తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే 6 పథకాల పూర్తి విధివిధానాలు 2024

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే ఆరు పథకాలకు కావలసిన డాక్యుమెంట్లు అప్లై చేసుకునే విధానం మరియు అర్హులు చెక్ చేసుకునే విధానం తెలుసుకుందాం:

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం ఎన్నికల మేనిఫెస్టోలో ఆరు గ్యారెంటీ పథకాలను ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలో భాగంగా ఈ ఆరు గ్యారెంటీ పథకాలను కేవలం 100 రోజుల్లోనే అమలు చేస్తామని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

దీనికి సంబంధించి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పరిపాలన కూడా తీసుకువచ్చింది. ఈ ప్రజా పరిపాలనలో ఎవరైతే అప్లికేషన్లు పెట్టుకొని ఎవరైతే అప్లై చేసుకుంటారు అటువంటి వారికి అర్హతలను పరిశీలించిన పిమ్మట నేరుగా ఈ యొక్క ఆరు పథకాలకు సంబంధించి లబ్ధి చేకూరుస్తుంది.

కాంగ్రెస్ ప్రభుత్వం వంద రోజులలో అమలు చేయనున్న ఆరు గ్యారెంటీ పథకాలు ఇవే:

1. మహాలక్ష్మి పథకం:

ఈ మహాలక్ష్మి పథకం కింద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అర్హత కలిగినటువంటి మహిళలకు ఒక 3 పథకాలను అమలు చేయబోతుంది. ఈ మూడు పథకాలలో మొదటిదిగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణం. ఈ ఉచిత బస్సు ప్రయాణాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు సోనియా గాంధీ పుట్టిన రోజు సందర్భంగా మన తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మరియు డిప్యూటీ సీఎం గా ఉన్న భట్టి విక్రమార్క గారు చేతుల మీదుగా ఈ పథకాన్ని ప్రారంభించారు.

ఈ ఉచిత బస్సు ప్రయాణాన్ని చేయాలంటే కచ్చితంగా వాళ్లు తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి మహిళలు అయి ఉండాలి. కేవలం ఆధార్ కార్డు కలిగి ఉంటే చాలు ఈ ఉచిత బస్సు ప్రయాణంలో రాష్ట్ర వ్యాప్తంగా TS RTC బస్సుల్లో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించవచ్చు. ఈ విధంగా మహాలక్ష్మి పథకంలోని మూడు పథకాలలో మొదటి పథకాన్ని అమలు చేస్తుంది మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం.

మహాలక్ష్మి పథకంలోని రెండవ పథకం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ₹2500 రూపాయలను ప్రతి నెల పంపిణీ చేయడం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకానికి సంబంధించి దాదాపుగా 25 లక్షల మందికి పైగా మహిళలు ప్రజా పరిపాలనలో భాగంగా దరఖాస్తు చేసుకున్నారు. ప్రస్తుతం మన యొక్క రాష్ట్రవ్యాప్తంగా ప్రజా పరిపాలనలో వచ్చినటువంటి అప్లికేషన్లను డేటా ఎంట్రీ చేస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తయిన అనంతరం అర్హత కలిగినటువంటి మహిళలందరికీ వచ్చే నెల నుంచి ₹2500 రూపాయలను ఈ మహాలక్ష్మి పథకంలో భాగంగా ప్రతి నెల పంపిణీ చేయబోతుంది మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.

మహాలక్ష్మి పథకంలోని మూడవ పథకం రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి వంటగ్యాస్ సిలిండర్ వాడుతున్నటువంటి వారందరికీ కూడా కేవలం 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పంపిణీ చేయడం. ఈ పథకాన్ని కూడా మనకు త్వరలో పంపిణీ చేయాలని అనగా ప్రారంభించాలని మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి విధివిధానాలపై కసరత్తులు ప్రారంభించాలని తెలంగాణ రాష్ట్ర అధికార యంత్రాంగానికి సూచించడం జరిగింది.

మహాలక్ష్మి పథకంలోని ఈ మూడు పథకాలను కూడా మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రానున్నటువంటి సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మొదటగా అమలు చేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది.

