Rythu Runamafi (రుణమాఫీ) 2023 రెండో విడత డబ్బులు పడుతున్నాయ్ వెంటనే తీసుకోండి

Rythu Runamafi (రుణమాఫీ) రాష్ట్రంలో రైతులకు అమలు చేస్తున్న రెండో విడత రుణమాఫీని నెలన్నర రోజుల్లో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు. ఇప్పటికే రూ.50 వేల లోపు రుణాలను మాఫీ చేశామని, ఆ పైన ఉన్న వారికి చెల్లింపుల
ప్రక్రియను గురువారం నుంచే పునఃప్రారంభించాలని సూచించారు.

అన్నదాతలకు తీపి కబురు రూ. 19 వేల కోట్ల నిధుల విడుదలకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాలు జారీ చేశారు. నేటి నుంచి రెండో విడత ప్రక్రియ.. నెలన్నర లోపు ముగింపు బ్యాంకుల లోని కర్షకుల రుణ ఖాతాల్లో జమ రైతుబంధు తరహాలో విడతల వారీగా అమలు రైతు రుణమాఫీ ఆదేశాలపై సీఎం కేసీఆర్ ధన్యవాదాలు చెబుతున్న రైతుబంధు సమితి అధ్యక్షుడు MLC పల్లా రాజేశ్వర రెడ్డి గారు, MLA లు జీవన్ రెడ్డి గారు మరియు బాల్క సుమన్ గారు

రాష్ట్రంలో రైతులకు అమలు చేస్తున్న రెండో విడత Rythu Runamafi (రుణమాఫీ) నెలన్నర రోజుల్లో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు. ఇప్పటికే రూ.50 వేల లోపు రుణాలను మాఫీ చేశామని, ఆ పైన ఉన్న వారికి చెల్లింపుల ప్రక్రియను గురువారం నుంచే పునః ప్రారంభించాలని సూచించారు. మొత్తం రూ.19 వేల కోట్లను అన్నదాతలకు అందిస్తామని తెలిపారు.

Rythu Runamafi
Rythu Runamafi

రైతుబంధు తరహాలో విడతల వారీగా కొనసాగిస్తూ నెలన్నర రోజుల్లో… అంటే సెప్టెంబరు రెండో వారం వరకు Rythu Runamafi (రుణమాఫీ) కార్యక్రమాన్ని సంపూర్ణంగా అమలు చేయాలన్నారు. ఈ మేరకు బుధవారం ప్రగతిభవన్లో రైతు రుణమాఫీ పై సమీక్ష నిర్వహించారు. సమావేశంలో ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రవు, ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సీఎం ప్రధాన సలహాదారు సోమేశ్ కూమార్, పురపాలక ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద కుమార్, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునంద రావు పాల్గొన్నారు.

కేంద్రం తీసుకున్న పెద్దనోట్ల రద్దు నిర్ణయంతో ఏర్పడిన ఆర్థిక మందగమనం, కరోనా ప్రభావంతో వచ్చిన ఆర్థిక సమస్యలు, ఎస్ఆర్బీఎం నిధులను విడుదల చేయకుండా తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం అనుసరించిన కక్షపూరిత చర్యలు… తదితర కారణాలతో ఆర్థికలోటు ఏర్పడిందని సీఎం వివరించారు. ఫలితంగా రుణమాఫీకి కొంత ఆలస్యమైందన్నారు. తిరిగి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చక్కదిద్దుకున్న నేపథ్యంలో, రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని పునఃప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.

రైతుల సంక్షేమమే ధ్యేయం ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, “2018 ఎన్నికల సందర్భంగా ఇచ్చిన మాట ప్రకారం, Rythu Runamafi (రుణమాఫీ) కార్యక్రమం అమలును ప్రారంభించాం. కరోనా వంటి అనుకోని ఉపద్రవాలతోపాటు కేంద్ర ప్రభుత్వ వైఖరి కారణంగా కార్యక్రమం కొనసాగింపు లో కొంతకాలం పాటు జాప్యం జరిగింది. అయినా రైతులకు అందించాల్సిన రైతుబంధు, రైతుబీమా, ఉచిత విద్యుత్తు, సాగునీరు వంటి పథకాలను రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో నిరంతరంగా కొనసాగిస్తూనే వస్తోంది.

ఎన్ని కష్టనష్టాలు వచ్చినా, ఆరునూరైనా రైతుల సంక్షేమాన్ని, వ్యవసాయాభివృద్ధి కార్యాచరణను విస్మరించే ప్రసక్తే లేదు. త్వరలో ప్రత్యేక ఆహారశుద్ధి యూనిట్ల స్థాపన వంటి ఆదర్శవంతమైన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నాం. రైతులు సాధికారత సాధించే వరకు, వారిని ఆర్థికంగా ఉన్నతంగా తీర్చిదిద్దే వరకు విశ్రమించబోం” అని సీఎం స్పష్టంచేశారు.


