పీఎం కిసాన్ సమ్మన్ నిధి యోజన 14వ విడత నిధులను కేంద్ర ప్రభుత్వం జూలై 27 తేదీన రైతుల ఖాతాలోకి విడుదల చేస్తుంది. దీనికి సంబంధించిన తేదీని అధికారికంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ పథకం కింద రైతులకు 2000 రూపాయలు మరియు కొంతమందికి 4000 రూపాయలు జమ చేయనున్నారు.
కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రైతులు కోసం తీసుకువచ్చిన పథకాలలో ఈ PM కిసాన్ సమ్మన్ నిధి యోజన పథకం చాలా ప్రాముఖ్యమైనది. ఈ పథకం కింద అర్హత కలిగిన ప్రతి రైతుకి 6000 రూపాయలు విడతల వారీగా కేంద్ర ప్రభుత్వం జమ చేస్తుంది.
ఈ పథకానికి సంబంధించిన డబ్బులను మూడు విడతల్లో రైతులకు జమ చేయడం జరుగుతుంది. మొదటి విడత కింద ₹2000, రెండో విడత కింద ₹2000, మూడో విడత కింద ₹2,000 ఇలా అర్హత కలిగిన ప్రతి రైతుకి కేంద్ర ప్రభుత్వం జమ చేస్తుంది.
అయితే PM కిసాన్ సమ్మన్ నిధి యోజన పథకానికి సంబంధించి 14 వ విడత లో కొంత మందికి 2000 రూపాయలు మరి కొంతమందికి 4 వేల రూపాయలు జమ అయ్యే అవకాశం ఉంది. 4000 రూపాయలు ఎవరికి పడుతుంది అంటే గత విడత అనగా 13వ విడత కింద నిధులు విడుదల చేసినప్పుడు ekyc ఎవరైతే చేసుకోకుండా ఉండేరో అటువంటి వారికి ekyc పూర్తి చేసుకున్నట్లయితే 13వ విడత మరియు 14 విడత కలిపి ₹4,000 రూపాయలు రైతులు ఖాతాలోకి పడతాయి.
మరి కొంతమంది రైతులకు 2000 రూపాయలు జమ కానుంది. అంటే 13 విడత ఎవరికైతే 2000 రూపాయలు జమయ్యాయో వారికి 14 విడత మాత్రమే పడుతుంది కాబట్టి ఈ రైతులకు 2000 రూపాయలు మాత్రమే జమవుతాయి.
Eligible List
PM కిసాన్ సమ్మన్ నిధి యోజన అర్హుల లిస్ట్ చెక్ చేసుకునే విధానం:
మొదటగా మీరు మీ మొబైల్ లోని వెబ్ బ్రౌజర్ ని ఓపెన్ చేసి అందులో https://pm kisan.gov.in అని టైప్ చేసి సెర్చ్ చేయండి. అందులో మీకు PM కిసాన్ సమ్మన్ నిధి యోజన అధికారిక వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో
బెనిఫిషరీ లిస్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాని పైన క్లిక్ చేయండి తరువాత మీకు కేరింత చూపబడిన పేజీ ఓపెన్ అవుతుంది.
అందులో స్టేట్, డిస్ట్రిక్ట్, సబ్ డిస్ట్రిక్ట్, బ్లాక్, విలేజ్ ని సెలెక్ట్ చేసుకోండి అన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్లూ కలర్ బటన్ Get Report అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసినట్లయితే మీకు నెక్స్ట్ పేజీలో
ఈ విధంగా ఓపెన్ అవుతుంది. అందులో మీరు ఇచ్చినటువంటి డీటెయిల్స్ ప్రకారం మీ ఏరియాలో ఉన్న ఈ PM కిసాన్ సమ్మన్ నిధి యోజన పథకానికి అర్హులు ఎవరైతే ఉంటారో వారి పేర్లు మీకు కనిపిస్తాయి. అందులో మీ పేరు ఉంటే కచ్చితంగా మీకు PM కిసాన్ సమ్మన్ నిధి యోజన పథకానికి సంబంధించిన 14 విడత డబ్బులు 2000 రూపాయలు మీ ఖాతాలో జమవుతాయి.