అర్హుల జాబితా చెక్ చేసుకునేందుకు దీనిపై క్లిక్ చేయండి: Click here

2. రైతు భరోసా (రైతు బంధు) పథకం:

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఎంతో ప్రతిష్టాత్మకంగా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయబోతున్నటువంటి పథకమే ఈ “రైతు భరోసా”. గత బిఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు రైతుబంధు ద్వారా రెండు విడతల రూపంలో ₹10,000 రూపాయలను ఒక్కో విడతలో ₹5,000 చొప్పున ప్రతి ఏటా రైతులకు పంపిణీ చేసేది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు మరో ₹5,000 రూపాయలను పెంచి రైతు భరోసా పథకం గా దీని పేరు మార్చి 15 వేల రూపాయల చొప్పున అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క రైతుకి ఏటా మూడు విడతలగా అంటే ఒక్కో విడతలో ₹5,000 రూపాయల చొప్పున పంపిణీ చేయనున్నట్లు తెలుస్తుంది.

ఈ రైతు భరోసా పథకం ద్వారా సొంత భూమి కలిగిన రైతులకే కాకుండా కౌలు రైతులకు కూడా ₹15,000 రూపాయలను ఇస్తామని మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇక ఈ రైతు భరోసా పథకంలో భాగంగా ఎవరైతే వ్యవసాయ కూలీలు ఉంటారో అటువంటి వారందరికీ ₹12,000 రూపాయలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వనున్నట్లు ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది.

ఇక ఈ రైతు భరోసా పథకానికి సంబంధించి ఇంకా పూర్తి విధివిధానాలు ఖరారు చేయకపోవడంతో ప్రస్తుతం మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఈ యాసంగి సీజన్ క సంబంధించిన డబ్బులను పంపిణీ చేయడం కోసం గత ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి విధివిధానాల ద్వారానే అనగా రైతుబంధు పథకం లెక్కలోనే రాష్ట్ర వ్యప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఎకరాకి ₹5,000 రూపాయలు చొప్పున పంపిణీ చేసింది.

మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రైతు భరోసా పథకానికి సంబంధించిన పూర్తి విధివిధానాలు ఖరారు అయిన తరువాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ రైతు భరోసా పథకం కింద 15 వేల రూపాయల చొప్పున పంపిణీ చేస్తామని తెలిపారు.

ఈ పథకానికి కావలసిన డాక్యుమెంట్లు:

రైతు కూలీలకు చూసినట్లయితే రేషన్ కార్డు, ఆధార్ కార్డు ఈ రైతు కూలీల పేరిట ఎటువంటి భూమి రిజిస్టర్ అయి ఉండకూడదు. అలాగే కూలీలుగా గుర్తించబడేటువంటి లేబర్ సర్టిఫికెట్ కూడా ఉండాలి.

రైతు భరోసా పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోవడం కోసం దీన్ని క్లిక్ చేయండి : Click here

 6 గ్యారంటీ పథకాలు

3. ఇందిరమ్మ ఇండ్లు పథకం:

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇల్లు లేనటువంటి వారందరికీ ఇంటి స్థలం మరియు ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు చొప్పున పంపిణీ చేయడం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యమకారులు అనగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడడానికి ఎవరైతే ఉద్యమాలలో పాల్గొని ఉంటారు అటువంటి వారందరికీ మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 250 చదరపు గజాల ఇంటి స్థలాన్ని కూడా పంపిణీ చేయడం జరుగుతుంది.

ఈ పథకానికి సంబంధించి కావలసిన డాక్యుమెంట్లు:

రేషన్ కార్డు, ఆధార్ కార్డు, కులం మరియు ఆదాయం సర్టిఫికెట్లు ఇచ్చి అప్లై చేసుకోవాలి.

గమనిక: ఇందిరమ్మ ఇండ్లు పథకానికి సంబంధించి ఎవరైతే అప్లై చేసుకుంటారు వారి పేరు మీద గతంలో ఇల్లు ఉండకూడదు.

అర్హుల జాబితా చెక్ చేసుకునేందుకు దీనిపై క్లిక్ చేయండి: Click here

4. గృహజ్యోతి పథకం:

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు రేవంత్ రెడ్డి సర్కార్ ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల కరెంట్ ని ఉచితంగా పంపిణీ చేస్తుంది. ఈ పథకానికి సంబంధించి పూర్తి విధివిధానాలు ఖరారు చేయాలని వచ్చే నెలలో ఈ పథకాన్ని అమలు చేయాలని అధికారులను ఆదేశించింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అయితే 200 యూనిట్ల వరకు ఉచితంగా కరెంటు పంపిణీ చేస్తుంది 200 యూనిట్లు గనక దాటినట్లయితే మొత్తానికి బిల్లు చెల్లించేలాగున ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు కొంత సమాచారం.

