New Ration Cards 2024: ఆంధ్రప్రదేశ్ లో కొత్త రేషన్ కార్డులు పాతవి రద్దు అర్హతలు ఇవే…

Ration cards:

ఆంధ్రప్రదేశ్ లో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభం కానున్నట్లు ఇప్పటికే రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు ప్రకటించారు. ఇక కొత్తగా పెళ్లయిన జంటలకు.. మ్యారేజ్ సర్టిఫికేట్ ఆధారంగా రేషన్ కార్డులు జారీ చేయనున్నట్లు తెలిపారు. ఇక గత ప్రభుత్వ హయాంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వం 2019 నుంచి 2024 వరకు జారీ చేసిన రేషన్ కార్డులపై జగన్ ఫోటోను ముద్రించి, వైసీపీ రంగులు కలిపి ఇచ్చింది. అయితే జగన్ బొమ్మ, వైసీపీ రంగులను పూర్తిగా తొలగించి.. రాష్ట్రవ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలోనే కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన డిజైన్లను అధికారులు పరిశీలిస్తున్నారు.

Ration Card Status Click here

ఇక ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం 1.48 కోట్ల రేషన్ కార్డులు {Ration cards} ఉన్నాయి. ఇందులో ఆహార భద్రత చట్టం కింద కేంద్ర ప్రభుత్వం 89 లక్షల రేషన్ కార్డులకు మాత్రమే నిత్యావసర సరకులు అందిస్తోంది. మిగిలిన కార్డులకు రేషన్ సరుకుల ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తూ వస్తోంది. అయితే వాటన్నింటిని కూడా కేంద్ర ఆహార భద్రతా చట్టం పరిధిలోకి తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం డిమాండ్ చేస్తుంటే.. అందుకు నిబంధనలు అంగీకరించవని కేంద్రం దాటేస్తోంది.

కొత్త రేషన్ కార్డులు

ఇక ఇటీవలె ఢిల్లీకి వెళ్లిన కేంద్ర మంత్రుల్ని కలిసిన పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు అక్కడి నుంచే రేషన్ కార్డులపై కీలక ప్రకటనను విడుదల చేసారు. కొత్తగా పెళ్లి అయిన వారు కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకుంటే.. వారికి ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. అర్హత ఉన్నవారికి త్వరలోనే కొత్త రేషన్ కార్డులు అందిస్తామని తేల్చి చెప్పారు.

AP New Ration Cards 2024
AP New Ration Cards 2024

ఈ క్రమంలోనే గత వైసీపీ ప్రభుత్వం రేషన్ డోర్ డెలివరీ అంటూ రూ.1800 కోట్ల రూపాయలను వృథా చేసిందని మంత్రి మనోహర్ వివరించారు. రేషన్ డోర్ డెలివరీపై కేబిటనెట్ భేటీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పాడు. అయితే గతంలో అధికారంలో ఉన్న జగన్ ప్రభుత్వం.. రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకుంటే 5 రోజుల్లోనే అర్హులైన వారందరికీ మంజూరు చేస్తామని 2020లో ప్రకటించింది. అయితే ఆ తర్వాత కొన్నిరోజులకు.. సచివాలయాల ద్వారా కేవలం రెండున్నర గంటల్లోనే రేషన్ కార్డులను జారీ చేస్తామని చెప్పింది. కానీ ఐదేళ్ల వైసీపీ పాలనలో కేవలం 1.10 లక్షల కొత్త రేషన్ కార్డులు మాత్రమే జారీ చేసింది.

2019 జూన్ లో వైసీపీ అధికారంలోకి వచ్చే సమయానికి రాష్ట్రంలో 1,47,33,044 రేషన్ కార్డులు ఉండగా.. 2024 ఆగస్టు వరకు వాటి సంఖ్య 1,48,43,671కి పెరిగింది. మరోవైపు.. పెళ్లైన వారికి కొత్తగా కార్డులు జారీ చేయాలంటే.. అప్పటికే వారి కుటుంబానికి ఉన్న రేషన్ కార్డుల నుంచి పేర్లు తొలగించాల్సి ఉంటుంది.

అయితే వాటికి మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. దీంతో కొత్తగా పెళ్లైన జంటలకు మాత్రం కొత్త రేషన్ కార్డులు అందలేదు. అయితే ఈ సమస్యను పరిష్కరించేందుకు మ్యారేజ్ సర్టిఫికేట్ ఆధారంగా కొత్తగా పెళ్లయిన వారికి రేషన్ కార్డు {New Ration cards} జారీ చేయాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది.

New Ration Card Status Check : Click Here

Verified by MonsterInsights