ఏపీ ప్రజలకు సీఎం జగన్ మోహన్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ కొనసాగిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సంక్షేమ పథకాలకు సంబంధించి షెడ్యూల్ ముందుగానే ప్రకటించి ప్రకటించిన షెడ్యూల్ ప్రకారంగా లబ్ధిదారుల ఖాతాలోకి నగదును ఆయా పథకాలకు సంబంధించి జమ చేయడం జరుగుతుంది.
అందులో భాగంగానే తాజాగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఏపీ ప్రజలకు జూలై నెలలో అమలు చేసే సంక్షేమ పథకాల తేదీలను ఖరారు చేయడం జరిగింది. ఆ తేదిలలో ముఖ్యమంత్రి జగన్ లబ్ధిదారుల పథకాలలోకి ఆయా పథకాల కు సంబంధించి కేటాయించిన నిధులను బట్టి నగదును ఖాతాలోకి జమచేయనున్నారు.
ఏపీ ప్రజలకు అమలయ్యే పథకాల తేదీలు ఇవి:
ఏపీ ప్రజలకు ఈ జూలై నెలలో అమలయ్యే పథకాలకు ఏపీ మంత్రి వర్గం ఆమోదం తెలుపుతూ తేదీలను ఫిక్స్ చేసింది. జూలై 18వ తేదీ నుంచి 28వ తేదీ వరకు ఈ సంక్షేమ పథకాలు అమలు కాలు ఉన్నాయి.
ఈ జూలై నెలలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు పథకాలు అమలు చేస్తున్నారు వాటికి సంబంధించిన తేదీలు కూడా ఫిక్స్ చేశారు ఏ తేదీలలో ఏ పథకాలు అమలు కాబోతున్నాయో ఇప్పుడు చూద్దాం.
1. జగనన్న తోడు:
జూలై 18న జగనన్న తోడు ఈ పథకం కింద అర్హత కలిగిన లబ్ధిదారులకు ₹10,000 రూపాయలు సున్నా వడ్డీ తోనే చిరు వ్యాపారులకు, రోడ్లపైన బుట్టలు పెట్టుకుని వ్యాపారం చేసుకునే వారికి అలాగే నెత్తి మీద గంప పెట్టుకుని వ్యాపారం చేసుకునే వారికి, అదేవిధంగా వీధులలో తోపుడుబండ్లపై వ్యాపారం చేసుకునే వారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తుంది.
ఈ పథకానికి సంబంధించి గతంలో రుణాలు తీసుకున్న వారు తిరిగి సకాలంలో బ్యాంకులకు చెల్లించి ఉంటే వాళ్లకు కూడా మళ్లీ జగనన్న తోడు పథకం కింద నిధులు జమవుతాయి. ఒకవేళ సరిగా కిస్తీలు కట్టకుండా ఉంటే వాళ్లను ఈ జగనన్న తోడు పథకం కింద అనర్హులుగా గుర్తించి తొలగించడం జరుగుతుంది.
ఈ జగనన్న తోడు పథకం కింద 5.1 లక్షల మందికి రుణాలు ఇప్పిస్తూ వడ్డీ మాఫీ కింద 4.58 లక్షల మందికి ₹10.3 కోట్ల రూపాయలను చెల్లించనుంది మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం.
ఏపీ ప్రజలకు ఈ పథకాన్ని రేషన్ కార్డుకి ప్రాధాన్యత ఇస్తూ రేషన్ కార్డు కలిగిన వారికి మాత్రమే ఈ పథకాన్ని అమలు చేస్తుంది.
ఈ జగనన్న తోడు పథకానికి సంబంధించి మీకు డబ్బులు వస్తాయో రావో చెక్ చేసుకునేందుకు దీనిపై క్లిక్ చేయండి: Click here
2. వైయస్సార్ నేతన్న నేస్తం:
ఈ వైయస్సార్ నేతన్న నేస్తం పథకం కింద అర్హత కలిగిన లబ్ధిదారులకు వరుసుగా 4 ఏడాదికి సంబంధించిన నిధులను జూలై 21వ తేదీన విడుదల చేయనున్నారు.
నేతల నేస్తం పథకం కింద అర్హత కలిగిన ప్రతి నేతన్నకు సంవత్సరానికి 24 వేల రూపాయలు నేరుగా ఖాతాలలోకి మన యొక్క ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి కంప్యూటర్లో బటన్ నొక్కి జమ చేస్తారు. ఈ నేత నేస్తం పథకానికి సంబంధించి ఎవరైతే సొంత మగ్గం కలిగి ఇంట్లోనే పని చేసుకుంటూ జీవిస్తుంటారో అటువంటి చేనేత కార్మికులకు కొంత పెట్టుబడి సాయం అందించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తుంది.
ఈ వైఎస్ఆర్ నేతల నేస్తం పథకం కింద 2023వ సంవత్సరానికి సంబంధించి ఐదు ఏడాదిగా 80,686 మంది లబ్ధిదారులకు దాదాపు ₹300 కోట్ల మేరకు నిధులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయనుంది. ఈ పథకంలో ముఖ్యంగా రేషన్ కార్డు కలిగి ఉండే సొంత మగ్గం కలిగి ఉండే ఏపీ ప్రజలకు ఈ పథకాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది.
