రైతులకు కేంద్రం నుంచి ఇప్పుడే ఊహించని పెద్ద శుభవార్త వచ్చింది. PM Kisan Yojana సమ్మన్నిది 14 విడత డబ్బులను త్వరలో విడుదల చేయబోతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ PM Kisan Yojana పథకం ద్వారా అర్హత కలిగిన ప్రతి ఒక్క రైతుకి సంవత్సరానికి ₹6000 రూపాయలను అందిస్తుంది. అందులో మొదటి విడత కింద ₹2000 రెండో విడత కింద ₹2000 మూడో వ్యక్తి కింద ₹2000 వాయిదా పద్ధతిలో కేంద్ర ప్రభుత్వం రైతులు ఖాతాల్లోకి నేరుగా వేస్తుంది.
PM Kisan Yojana కి సంబంధించిన పథకం కింద ఇప్పటివరకు 13 విడతల డబ్బులను విడుదల చేశారు. ఇప్పుడు 14వ విడత డబ్బులను విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తులు చేస్తుంది. ఈ 13 విడతలకు గాను కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు రైతులకు ₹26,000 రూపాయలను ఖాతాలోకి పంపింది. ఇక ఈ 14వ విడత జమ చేసినట్లయితే కేంద్ర ప్రభుత్వం ద్వారా ఈ పథకం కింద ప్రతి రైతుకి ₹28,000 రూపాయల వరకు జమ చేసినట్లు అవుతుంది.
ఈ PM Kisan Yojana సంబంధించిన పథకానికి సంబంధించిన రైతులకు వారి ఖాతాలోకి డబ్బులు పడాలంటే కొన్ని రూల్స్ ని కేంద్ర ప్రభుత్వం సవరించి విడుదల చేసింది అవేంటో ఇప్పుడు మనం చూద్దాం:
PM Kisan Yojana పథకానికి సంబంధించిన అర్హతలు:
1. భారతదేశానికి సంబంధించిన నివాసి అయి ఉండాలి. 2. సొంత భూమి కలిగి ఉండాలి. 3. దారిద్ర రేఖకు దిగుగా ఉన్నటువంటి తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలి. 4. పట్టాదార్ పాస్ బుక్ తో పాటు ఆధార్ కార్డు కచ్చితంగా కలిగి ఉండాలి. 5. ఆధార్ కార్డుకి బ్యాంక్ అకౌంట్ ని కూడా కచ్చితంగా NPCI లింక్ అనేది చేసుకొని ఉండాలి. 6. సవరించిన రూల్స్ లో భాగంగా ఆధార్ కార్డ్ కి PM Kisan Yojana పథకంతో e-KYC ద్వారా లింక్ చేసుకోవాలి.
Note:- మీకు దగ్గరలో ఉన్నటువంటి కామన్ సర్వీస్ సెంటర్ (CSC) కి వెళ్లి మీ ఆధార్ కార్డు నెంబర్ తో వేలిముద్ర వేసి ఈ PM Kisan Yojana పథకానికి సంబంధించి ఈకేవైసీ కంప్లీట్ చేసుకోవచ్చు. లేదా Online కూడా ఈ యొక్క eKYC ని కంప్లీట్ చేసుకోవచ్చు.
ఈ అర్హతలు కలిగిన రైతులకు కేంద్ర ప్రభుత్వం ఈ PM Kisan Yojana పథకం ద్వారా సంవత్సరానికి మూడు విడతల్లో పెట్టుబడి సాయంగా 6000 రూపాయలు చొప్పున నేరుగా డిపిటి ద్వారా రైతుల ఖాతాల్లోకి డబ్బులను జమ చేస్తుంది.
ఇది కూడా చదవండి : వైస్సార్ రైతు భరోసా డబ్బులు ఇంకా పడలేదా వెంటనే ఇలా చేయండి
PM Kisan Yojana 14వ విడత విడుదల తేది:
ఈ PM Kisan Yojana పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే రైతులకు పెట్టుబడి సహాయంగా ఎంతో కొంత వారికి ఆసరాగా ఉంటుందనే ఉద్దేశంతో ప్రారంభించబడింది. అందుకనే ఈ పథకానికి సంబంధించిన డబ్బులను కేంద్ర ప్రభుత్వం సీజన్ ప్రారంభానికి ముందే అర్హత కలిగిన రైతులకు నేరుగా వారి ఖాతాలోకి అందిస్తూ వస్తుంది.
