ఏపి రేషన్ కార్డు eKYC:
01 ఏప్రిల్ 2025 నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులో పేరు ఉన్న ప్రతి ఒక్కరికి ఏపీ రేషన్ కార్డు eKYC అయి ఉండాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రాష్ట్ర ప్రజలు ఎటువంటి బెనిఫిట్ అయిన పొందాలంటే కచ్చితంగా రేషన్ కార్డుకి ఆధార్ కార్డు నెంబర్ లింక్ చేయాలి. దీనినే eKYC అని అంటారు.
గతంలో టిడిపి హయాంలో పల్స్ సర్వే పేరుతో eKYCన ని ప్రారంభించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం వాలంటీర్ల ద్వారా eKYC ని ఇంటింటికి వాలంటీర్ల ద్వారా రేషన్ కార్డులో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి eKYC చేయించడం తప్పనిసరి చేసింది. ఈ ఈకేవైసీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులో ఉన్న ప్రతి ఒక్క లబ్ధిదారుడు తప్పనిసరిగా కలిగి ఉండాలి. ఒకవేళ ఈ కేవైసీ చేయించుకోకుండా ఉన్నట్లయితే అతను ప్రభుత్వం నుంచి ఎటువంటి లబ్థని కూడా పొందలేరు.
రేషన్ కార్డు వల్ల ఉపయోగాలు:
జాతీయ ఆహార భద్రత రేషన్ కార్డు కలిగిన వారికి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సంక్షేమ పథకాలతో పాటు ప్రతి నెలలో కూడా రేషన్ షాపుల ద్వారా సబ్సిడీ రేట్లకే రేషన్ సరుకులు మరియు బియ్యంతో పాటు చిరుధాన్యాలు పప్పులు కూడా పంపిణీ చేస్తుంది.
అదేవిధంగా అంత్యోదయ అన్న యోజన కార్డు లబ్ధిదారులకు 30 కేజీలు చొప్పున బియ్యం కూడా పంపిణీ చేస్తుంది. ఈ దారిద్ర రేఖకు దిగువుగా ఉన్నటువంటి రేషన్ కార్డుల వివరాలు అందరికీ కేంద్ర ప్రభుత్వం ఉచిత బియ్యాన్ని కూడా పంపిణీ చేస్తుంది. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏ పథకానికైనా అర్హత సాధించాలి అంటే కచ్చితంగా రేషన్ కార్డు లబ్ధిదారుడై ఉండాలి.
ఈ కారణం చేత రేషన్ కార్డు అనేది ప్రతి ఒక్కరికి ఎంత ముఖ్యమో ఈజీగా అర్థమవుతుంది. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు లబ్ధిదారులకు మార్చి 31 వ తారీకు అంతా రేషన్ కార్డుకి ఆధార్ కార్డు ఈ కేవైసీ కచ్చితంగా పూర్తి చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ఆదేశాలు జారీ చేసింది.
ఎవరైతే మార్చి 31 లోపు eKYC చేసుకోకుండా ఉంటారో అటువంటి వారందరికీ ఏప్రిల్ ఒకటో తారీకు నుంచి రేషన్ సరుకులను నిలిపివేయడంతో పాటు ప్రజా సంక్షేమ పథకాలను కూడా నిలిపివేయడం జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డు లబ్ధిదారులకు సూచించింది.
కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎవరైతే లబ్ధిదారులు eKYC ఇప్పటివరకు చేసుకోకుండా ఉన్నారు అటువంటి వారందరూ కూడా ఈ కేవైసీ చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు ఆయా ప్రాంతాలలో ఉన్నటువంటి రేషన్ షాపు డీలర్లు వాళ్ల వద్దకు వచ్చిన eKYC పెండింగ్ లిస్టులను చేతులు పట్టుకొని ఆ ఈకేవైసీ పెండింగ్ లిస్టులో ఉన్నటువంటి ప్రతి ఒక్క మెంబర్ కి తెలియచేస్తున్నారు.
గతంలో ఈ కేవైసీ సచివాలయంలో ఉన్నటువంటి వాలంటీర్ల ద్వారా చేసేవారు కానీ ఇప్పుడు వాళ్లు అందుబాటులో లేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క ఈ కేవైసీ బాధ్యతను రేషన్ షాపులో ఉన్న డీలర్లకు ఇవ్వడం జరిగింది.
AP Ration Card Status Check Now: Click Here
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకారం 5 సంవత్సరాలు పైబడి నుండి 60 సంవత్సరాల కంటే వయసు తక్కువ ఉన్న వాళ్లకు కచ్చితంగా ఈకేవైసీ చేయించాలి. ముఖ్యంగా 5 సంవత్సరాల పైబడిన పిల్లలకి ఆధార్ సెంటర్కు తీసుకొని వెళ్లి వాళ్ళ బయోమెట్రిక్స్ అంటే చేతి వేళ్ళ ముద్రలు అప్డేట్ చేయించుకోవాలి అలా అప్డేట్ చేసుకుంటేనే వారికి రేషన్ కార్డుతో ఈకేవైసీ చేసేటప్పుడు ఈ కేవైసీ అవుతుంది. లేదంటే ఫింగర్ ప్రింట్ మ్యాచ్ కావు అదే విధంగా 15 ఏళ్లు నిండిన పిల్లలందరికీ కూడా ఇదే విధంగా ఫింగర్ ప్రింట్స్ ని ఆధార్ సెంటర్లో అప్డేట్ చేసుకుని ఈ యొక్క ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకోవాలి.
eKYC మీకు అయ్యిందో లేదో చెక్ చేసుకొనే ప్రాసెస్:
ఇప్పటివరకు మీ యొక్క కుటుంబాలలో రేషన్ కార్డులో ఉన్నటువంటి పేర్లన్నీ కూడా ఈకేవైసి పూర్తి అయిందో లేదో తెలుసుకోవడానికి మీ మొబైల్ లేదా మీ PC లో ఇప్పుడు నేను చెప్పే ప్రాసెస్ ని ఫాలో అవ్వండి.
eKYC Status Link: Click Here