వైయస్సార్ నేతన్న నేస్తం పథకానికి సంబంధించి మీరు అర్హులు కాదు తెలుసుకునేందుకు దీనిపైన క్లిక్ చేయండి: Click here
3. వైయస్సార్ సున్నా వడ్డీ:
వైయస్సార్ సున్నా వడ్డీ పథకం కింద జూలై 26వ తేదీన అర్హత కలిగిన లబ్ధిదారులకు చేయనున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు వైయస్సార్ సున్నా వడ్డీ పథకం కింద అర్హత కలిగిన మహిళలకు 0 వడ్డీతో రుణాలను మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేస్తుంది. లబ్ధిదారుడు రుణం తీసుకున్న తర్వాత ఆ రుణాన్ని తిరిగి చెల్లించేటప్పుడు వడ్డీతో సహా కలిపి చెల్లించాలి.
అయితే ఆ చెల్లించిన మొత్తం రుణాన్ని మన యొక్క ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి నేరుగా డ్వాక్రా అక్క చెల్లెమ్మల ఖాతాలోకి తిరిగి జమ చేయమన్నారు. అందులో భాగంగానే ఈ జూలై నెలలో 26వ తేదీన ఈ వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకానికి సంబంధించిన వడ్డీ మొత్తాన్ని తిరిగి జమ చేయనున్నారు.
వైయస్సార్ సున్నా వడ్డీ 11 కింద వరుసగా నాలుగో ఏడాది 9.48 లక్షల పొదుపు గ్రూపులోని మహిళలకు ఈ 11 కింద ₹1353.76 కోట్ల రూపాయలను ఇవ్వనున్నారు. ఈ నాలుగేళ్లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దాదాపు డ్వాక్రా అక్కచల్లెమ్మలకు ₹5,000 కోట్ల రూపాయలు లబ్ధి చేకూర్చినట్లు అవుతుంది.
వైయస్సార్ సున్నా వడ్డీ పథకానికి సంబంధించి మీరు అర్హులో కాదో తెలుసుకునేందుకు దీనిపై క్లిక్ చేయండి: Click here
4. జగనన్న విదేశీ విద్యా దీవెన:
జూలై 28వ తేదీన జగనన్న విదేశీ విద్యా దీవెన పథకానికి సంబంధించిన నిధులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి విడుదల చేయనున్నారు.
ఈ జగనన్న విదేశీ విద్యార్థి వన పథకం కింద అర్హత కలిగిన లబ్ధిదారులకు విదేశాలలో చదువుకునేందుకు పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులను నేరుగా లబ్ధిదారుల ఖాతాలలోకి ప్రతి సంవత్సరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది.
ఈ జగనన్న విదేశీ విద్యా దీవెన పథకాన్ని కావాలనుకుంటారో అటువంటి లబ్ధిదారులందరూ కూడా ఈ పథకానికి ముందుగా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు ఇంటర్వ్యూ ద్వారా ఎంట్రన్స్ టెస్టులు పెట్టి క్వాలిఫై చేస్తారు. వీటిలో క్వాలిఫై అయినటువంటి విద్యార్థులందరికీ విదేశాలలో చదువుకునేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారు ఎంచుకున్న యూనివర్సిటీలో ఫీజులను బట్టి వారి ఖాతాలను డబ్బులు పంపిస్తుంది.
ఈ జగనన్న విదేశీ విద్యార్థి వన పథకం కింద అర్హులైన లబ్ధిదారులకు 50 వేల కోట్ల మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జులై 28న నేరుగా వారికి చెక్కుల రూపంలో గానీ లేదా డిప్యూటీ ద్వారా గాని జమ చేయనున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో పలు నిర్ణయాలతో పాటు ఈ పథకాలకు సంబంధించి ఆమోదం తెలిపింది.
జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం కింద మీరు అర్హులో కాదో తెలుసుకునేందుకు దీనిని క్లిక్ చేయండి: Click here
Note:- పైన తెలిపిన పథకాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రామ, వార్డు సచివాలయాలలో నోటీసు బోర్డులలో అర్హుల లిస్టులు అందుబాటులోకి ఉంచారు. మీరు పైన తెలిపిన పథకాలలో దేనికైనా సంబంధించి అప్లై చేసుకోవాలంటే వెంటనే మీ యొక్క వాలంటీర్ను సంప్రదించి సంబంధిత డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసినట్లయితే ఈ పథకానికి సంబంధించిన డబ్బులు మీకు కూడా అందివ్వడం జరుగుతుంది. ఏపీ ప్రజలకు జూలై నెలలో అమలు చేసే 4 పథకాలు ఇవే.
పైన తెలిపిన నాలుగు పథకాలకు: అర్హుల లిస్టులో మరియు పేమెంట్ స్టేటస్లు తెలుసుకునేందుకు దీనిపై క్లిక్ చేయండి.
1 thought on “ఏపీ ప్రజలకు జూలై నెలలో 4 పథకాలు అమలకు డేట్ ఫిక్స్ చేసిన క్యాబినెట్ వెంటనే తెలుసుకోండి”
Comments are closed.