YSR Kapu Nestham 2023; కాపు నేస్తం డబ్బులు త్వరలో విడుదల వెంటనే ఈ ప్రూఫ్స్ ఇక్కడ ఇవ్వండి

YSR Kapu Nestham వివరణ:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 45-60 సంవత్సరాల మధ్య వయస్సు గల కాపు, బలిజ, తెలగ, ఒంటరి మహిళలకు చేయూతనిచ్చే విధంగా ఈ YSR Kapu Nestham పథకాన్ని తీసుకువచ్చింది. ఈ పథకం BC కులాలకు చెందిన రేషన్ కార్డు కలిగినటువంటి మహిళల కోసం తీసుకువచ్చిన పథకం.

ఈ YSR కాపు నేస్తం పథకం కింద కాపు, బలిజ, తెలగ, ఒంటరి మహిళలకు 5 సంవత్సరాలకు కలిపి మొత్తం ₹75,000 జమ చేయడం జరుగుతుంది. ఈ YSR Kapu Nestham పథకానికి సంబంధించిన డబ్బులు ఒకే విడతలో కాకుండా మొత్తంగా 5 విడతలుగా లబ్ధిదారులకు పేమెంట్ విడుదల చేయడం జరుగుతుంది.

ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మహిళలకు జీవనోపాధి అవకాశాలు మరియు జీవన ప్రమాణాలను పెంపొందించడం. ఈ YSR Kapu Nestham పథకం ద్వారా మహిళలకు సంవత్సరానికి ₹15,000 చొప్పున నేరుగా లబ్ధిదారుల ఖాతాలోకి కంప్యూటర్ లో బటన్ నొక్కి సీఎం జగన్మోహన్ రెడ్డి జమ చేయడం జరుగుతుంది.

ఈ YSR Kapu Nestham పథకం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాపు వర్గానికి చెందిన మహిళల సంక్షేమం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి 2020 సంవత్సరంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చి అమలు చేస్తున్నారు.

అర్హుల జాబితా చెక్ చేసుకునేందుకు దీనిపై క్లిక్ చేయండి ➡️ Click here

ఈ వైయస్సార్ కాపు నేస్తం పథకానికి సంబంధించిన నిధులు గత ఏడాది అర్హత ఉండి కూడా ఎవరికైనా పడకపోతే అటువంటి వారందరికీ మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం తిరిగి మళ్ళీ ఈ పథకానికి గ్రీవెన్స్ పెట్టుకుంటే రెండో దశలో నిధులు విడుదల చేస్తామని ప్రకటించింది.

2022 సంవత్సరంలో ఈ YSR Kapu Nestham పథకానికి గాను ₹1101 కోట్లు రూపాయలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయించి లబ్ధిదారుల ఖాతాలోకి విడుదల చేయడం జరిగింది.

గత ఏడాది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి 3.2 లక్షల మంది కాపు కమ్యూనిటీలతో అనుసంధానించబడిన మహిళలకు పై డబ్బులను కేటాయించి వారు ఖాతాలోకి నేరుగా DBT ద్వారా జమ చేశారు.

YSR Kapu Nestham 2023:

ఈ వైఎస్ఆర్ కాపు నేస్తం 2023 సంస్థలకు సంబంధించిన నిధుల విడుదలకు సంబంధించి కొత్త వారెవరైనా అప్లై చేసుకోవడానికి లేదా అర్హత ఉండి కూడా గత ఏడాది డబ్బులు పడకుండా ఆగిపోయిన వారికి మళ్లీ కొత్తగా అప్లై చేసుకోవడం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జూలై 20వ తేదీన చివరి తేదీగా ప్రకటించింది.

ఈ జూలై 20వ తేదీలోగా ఎవరైతే YSR Kapu Nestham పథకానికి సంబంధించి అప్లై చేసుకుంటారో వారికి కూడా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ₹15000 రూపాయలను నేరుగా DBT ఖాతాలోకి విడుదల చేస్తుంది.

YSR Kapu Nestham 2023
YSR Kapu Nestham

అప్లై చేసుకోవడానికి కావలసిన ముఖ్యమైన పత్రాలు:

  • ఆధార్ కార్డు జిరాక్స్
  • కులం సర్టిఫికేటు జిరాక్స్
  • ఆదాయం సర్టిఫికేట్ జిరాక్స్
  • రేషన్ కార్డు జిరాక్స్
  • బ్యాంక్ అకౌంట్ కి లింక్ అయినా మొబైల్ నెంబరు
  • బ్యాంక్ అకౌంట్ కి ఆధార్ కార్డు తో మ్యాపింగ్ (NPCI) కలిగి ఉండాలి.
  • ఆధార్ కార్డ్ అప్డేటెడ్ హిస్టరీ

పైన తెలిపిన డాక్యుమెంట్స్ తీసుకుని సచివాలయంలో గాని లేదా వాలంటరీ దగ్గర గానీ ఇచ్చి ఈ వైఎస్ఆర్ కాపు నేస్తం పథకానికి సంబంధించి అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్నప్పుడు సంబంధిత అధికారులు యొక్క అప్లికేషన్ ని ఆరు దశలలో వెరిఫికేషన్ చేసి అర్హులు అయితే అర్హుల జాబితాలో మీ పేరుని చేరుస్తారు.

