TG Ration cards 2024: రాష్ట్రవ్యాప్తంగా దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న నిరుపేదలకు రాష్ట్రప్రభుత్వం రేషన్ కార్డులను పంపిణీ చేస్తుంది. ఈ రేషన్ కార్డు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. రేషన్ కార్డు వల్ల మనకు ఎన్నో ఉపయోగాలు ఉంటాయి.. లబ్దిదారులకు ఆహార ధాన్యాలు, బియ్యం, గోధుమలు , జొన్నలు నిత్యావసర సరుకులు తక్కువ ధరలకు లభిస్తాయి.
అంతే కాదు రేషన్ కార్డు {TG Ration cards} చాలా ముఖ్యమైన ప్రభుత్వ గుర్తింపు కార్డుగా పరిగణిస్తారు. ఆధార్, బ్యాంక్ లావేవీలు, ప్రభుత్వ పథకాలకు రేషన్ కార్డు ఎంతో అవసరం ఉంటుంది. ఇటీవల తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల కోసం పౌర సరఫరాల శాఖ కసరత్తు ప్రారంభించింది. ఈ ప్రక్రియ పూర్తికాగానే రేషన్ కార్డు జారీ వేగవంతం చేయాలనే ఆలోచనలో ఉంది తెలంగాణ ప్రభుత్వం. తాజాగా రేషన్ కార్డు లబ్దిదారులకు గుడ్ న్యూస్ చెప్పింది రేవంత్ రెడ్డి సర్కార్. వివరాల్లోకి వెళితే..
Ration Card Application Download Now: Click here
తెలంగాణలోని {TG Ration cards} తెల్ల రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. వచ్చే ఏడాది నుంచి రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ చేయాలని తెలంగాణ సర్కార్ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి కొత్త రేషన్ కార్డు జారీ, విధివిధానల ఖారారుకు సంబంధించిన అంశాలపై ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ ఈ మేరకు కీలక ప్రకటన విడుదల చేసింది. రేషన్ దుకాణాలు, మధ్యాహ్న భోజన పథకం ద్వారా ప్రతి సంవత్సరం 24 లక్షల టన్నుల దొడ్డు రేషన్ బియ్యం పంపిణీ అవుతున్నట్లు కమిటీ గుర్తించింది.
TG Ration Cards రేషన్ కార్డులు:
దీనిలో సగానికి పైగా రేషన్ బియ్యం పక్కదారి మళ్లుతున్నాయని తెలిపారు. ప్రస్తుతం అంగన్ వాడీ, కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రమే సన్న రేషన్ బియ్యం పంపిణీ జరుగుతుందని.. వచ్చే సంవత్సరం నుంచి రేషన్ కార్డుదారులకు సన్న రేషన్ బియ్యం మంజూరు చేయాలని నిర్ణయించుకుంది.
New Ration Card Application & Status: Click here
ఇదిలా ఉంటే తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు గ్యారెంటీ పథకాల్లో భాగంగా {TG Ration cards} కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చారు. ఇటీవల ప్రజా పాలన కార్యక్రమంలో లక్షల సంఖ్యల్లో రేషన్ కార్డుల దరఖాస్తులే వచ్చాయని తెలిపింది తెలంగాణ ప్రభుత్వం. ఇప్పటికే ఈ ప్రక్రియ మొదలునట్లు వార్తలు ప్రచురమవుతున్నాయి. పాత రేషన్ కార్డుల స్థానంలో కొత్త రేషన్ కార్డులు ముద్రించి ఇవ్వాలనే ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. అంతేకాదు ఏటీఎం తరహాలో స్వైపింగ్ కార్డులు ఇవ్వాలని రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.