Jagananna Ammavodi 2023: అమ్మ ఒడి పథకానికి సంబంధించిన నిధులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి జూన్ 28న పార్వతీపురం మన్యం జిల్లా కురూపంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈసారి అమ్మ ఒడి పథకానికి సంబంధించిన నాలుగో విడత డబ్బులు మాత్రం పది రోజులపాటు అర్హుల ఖాతాలోకి జమ చేస్తామని చెప్పారు.
అయితే Jagananna Ammavodi 2023 డబ్బులు మాత్రం ఇంకా చాలామంది ఖాతాలోకి పడలేదు. ఈ నేపథ్యంలో పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకున్నప్పుడు లబ్ధిదారులకు పేమెంట్ Successful అని చూపిస్తున్న సరే ఇంకా ఖాతాలోకి జమ కాలేదు దీంతో అమ్మ ఒడి లబ్ధిదారుల్లో ఆందోళన నెలకొంది.
దీనిని గమనించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన లబ్ధిదారులకు ఈ కేవైసీ పూర్తి చేసుకున్నట్లయితే జూలై మొదటి వారంలో అనగా జూలై 7వ తేదీన అర్హులైనటువంటి తల్లుల ఖాతాలోకి నేరుగా జమ చేస్తామని తెలిపారు. అయితే జూలై 7వ తేదీ దాటిన తర్వాత కూడా ఇంకా చాలామందికి అమ్మ కూడా డబ్బులు పడలేదు దీంతో లబ్ధిదారుల్లో మరోసారి ఆందోళన నెలకొన్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరోసారి స్పందించింది.
Jagananna Ammavodi 2023 పడని వారికి మరోసారి:
Jagananna Ammavodi 2023 పథకానికి సంబంధించి అర్హులైన ప్రతి ఒక్కరు కూడా eKYC కచ్చితంగా చేసుకోవాలని సూచించింది. యొక్క eKYC చేసుకున్నటువంటి వారందరికీ వాళ్లు eKYC చేసుకున్న టైం ని బట్టి రెండు భాగాలుగా విభజించి అర్హుల ఖాతాలోకి అమ్మబడి పథకానికి సంబంధించిన నాలుగో విడత డబ్బులను ఏపీ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తుందని తెలిపింది.
అంటే Jagananna Ammavodi 2023 పథకానికి సంబంధించి eKYC అనేది చాలా ప్రాముఖ్యమైనది ఈ యొక్క eKYC మీరు చేసుకున్న విధానాన్ని బట్టి మొదట కేటగిరి జూన్ 27 లోపల ఎవరైతే పూర్తి చేసుకున్నారో అటువంటి వారికి జూలై మొదటి వారంలో అనగా జూలై 1 నుండి 7వ తేదీలోగా డబ్బులు క్రెడిట్ అయ్యాయి.
అదేవిధంగా eKYC జూన్ 27 తర్వాత ఎవరైతే పూర్తిచేసుకుని ఉంటారో వారికి జూలై రెండవ వారంలో అనగా జూలై 8 నుండి 15 తారీకు లోపు డబ్బులు పడతాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా తెలిపింది.
Jagananna Ammavodi 2023 కొత్త రూల్స్:
Jagananna Ammavodi 2023 పథకంలో భాగంగా కొన్ని కొత్త రూల్స్ ను విడుదల చేసింది మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అవేంటో ఇప్పుడు చూద్దాం.
- విద్యార్థి తల్లి లేక సంరక్షకులు ఒకే హౌస్ ఓల్డ్ మ్యాపింగ్ కలిగి ఉండాలి.
- తల్లి లేక సమరక్షకుల ఆధార్ కార్డుకు బ్యాంక్ అకౌంట్ NPCI మ్యాపింగ్ కలిగి ఉండాలి. ఇది లేకపోతే ప్రభుత్వం నిధులు విడుదల చేసినప్పుడు మన ఖాతాలోకి పడవు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం గానీ మన యొక్క ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం గానీ ఏ పథకానికి సంబంధించి అయినా నిధులు విడుదల చేసేటప్పుడు DBT పద్ధతిలో విడుదల చేస్తారు. ఈ DBT లో డబ్బులు విడుదల చేసినప్పుడు మన ఖాతాలకి పడాలంటే ఈ NPCI మ్యాపింగ్ అనేది చాలా అవసరం.
- తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలి.
- కరెంట్ బిల్లు 300 యూనిట్లు కంటే తక్కువగా ఉండాలి.
- నాలుగు చక్రాల వాహనం ఉండకూడదు. అయితే ట్రాక్టర్లు, టాక్సీ లకు ఇది మినహాయింపు ఉంటుంది.
- పట్టణం అయితే ఇంటి విస్తీర్ణం 1000 చదరపు అడుగులకు మించకూడదు.
- గ్రామీణ ప్రాంతాలలో అయితే నెలసరి ఆదాయం ₹10000, పట్టణంలో అయితే 12000 మించకూడదు.
- భూమి విషయానికి వస్తే మాగాని 3 ఎకరాలు మెట్ట 7 ఎకరాలు ఉండొచ్చు. లేదా రెండు కలిపి మొత్తంగా 10 ఎకరాల కంటే ఎక్కువ ఉండకూడదు.
