Rythu Bharosa 2025:
Rythu Bharosa 2025: తెలంగాణ రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు భరోసా పంట పెట్టుబడి సాయం నిధులు విడుదల చేసింది. బుధవారం ఎకరం లోపు వ్యవసాయదారుడు సాగు చేస్తున్న భూములకు డబ్బులు జమ చేశారు. మెుత్తం 17.03 లక్షల మంది వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నటువంటి అన్నదాతల ఖాతాల్లో ఎకరాకు రూ.6 వేల రూపాయల చొప్పున జమ చేశారు. మిగిలిన వ్యవసాయదారులకు త్వరలనోనే జమ చేస్తామని ఏ వ్యవసాయ దారుడు కూడా టెన్షన్ పడాల్సిన పని లేదని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు వెల్లడించారు.
రైతు భరోసా పథకం డబ్బులు పడలేదా..?
అయినా టెన్షన్ పడాల్సిన పని లేదు ప్రభుత్వం కీలక అప్డేట్ రైతు భరోసా పథకం
తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకం ప్రారంభించిన సంగతి తెలిసిందే. రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న రాష్ట్రవ్యాప్తంగా 563 గ్రామాల్లో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డుల పంపిణీ, ఇందిరమ్మ ఇండ్ల పంపిణీతో పాటుగా రైతు భరోసా పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రారంభించింది. పథకాలు ప్రారంభమైన తర్వాతి రోజు నుంచి రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అయ్యే ప్రక్రియ మెుదలైంది. రైతు భరోసా [Rythu Bharosa 2025] పంట పెట్టుబడి సాయం కింద రాష్ట్రవ్యాప్తంగా ఎకరం వరకు సాగులో ఉన్న భూములకు బుధవారం (ఫిబ్రవరి 5) నిధులు విడుదలయ్యాయి.
రైతు భరోసా డబ్బులు విడుదల పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోండి: Click Here

మెుత్తం 17.03 లక్షల మంది రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసినట్లు తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు వెల్లడించారు. తొలి విడతలో 563 గ్రామాల్లోనే నిధులు విడుదల చేయగా.. తాజాగా రెండో విడత కింద రాష్ట్రవ్యాప్తంగా ఎకరం వరకు సాగు భూములకు ఎకరాకు రూ.6 వేల చొప్పున నిధులు విడుదల చేసినట్లు తెలిపారు. అత్యధికంగా నల్గొండ జిల్లాలో 1.55 లక్షల మందికి, సిద్దిపేట జిల్లాలో 1.20 లక్షలు , మెదక్ జిల్లాలో 1.15 లక్షలు , సంగారెడ్డి జిల్లాలో 1.15 లక్షల మంది రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసినట్లు చెప్పారు.

కాగా, చాలా మంది రైతులు తమ అకౌంట్లలో డబ్బులు పడలేదని ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో సర్కార్ నుంచి కీలక అప్డేట్ వచ్చింది. రైతులకిచ్చిన మాట ప్రకారం రైతుభరోసా పంట పెట్టుబడి సాయం నిధులను నిర్ణీత కాలవ్యవధిలో అందరికీ చెల్లిస్తామన్నారు. అందుకు రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని చెప్పారు. ప్రస్తుతం ఎకరం వరకు మాత్రమే నిధులు జమ చేశామని వెల్లడించారు. మిగిలిన నిధులను త్వరలోనే విడుదల చేస్తామని ఆయన పేర్కొన్నారు. రైతులు ఏమాత్రం టెన్షన్ పడాల్సిన అవసరం లేదని మరియు సాగులో ఉన్న ప్రతి ఎకరాకు రైతు భరోసా పథకానికి సంభందించిన పంట పెట్టుబడి సాయం అందించనున్నట్లు ఆయన చెప్పారు. ఇప్పటికే రైతుబంధు కోసం రూ.7,625 కోట్లు, రూ.2 లక్షల రైతు రుణమాఫీకి రూ.20,616.89 కోట్లు, రైతు బీమా పథకానికి రూ.3,000 కోట్ల చొప్పున విడుదల చేసినట్లు వివరించారు.
రైతు భరోసా పంట పెట్టుబడి:
[Rythu Bharosa 2025] రైతు భరోసా పంట పెట్టుబడి సాయం కింద వ్యవసాయం చేసే రైతులకు జనవరి నెల 27 తేదీ నుంచి ఇప్పటి వరకు 21,45,330 మంది రైతులకు గాను రూ.1,126 కోట్లు రూపాయలను జమ చేసినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. బుధవారం ఒక్కరోజే ఎకరం వరకు సాగు చేస్తున్న 17.03 లక్షల రూపాయల వరకు వ్యవసాయదారిని ఖాతాల్లో రూ.6 వేల చొప్పున నిధులు జమ చేశామని తెలిపారు. త్వరలోనే 2, 3 ఎకరాల రైతులకు, ఆ తర్వాత సాగులో ఉన్న ప్రతి ఎకరాకు నిధులు జమ చేస్తామన్నారు. కాగా పలు జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ ఆన్‌గోయింగ్ పథకం కాబట్టి ఈసీ అభ్యంతరం చెప్పలేదని తెలుస్తోంది.
రైతు భరోసా డబ్బులు విడుదల పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోండి: Click Here