Thalliki Vandanam 2025:
ఆంధ్ర ప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ లో సూపర్ సిక్స్ పథకాలను ఒక్కొక్కటిగా అమలు చేసే దిశగా కీలక ప్రకటన విడుదల చేసింది. ఎన్నికల సమయంలో.. తల్లికి వందనం [Thalliki Vandanam 2025] పేరుతో ఒక ఇంటిలో ఎంతమంది విద్యార్థులు ఉన్నా ఏడాదికి రూ.15 వేల చొప్పున అందిస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ.. ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో చదువుతున్న వారందరికీ తల్లికి వందనం పథకాన్ని అమలు చేయాలని కూటమి ప్రభుత్వ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ తల్లికి వందనం పథకం అమలుపై కీలక ప్రకటన చేశారు.
తల్లికి వందనం పథకం అర్హుల లిస్ట్ చెక్ చేసుకోండి: Click Here
హైలైట్:
ఏపీలో తల్లికి వందనం పథకం [Thalliki Vandanam 2025] అమలు విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని కీలక ప్రకటన పథకం ఎప్పటి నుంచి అమలు చేస్తారో చెప్పారు. ఏపీలో తల్లికి వందనం రూ.15వేలు ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీల అమలుపై ఫోకస్ పెట్టింది. అధికారంలోకి వచ్చిన వెంటనే వరుసగా పథకాలను అమలు చేస్తోంది. సూపర్ సిక్స్ హామీలను కూడా ఒక్కొక్కటిగా ప్రారంభించాలని ప్లాన్ చేస్తోంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉన్నా సరే పథకాల అమలు కోసం ప్రయత్నం చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు అంటున్నారు. ఆయా పథకాలకు సంబంధించి త్వరలోనే మార్గదర్శకాలను విడుదల చేసి అమలు చేయాలనుకుంటున్నారు. అయితే ఏపీ ప్రభుత్వం మరో రెండు పథకాల కోసం కసరత్తు చేస్తోంది. వాటిలో ముఖ్యమైనవి తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలు. వీటి అమలు కోస ప్రణాళికల్ని సిద్ధం చేస్తున్నారు.
తల్లికి వందనం పథకం అమలు:
ఏపీలో తల్లికి వందనం పథకం అమలుపై ప్రభుత్వం దృష్టిసారించింది. తల్లికి వందనం పథకం అమలు చేసే విషయం పై విజయవాడ MP కేశినేని శివనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తల్లికి వందనం పథకం మే నుంచి అమలు కాబోతుందని తెలిపారు.. విద్యా శాఖలో మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో సమూలమైన మార్పులు తీసుకురావడం ఆదర్శనీయమన్నారు. అలాగే రాష్ట్రంలో విద్యా శాఖను అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం సంపూర్ణ మద్దతు ఉంటుంది అన్నారు. విద్య, క్రీడల్లో ఎన్టీఆర్ జిల్లాను మోడల్‌గా అభివృద్ధి చేస్తామన్నారు విజయవాడ ఎంపీ.
రాష్ట్రము లోని విద్యార్థులు ఆరోగ్యంగా ఉండాలంటే క్రీడలు [ఆటలుఆడడం] అవసరమనే సంకల్పంతో 147 పాఠశాలల్లోని [ఆట స్థలాలను] క్రీడా ప్రాంగణాలను బాగుచేశామని తెలిపారు. ఎనిమిది రకాల ఆటల పరికరాలు అందించాము. డిసెంబరు, జనవరి మధ్యలో జిల్లా క్రీడా పోటీలు నిర్వహించుకొని సత్తా చాటుదాము’ అన్నారు కేశినేని చిన్ని. విజయవాడ- తిరువూరు డివిజన్ల పరిధిలోని ప్రభుత్వ స్కూళ్లకు ఎంపీ సొంత నిధులతో ఆట వస్తువుల పంపిణీ కార్యక్రమంలో ఎంపీ చిన్ని పాల్గొన్నారు. విజయవాడ కొత్తపేటలోని కేబీఎన్ కళాశాలలో క్రీడా వికాసం పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
తల్లికి వందనం పథకం అర్హుల లిస్ట్ చెక్ చేసుకోండి : Click Here