ఈ పథకానికి సంబంధించి కావలసిన డాక్యుమెంట్లు:

రేషన్ కార్డు, ఆధార్ కార్డు, గృహ నివాస సర్టిఫికెట్, కరెంట్ బిల్లు కచ్చితంగా కలిగి ఉండాలి.

పైన తెలిపిన డాక్యుమెంట్స్ కలిగి ఉన్న వారికి మాత్రమే 200 యూనిట్ల ఉచిత కరెంట్ పథకం వర్తిస్తుంది.

అర్హుల జాబితా చెక్ చేసుకునేందుకు దీనిపై క్లిక్ చేయండి: Click here

తెలంగాణ 6 గ్యారంటీ పథకాలు

5. చేయూత పథకం:

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నెలవారి పింఛన్లను అందివ్వడమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ పథకం ద్వారా వృద్ధాప్య దారులకు, ఒంటరి మహిళ పెన్షన్ దారులకు, వితంతు పెన్షన్ దారులకు, చేనేత కార్మికులకు, బీడీ టేకేదారు జీవన భృతి, ఫైలేరియా బాధితులకు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు, డయాలసిస్ బాధితులకు, కల్లుగీత కార్మికులకు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ₹4,000 రూపాయల చొప్పున పెన్షన్లను పెంచి పంపిణీ చేస్తుంది. దివ్యాంగులకు మాత్రం మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ₹6,000 రూపాయల పెన్షన్లను పెంచింది.

ఈ చేయూత పథకం ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెంచినటువంటి పెన్షన్లను పొందుకోవాలంటే ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా పెన్షన్లు తీసుకుంటున్నటువంటి వారు అప్లై చేసుకోవలసిన అవసరం లేదు. కానీ కొత్తవారు కచ్చితంగా అప్లై చేసుకోవాలి ప్రజా పరిపాలన దరఖాస్తు ఫారం పూరించి అప్లై చేసుకున్నట్లయితే అప్లై చేసుకున్నటువంటి లబ్ధిదారుల యొక్క అర్హతలను ప్రామాణికంగా తీసుకుని అర్హత కనక ఉన్నట్లయితే ఈ పథకాన్ని వారందరికీ మన ప్రభుత్వం త్వరలోనే అమలు చేస్తుంది.

ఈ పథకానికి కావలసినటువంటి డాక్యుమెంట్లు :

రేషన్ కార్డు, ఆధార్ కార్డు, రోగులు ఎవరైనా ఉంటే వారికి సంబంధించిన సర్టిఫికెట్లు, దివ్యాంగులు ఎవరైనా ఉంటే వాళ్ల యొక్క డిసబిలిటీకి సంబంధించినటువంటి సదరం సర్టిఫికెట్లు, వృత్తిపరమైన పెన్షన్ల కోసం వారు చేస్తున్న పని యొక్క సర్టిఫికెట్లు, ఒంటరి మహిళ పెన్షన్లకు సంబంధించి విడాకులు తీసుకున్నట్లుగా సర్టిఫికెట్లు ఇచ్చి అప్లై చేసుకోవాలి.

అర్హుల జాబితా చెక్ చేసుకునేందుకు దీనిపై క్లిక్ చేయండి: Click here

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే 6 గ్యారంటీ పథకాలు

6. యువ వికాసం పథకం:

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు యువ వికాసం పథకం కింద ఐదు లక్షల విద్యా భరోసా కార్డులను మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండలంలో కూడా తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ ని ప్రవేశ పెట్టడం జరుగుతుంది.

అర్హుల జాబితా చెక్ చేసుకునేందుకు దీనిపై క్లిక్ చేయండి: Click here

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఈ ఆరు గ్యారెంటీ హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయనుంది ఇవన్నీ కూడా కేవలం 100 రోజులు లోపల అమలు చేయాలని రేవంత్ రెడ్డి సర్కార్ ప్రణాళికలు సిద్ధం చేస్తూ ఆదిశగా అడుగులు వేస్తుంది.

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అమలయ్యే ఆరు పథకాలకు సంబంధించిన అర్హులు లిస్టులు చెక్ చేసుకోండి: Click here

Verified by MonsterInsights