కేంద్ర ప్రభుత్వం Ration Card దారులకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. దీని ద్వారా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 80 కోట్ల మంది రేషన్ కార్డుదారులకు మేలు చేకూర పోతుంది. జూన్ 30, 2023 తో ఆధార్ కార్డుతో రేషన్ కార్డ్ కి అనుసంధానం ప్రక్రియ గడువు తీరిపోతున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం ఈ గడువును మరో మూడు నెలల పాటు పొడిగించినట్టు డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ గెజిట్ నోటిఫికేషన్ను విడుదల చేసింది.
Ration Card కి ఆధార్ కార్డు ని లింక్ చేయడంలో కేంద్ర ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే? దారిద్ర రేఖకు దిగువుగా ఉన్న కుటుంబాలకు మాత్రమే ఈ రేషన్ కార్డు వర్తిస్తుంది. కానీ కొంతమంది అర్హత లేకపోయినా రేషన్ కార్డు ను కలిగి ఉన్నారు. ఇలా కలిగి ఉండటం వల్ల ప్రభుత్వం యొక్క ధనం అనేది వృధా అవుతుంది. ఎవరైతే దారిద్రేకకు దిగువుగా ఉన్న నిరుపేద కుటుంబాలు కలిగి ఉంటారో అటువంటి వారికి రేషన్ కార్డు ఉన్నట్లయితే అది వారికి ఎంతైనా ఉపయోగపడుతుంది.
ఇది కూడా చదవండి : తెలంగాణ రైతు బంధు 2023 వానాకాలం సీజన్ 5,500/-రూ విడుదల తేది వెంటనే తెలుసుకోండి
Ration Card తో కలిగే ఉపయోగాలు:
రేషన్ కార్డు ద్వారా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీతో బియ్యం, కందిపప్పు, గోధుమలు, జొన్నలు, రాగులు, చక్కెర ఇలాంటి సరుకులన్నీ చౌక ధరల దుకాణం ద్వారా పంపిణీ రేషన్ కార్డు కలిగినటువంటి వారికి పంపిణీ చేస్తారు. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైనా పథకాలు అమలు చేయాలంటే ఈ రేషన్ కార్డులు ముఖ్య పాత్ర పోషిస్తాయి. ఎవరైతే ఈ Ration Card ను కలిగి ఉంటారో అటువంటి వారికి మాత్రమే ప్రభుత్వం నుంచి వచ్చే సబ్సిడీలు మరియు పథకాలు వర్తిస్తాయి. అలాగే రేషన్ కార్డు ని కొన్నిచోట్ల అడ్రస్ ప్రూఫ్ గా కూడా ఉపయోగించుకోవచ్చు. ఈ రేషన్ కార్డు తో కలిగేటువంటి ప్రయోజనాలన్నీ సక్రమంగా అర్హులకు మాత్రమే అందించాలని కేంద్ర ప్రభుత్వం ఆధార్ కార్డుతో Ration Card కి అనుసంధానం ప్రక్రియను చేసుకోవాలని కొత్త రూల్ తీసుకువచ్చింది.
ఇది కూడా చదవండి : వైస్సార్ రైతు భరోసా 2023 ఇంకా పడకపోతే ఇలా చేయండి
Ration Card కు ఆధార్ తో అనుసంధానం :
మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వారైతే మీ యొక్క వాలంటీర్ ని సంప్రదించి ఆధార్ కార్డుకి రేషన్ కార్డు తో అనుసంధానం ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు. ఒకవేళ మీరు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వారైతే మీ దగ్గరలో ఉన్నటువంటి Ration షాపుకు వెళ్లి e-pass యంత్రం ద్వారా ఆధార్ కార్డుతో రేషన్ కార్డు కి అనుసంధానం చేసుకోవచ్చు.
Note: రేషన్ కార్డు కి ఆధార్ కార్డుతో అనుసంధానం ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం మరో మూడు నెలల పాటు అంటే సెప్టెంబర్ 30 వరకు పొడిగించడం జరిగింది.
మీ యొక్క రేషన్ కార్డు స్థితి తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి 👇
ఆంధ్రప్రదేశ్ రేషన్ కార్డు Link :- Click here
తెలంగాణ రేషన్ కార్డు Link :- Click here