ఇది కూడా చదవండి : తెలంగాణ రైతు బంధు 2023 వానాకాలం సీజన్ 5,500/-రూ విడుదల తేది వెంటనే తెలుసుకోండి
అయితే కేంద్ర ప్రభుత్వం ఈ 14వ విడత డబ్బులను వానాకాలం సీజన్ ప్రారంభానికి ముందే అంటే మే నెలలోనే రైతుల ఖాతాలోకి జమ చేయాల్సి ఉండగా ఈసారి మాత్రం జూన్ వచ్చిన సరే ఇంకా డబ్బులను విడుదల చేయలేదు. దీంతో రైతులు ఎదురుచూపులు చూడాల్సి వస్తుంది. గత సంవత్సరంలో చూసుకుంటే మే నెలలోనే PM Kisan Yojana సంబంధించిన ₹2,000 విడుదల చేశారు. కానీ ఈ సంవత్సరం మాత్రం జూన్ మూడవ వారంలో అంటే 20వ తేదీ లోపు రైతులు ఖాతాలోకి జమ చేయవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీని పైన ఇంకా కేంద్ర ప్రభుత్వం ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు.
అర్హుల లిస్టులు చెక్ చేసుకునే విధానం :
ELIGIBLE LIST CHECK
పైన ఉన్న ELIGIBLE LIST CHECK అనే దాని పైన క్లిక్ చేయండి
వెంటనే మీకు ఈ విధంగా ఒక పేజీ ఓపెన్ అవుతుంది. అందులో మీ యొక్క State ని సెలెక్ట్ చేసుకోండి తర్వాత మీ District ని మీ యొక్క Sub-District ని అలాగే Block ని తర్వాత మీ యొక్క Village ని ఇవి సెలెక్ట్ చేసుకున్న తర్వాత Get Report అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి.
తరువాత వెంటనే పైన ఇమేజ్ లో చూపిన విధంగా అర్హుల లిస్టు ఓపెన్ అవుతుంది. ఈ లిస్టులో ఎవరి పేరు అయితే ఉంటుందో వారికి మాత్రమే ఈసారి PM Kisan Yojana పథకానికి సంబంధించిన 14 విడత వారి ఖాతాలోకి జమవుతుంది.
e-KYC ఆన్లైన్ లో చేసుకునే విధానం:
e KYC Link
పైన ఉన్న e-KYC Link అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి
ఈ విధంగా మీకు ఒక పేజీ ఓపెన్ అవుతుంది. అందులో మీ యొక్క ఆధార్ కార్డు నెంబర్ ని ఎంటర్ చేసి Search అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. తర్వాత మీ యొక్క ఆధార్ కార్డు నెంబర్ లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్ కి ఒక OTP వస్తుంది. దానిని ఎంటర్ చేయండి OTP ని ఎంటర్ చేసిన తర్వాత Submit ఆప్షన్ క్లిక్ చేయండి అప్పుడు నీకు స్క్రీన్ పైన కేవైసీ డన్ అనే ఆప్షన్ చూపిస్తుంది అంతే ఇక మీకు ఈ కేవైసీ ఈ పీఎం కిసాన్ పథకానికి సంబంధించి పూర్తయినట్టు అవుతుంది.
గమనిక: PM Kisan Yojana పథకానికి సంబంధించి e-KYC చేసుకోవడానికి కచ్చితంగా మీ యొక్క ఆధార్ కార్డు నెంబర్ కి మొబైల్ నెంబర్ ని లింక్ కలిగి ఉండాలి. మీ మొబైల్ నెంబర్ కి ఆధార్ తో లింక్ లేకపోతే మీరు ఈ ప్రక్రియను పూర్తి చేయలేరు.
అలాంటప్పుడు మీరు Offline లో మీ దగ్గరలో ఉన్నటువంటి CSC (కామన్ సర్వీస్ సెంటర్) సెంటర్ కి వెళ్లి ఆధార్ కార్డు నెంబర్ ద్వారా వేలిముద్రతో మీరు e-KYC ని పూర్తి చేసుకోవచ్చు.
I did not received the money from pm kisan yojana
Pm kisam amount not send my account
No
Naadhi land seeding no ani chupisthundhi ippudu nenu emi cheyaali beneficiary list lo matram naa peru chupisthundhi
Pmkisan amont raalaedu
Hello to every , as I am actually keen of reading this web site’s post to be updated on a regular basis.
It includes nice material.