ఈ యొక్క అర్హుల లిస్టులో మీ పేరు గనక లేకపోతే మీకు ఈ పథకానికి సంబంధించిన డబ్బులు మీ ఖాతాలోకి జమ కావు.
పిఎం కిసాన్ సంబంధి అర్హుల లిస్టు చెక్ చేసుకునేందుకు దీనిపైన క్లిక్ చేయండి: Click here
PM కిసాన్ సమ్మన్ నిధి యోజన పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకునే విధానం:
మొదటగా మీరు మీ యొక్క మొబైల్ బ్రౌజర్ ఓపెన్ చేసి అందులో PM కిసాన్ అధికారిక వెబ్సైట్ కి వెళ్ళాలి. అందులో మీకు క్రింద చూపబడిన విధంగా కనిపిస్తుంది.
అందులో మీరు నౌ యువర్ స్టేటస్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. తర్వాత మీకు క్రింద చూపబడిన విధంగా మరో పేజీ ఓపెన్ అవుతుంది.
అందులో మీరు మీ యొక్క PM కిసాన్ సమ్మన్ నిధి యోజన పథకానికి రిజిస్టర్ నెంబర్ను ఎంటర్ చేసి క్రింద కనిపిస్తున్న captcha code ని ఎంటర్ చేసి Get Data ఆప్షన్ పై క్లిక్ చేయండి.
మీకు మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ తెలియకపోతే ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు చూద్దాం. మీరు ఈ క్రింద చూపబడిన విధంగా Know your registration no ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయండి.
దాని పైన క్లిక్ చేసిన తరువాత మీకు నెక్స్ట్ పేజీలో ఈ విధంగా ఓపెన్ అవుతుంది.
అందులో మీరు మీయొక్క మొబైల్ నెంబరు లేదా ఆధార్ నెంబర్తో మీయొక్క registration number ను తెలుసుకోవచ్చు. పైన చూపిన విధంగా మీరు మొదటగా దేన్నైనా ఒక దాన్ని సెలెక్ట్ చేసుకోండి తర్వాత మీరు ఉదాహరణకు మొబైల్ నెంబర్ సెలెక్ట్ చేసుకుంటే అక్కడ మీరు మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి.
లేదా ఆధార్ కార్డు సెలెక్ట్ చేసుకుంటే అందులో ఆధార్ కార్డు నెంబర్ వేయాలి. వేసిన తర్వాత పైన చూపిన విధంగా captcha code నీ ఎంటర్ చేసి Get Mobile OTP అని బ్లూ కలర్ బట్టల పైన క్లిక్ చేయండి.
తరువాత మీరు ఇచ్చినటువంటి నంబర్ కి ఒక OTP వస్తుంది అది ఎంటర్ చేశాక మీకు పై ఇమేజ్ లో చూపిన విధంగా registration number నువ్వు కనిపిస్తుంది. దానిని కాపీ చేసుకుని Back కి వచ్చేసేయండి. అందులో ఈ క్రింద చూపిన ఇమేజ్ లో
మీరు registration number మరియు క్యాప్చ ఎంటర్ చేసి Get Data పైన క్లిక్ చేయండి తర్వాత మీకు కింద చూపబడిన విధంగా ఒక ఇమేజ్ వస్తుంది.
అందులో మీకు మీ యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ మొత్తం కనిపిస్తుంది. నన్ను ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే చేసుకుని update your details అనే బ్లూ కలర్ బటన్ పైన క్లిక్ చేసినట్లయితే మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా అప్డేట్ చేయబడతాయి.
తర్వాత మీరు పైకి స్క్రోల్ చేసి కిందకి చూసినట్లయితే మీకు ఈ క్రింద చూపబడిన విధంగా ఇమేజ్ కనిపిస్తుంది.
అందులో FTO processed అనే ఆప్షన్ దగ్గర పైన ఉన్న ఇమేజ్ లో చూపిన విధంగా మీకు Yes అని ఉన్నట్లయితే మీకు 14 విడత డబ్బులు పడతాయి.