Step 1: క్రింద ఇవ్వబడిన లింక్ ని మీరు క్లిక్ చేసి ఓపెన్ చేసినట్లయితే మీకు మొట్టమొదటిగా ఈ పేజీ వస్తుంది ఇందులో ఉన్న ఫస్ట్ ఆప్షన్ ని సెలెక్ట్ చేయండి

Step 2: తర్వాత మీకు ఈ పేజీ ఓపెన్ అవుతుంది ఇందులో ఫస్ట్ ఆప్షన్ రిపోర్ట్స్ క్లిక్ చేయండి అందులో ఎంఐఎస్ ఆప్షన్ కనిపిస్తుంది దాని పైన క్లిక్ చేయండి తరువాత రేషన్ కార్డ్ ఆర్ రైస్ కార్స్ సెర్చ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది దానిపైన మీరు క్లిక్ చేయండి.

Step 3: మీ దగ్గర రేషన్ కార్డ్ నెంబర్ లేదా కొత్తగా ఇచ్చిన రైస్ కార్డ్ నెంబర్ ని మీకు తర్వాత ఇక్కడ చూపిస్తున్నటువంటి బాక్స్ లో ఎంటర్ చేసి ఆర్సి డీటెయిల్స్ పైన క్లిక్ చేయాలి అక్కడ మీరు క్లిక్ చేస్తే ముందు మీ రేషన్ కార్డ్ పనిచేయనిది మరియు డిలీట్ అయిపోయినది మరియు సరెండర్ చేసినటువంటి కార్డు కాకుండా మీరు ప్రస్తుతం ప్రతి నెల కూడా యాక్టివ్గా రేషన్ తీసుకుంటున్నటువంటి రేషన్ కార్డు నెంబర్ ని మాత్రమే ఎంటర్ చేయాలి.

Step 4: తరువాత పేజీలో ఈ విధంగా మీకు కనిపిస్తుంది ఇందులో ఆర్సీ స్టేటస్ దగ్గర యాక్టివ్ అని లేకుండా నో ఈ కేవైసీ అని ఉంటే ఆ వ్యక్తికి కచ్చితంగా రేషన్ షాప్ డీలర్స్ వద్దకు తీసుకుని వెళ్లి పీకే వేసి చేయించాలి ఒకవేళ ఈకేవైసీ మీకు పడకపోతే ఆధార్ సెంటర్ కి వెళ్లి బయోమెట్రిక్ ని అప్డేట్ చేసుకుని ఆ తర్వాత పీకేవైసీ ని ప్రారంభించండి అప్పుడు మీకు విజయవంతంగా పూర్తి అవుతుంది.
