొలి విడత కింద ₹5500 రైతుల ఖాతాలోకి విడుదల చేస్తుంది. రెండవ విడత కింద మిగిలిన 2000 రూపాయలను రైతుల ఖాతాలోకి విడుదల చేస్తుంది.
కేంద్ర ప్రభుత్వం 6000 రూపాయలను మూడు విడతలుగా విడుదల చేస్తుంది. తొలి విడత కింద 2000, రెండో విడత కింద 2000, మూడో విడత కింద 2000 ఈ విధంగా రైతుల ఖాతాలోకి డబ్బులను విడుదల చేస్తుంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అర్హత పొందిన రైతులకు ఈ YSR Rythu Bharosa – PM Kisan పథకంలో భాగంగా పైన తెలిపిన విధానంలో డబ్బులను విడుదల చేస్తుంది. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం సొంత భూమి కలిగిన వారికి మరియు కౌలు రైతులకు, అటవీ భూమిని సాగు చేసుకునే వారికి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ వాటా అయినటువంటి 7500 రూపాయలను నేరుగా వారి ఖాతాలలోకి జమ చేస్తుంది.
అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం సొంత భూమి కలిగిన వారి ఖాతాలోకి మాత్రమే ఈ ఆరు వేల రూపాయలను విడతల వారీగా వేస్తుంది. కేంద్ర ప్రభుత్వం కవులు దారులకు, అటవీ భూమి సాగు చేసుకునే వారికి ఈ పథకం కింద డబ్బులు వేయదు.
నాకు రెండు సంవత్సరం నుండి రైతు భరోసా పడటం లేదు, గిరిభూమి వెబ్ సైట్ లో కూడా పెరు ఉన్న రైతు భరోసా పడలేదు, ఎవ్వరిని అడగాలో అర్ధం కాదు, పడ్డవాడికి ఆనందం లేని వారికీ దుఃఖం