కేసీఆర్ రైతుబాంధవుడు: Rythu Runamafi (రుణమాఫీ)


Rythu Runamafi (రుణమాఫీ)ని
పూర్తి చేసేందుకు ఆదేశాలిచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్కు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి రైతుబాంధవుడని మరోసారి నిరూపించుకున్నారు. కరోనా మూలంగా రాష్ట్రం లక్ష కోట్ల రూపాయల ఆదాయాన్ని నష్టపోయింది. అయినా రైతులకు ఇబ్బంది కలగకుండా రైతుబంధు నిధులను రైతుల ఖాతాల్లో జమ చేశాం. రుణమాఫీ విషయంలో మభ్యపెట్టేందుకు విపక్షాలు ప్రయత్నించినా… ఎన్నో చేసిన కేసీఆరే రుణమాఫీ చేస్తారనే నమ్మకంతో రైతులు వారి మాటలను విశ్వసించలేదు” అని ఆయన అన్నారు.
20230803 112750 1024x683


(Rythu Runamafi) రైతు రుణమాఫీ అమలు


మొదటి విడత:
రాష్ట్ర ప్రభుత్వం మొదట 2014 మార్చి 31 వరకు ఉన్న రూ.లక్ష వరకు వ్యవసాయ రుణాలను రద్దు చేస్తూ నాలుగు విడతల్లో 35,31,913 మంది రైతులకు రూ.16,144.10 కోట్ల రుణమాఫీ చేసింది.

రెండో విడత: 01 ఏప్రిల్ 2014 తేదీ నుంచి 2018 డిసెంబరు 11 నాటికి రాష్ట్రంలో బ్యాంకుల ద్వారా రూ.లక్ష లోపు అప్పులు తీసుకున్న 42.56 లక్షల మంది రైతులకు రూ.28,930 కోట్ల రుణాలకు అసలు, వడ్డీ కలిపి కుటుంబానికి రూ.లక్ష చొప్పున మాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఇందులో మొదటి దఫాలో రూ.25వేల లోపు బాకీ ఉన్న 2,96,571 లక్షల మంది రైతులకు రూ.408.38 కోట్ల ను ప్రభుత్వం రద్దుచేసింది. రెండో దఫాలో రూ.50 వేల లోపు బాకీ ఉన్న 2,46,038 లక్షల మంది రైతులకు సంబంధించిన రూ.798.99 కోట్ల ను మాఫీ చేసింది. ఇవి పోను రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు రుణము ఉన్న 29.11 లక్షల మంది రైతులకు రుణమాఫీ కోసం తాజాగా రూ.19 వేల కోట్లను విడుదల చేయనుంది. దీని ద్వారా తెలంగాణలో రైతు రుణమాఫీ సంపూర్ణం అవుతుందని ప్రభుత్వ వర్గాలు వివరించాయి.


రుణమాఫీ సంబరాలు :

BRS శ్రేణులకు కేటీఆర్ పిలుపు రైతు రుణమాఫీ ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా భారీ ఎత్తున సంబరాలు నిర్వహించాలని తమ పార్టీ శ్రేణులకు భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కెటిఆర్ పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం రైతన్నల సంక్షేమం, వారి అభివృద్ధి కోసం తొమ్మిదేళ్లుగా అనేక కార్యక్రమాలను అమలు చేస్తోంది. వారికిచ్చిన హామీ మేరకు ఇప్పుడు రుణమాఫీని కూడా వెంటనే పూర్తి చేయాలని నిర్ణయించడం అత్యంత సంతోషకరమైన విషయం. అనేక సందర్భాల్లో రైతుల వెన్నంటి నిలిచిన పార్టీ శ్రేణులు తాజాగా రుణమాఫీ అంశంలోనూ..

Rythu Runamafi 2023
Rythu Runamafi

వారితో కలిసి సంబరాలను నిర్వహించుకోవాలి. ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జులు, జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో ప్రతి గ్రామం, మండలం, నియోజకవర్గం, జిల్లా కేంద్రాల్లో పెద్ద ఎత్తున రైతుల అందరితో కలిసి ఎవరికి తోచినవిధంగా వారు సంబరాలను నిర్వహించాలి. గురువారం నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవుతున్నప్పటికీ ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాలను సమన్వయం చేసుకోవాలి. రైతుబంధు సమితి సభ్యులతోపాటు సహకార సంఘాల ప్రతినిధులు కూడా పాల్గొనాలి” అని కేటీఆర్ ఆదేశాలు జారీ చేశారు.

PAYMENT STATUS CHECK

అర్హుల లిస్టు చేసుకునేందుకు దీనిపైన క్లిక్ చేయండి: Click here


2 thoughts on “Rythu Runamafi (రుణమాఫీ) 2023 రెండో విడత డబ్బులు పడుతున్నాయ్ వెంటనే తీసుకోండి”

  1. సార్ నాకు వడ్డీ మాఫీ కాలేదు. తీసుకున్న డబ్బులు ₹ 38000. దీనికి వడ్డీ ₹25185. మాఫీ కాలేదు. మీరు ఇచ్చిన స్టేట్ మెంట్ లో అసలు మరియు వడ్డీతో సహా చెల్లించాము అంటున్నారు. ఇదెక్కడి న్యాయం సార్.

  2. మేము 23/07/2018 లో 99000లోన్ తీసుకన్నాము ఎప్పుడు బ్యాంకు లో రుణమాఫీ డబ్బులు రాలేదు అంటున్నారు మేము ఏం చేయాలి

Comments are closed.

Verified by MonsterInsights