అర్హులైన ప్రతి ఒక్కరికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ YSR Kapu Nestham కింద నిధులను నేరుగా అర్హుల ఖాతాలోకే జమ చేస్తారు.

YSR Kapu Nestham 2023

YSR Kapu Nestham పథకం యొక్క అర్హతలు:

ఈ YSR Kapu Nestham పథకానికి సంబంధించి ఆర్థిక సాయం పొందేందుకు లబ్ధిదారులు ఈ క్రింది ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి.

  • ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన శాశ్వత నివాసి అయివుండాలి.
  • కుటుంబం ఆదాయం పట్టణ ప్రాంతాలలో ₹12,000 మరియు గ్రామీణ ప్రాంతాలలో ₹10,000 కంటే తక్కువగా ఉండాలి.
  • కుటుంబంలో నెలవారి విద్యుత్ వినియోగం 300 యూనిట్లు కంటే తక్కువగా ఉండాలి.
  • కుటుంబంలో మొత్తం భూమి మా గాని అయితే 3 ఎకరాలు, మెట్టైతే 7 ఎకరాలు కలిగి ఉండాలి. లేదా రెండూ కలిపి 10 ఎకరాలకు మించి ఉండకూడదు.
  • ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగం పదవి విరమణ పొందిన వారు అనగా పెన్షన్ పొందేవారు అనర్హులు. అయితే పారిశుద్ధ్య కార్మికులకు ఈ పథకం కింద మినహాయింపు ఉంటుంది.
  • ఆదాయపు పొన్ను చెల్లించేవారు కుటుంబంలో ఎవ్వరు ఉండకూడదు.
  • ఫోర్ వీలర్ వాహనాలు కలిగి ఉండకూడదు. (ట్రాక్టర్లు, టాక్సీలు, క్యాబ్లు వీటికి మాత్రం మినహాయింపు ఉంటుంది)
  • పట్టణ ప్రాంతాలలో ఇంటి స్థలం 1000 చదరపు అడుగుల కంటే తక్కువగా ఉండాలి. (నివాస ప్రాంతం లేదా వాణిజ్య ప్రాంతం)
  • వయస్సు 45-60 సంవత్సరాల మధ్య కలిగిన మహిళలై ఉండాలి.
  • వయసు కోసం పుట్టిన తేదీ రుజువు ఇంటిగ్రేటెడ్ కుల ధ్రువీకరణ పత్రం (కులం, పుట్టిన తేదీ, నేటివిటీ) ఉండాలి. లేదా జనన ధ్రువీకరణ పత్రం / SSC మార్కుల లిస్టు లేదా ఆధార్ కార్డు ఏదైనా ఒకటి ఉండాలి.
  • కాపు, బలిజ, తెలగ మరియు ఒంటరి సంఘాలకు చెందిన మహిళలు అయి ఉండాలి.

పైన తెలిపిన అర్హతలకు అనుగుణంగా ఎవరైతే ఉంటారో అటువంటి మహిళలందరికీ ఈ వైయస్సార్ కాపు నేస్తం పథకం కింద ₹15000 రూపాయలను సంవత్సరానికి ఒకసారి ఖాతాలలో వేయడం జరుగుతుంది.

వైయస్సార్ కాపు నేస్తం నిధుల విడుదల తేదీ:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతి సంవత్సరం కూడా కాపు సంబంధిత కులాలకు వైయస్సార్ కాపు నేస్తం పథకం కింద 15 వేల రూపాయలను నేరుగా లబ్ధిదారుల ఖాతాలోకి జమ చేయడం జరుగుతుంది.

అయితే గత ఏడాది 2022 లో చూస్తే జూలై మాసంలోనే విడుదల చేశారు. కానీ ఈ 2023 సంవత్సరంలో ఆగస్టు నెలలో ఈ పథకాన్ని అమలు చేసే అవకాశం కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఇంకా అధికారికంగా ప్రకటించిన తేదీ విడుదల కాలేదు.

ఈ YSR Kapu Nestham పథకానికి సంబంధించి అర్హుల జాబితా చెక్ చేసుకునేందుకు దీనిపై క్లిక్ చేయండి 👇👇

Eligible List Check

3 thoughts on “YSR Kapu Nestham 2023; కాపు నేస్తం డబ్బులు త్వరలో విడుదల వెంటనే ఈ ప్రూఫ్స్ ఇక్కడ ఇవ్వండి”

  1. DreamHost: DreamHost is a well-established hosting provider, known for its solid uptime and fast-loading websites. They offer a wide range of hosting options, including shared, VPS, and dedicated hosting.
    HostGator: HostGator is known for its affordable plans and reliable performance. They offer unlimited storage and bandwidth, a variety of hosting options, and excellent customer support. http://webward.pw/.

Comments are closed.

Verified by MonsterInsights