- విద్యార్థి మరియు తల్లి లేదా సంరక్షకుల ఆధార్ కార్డుతో ఫోన్ నెంబరు లింక్ ని కలిగి ఉండాలి.
- అమ్మ ఒడి పథకానికి సంబంధించి మీరు ఇచ్చేటువంటి బ్యాంక్ అకౌంట్ కచ్చితంగా యాక్టివేట్ లో ఉండాలి. అంటే కనీసం మూడు నెలలకు ఒకసారి డబ్బులు వేయడం గాని లేదా తీసుకోవడం గాని చేస్తుండాలి ఇలా ఉంటేనే అకౌంట్ యాక్టివేషన్ లో ఉంటుంది.
పైన తెలిపిన ఈ రూల్స్ ప్రకారం మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం Jagananna Ammavodi 2023 పథకానికి సంబంధించి అర్హులను గుర్తిస్తుంది.
Jagananna Ammavodi 2023 అర్హుల జాబితా తెలుసుకునేందుకు దీనిని క్లిక్ చేయండి. Click here
Note: ఈ Jagananna Ammavodi 2023 పథకానికి సంబంధించి అర్హుల స్టేటస్ అనేది చెక్ చేసుకున్నప్పుడు Eligible అని గాని రాకుండా మరి ఏదైనా అక్కడ మీకు కనిపిస్తే అంటే Not Eligible ఇలా కనిపిస్తే మళ్లీ మీరు గ్రీవెన్స్ పెట్టుకోవాలి.
Jagananna Ammavodi 2023 గ్రీవెన్స్ పెట్టుకునే విధానం:
గ్రీవెన్స్ అంటే మళ్లీ అదే పథకానికి అప్లై చేసుకోవడం దీనినే గ్రీవెన్స్ అంటారు. అమ్మ ఒడి పథకానికి గ్రీవెన్స్ ఏ విధంగా పెట్టుకోవాలో చూద్దాం.
అమ్మ ఒడి పథకానికి గ్రీవెన్స్ పెట్టుకోవాలంటే మీకు ఏ కారణం చేత అనర్హత వచ్చిందో దాన్ని మొదటగా తెలుసుకోవాలి. ఉదాహరణకు మీకు కరెంట్ బిల్లు ఎక్కువ వచ్చిందనుకోండి అప్పుడు మీరు ఏం చేయాలంటే మీ దగ్గరలో ఉన్నటువంటి మీ ఏరియా కు సంబంధించిన కరెంట్ ఆఫీస్ కి వెళ్లి RI క్లియరెన్స్ సర్టిఫికెట్ తీసుకోవాలి.
ఆ క్లియరెన్స్ సర్టిఫికెట్ తీసుకున్న తర్వాత మీరు మీ పరిధిలోని సచివాలయంలో ఎడ్యుకేషనల్ అసిస్టెంట్ దగ్గర విద్యార్థి ఆధార్ కార్డు, తల్లి లేక సంరక్షకుల ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ అకౌంట్ తోపాటు కరెంట్ ఆఫీసులో తీసుకున్న క్లియరెన్స్ సర్టిఫికెట్ను తీసుకొని సబ్మిట్ చేయాలి.
ఇలా మీరు సబ్మిట్ చేసినటువంటి ఆ డాక్యుమెంట్స్ ని సంబంధిత అధికారులు ఆరు దశలలో పరిశీలించి మీయొక్క ఎలిజిబిలిటీ క్రిటీరియాని చెక్ చేసిన తర్వాత మీరు ఎలిజిబుల్ అయితే మీ యొక్క పేరుని అర్హుల జాబితాలో చేరుస్తారు.
ఈ అర్హుల జాబితాలో ఎవరి పేరు అయితే ఉంటుందో వారికి మాత్రమే అమ్మ ఒడి పథకానికి సంబంధించిన డబ్బులు పడతాయి.
గమనిక:
పైన తెలిపిన విధంగా మీ యొక్క ఎలిజిబులిటీ క్రిటీరియా మొత్తం చెక్ చేసుకోండి. ఇలా చెక్ చేసుకున్న వారందరికీ కూడా మరో వారం రోజులు పాటు అనగా జూలై 8 నుండి దాదాపు 15 తేదీ వరకు ఈ యొక్క Jagananna Ammavodi 2023 పథకానికి సంబంధించి డబ్బులు అర్హుల ఖాతాలోనికి జమవుతాయి.
ఈ అమ్మ ఒడి పథకానికి సంబంధించి డబ్బులు పడే వారం రోజుల్లో ఏదైనా పబ్లిక్ హాలిడే వచ్చి బ్యాంకులు క్లోజ్ అయితే మళ్లీ ఈ డబ్బులు పడే తేదీ పొడిగింపు చేసే అవకాశం ఉంటుంది. దయచేసి ఇది గమనించగలరు.
Jagananna Ammavodi 2023 పథకానికి సంబంధించిన డబ్బులు మీ ఖాతాలో పడ్డాయాలో తెలుసుకునేందుకు దీనిని క్లిక్ చేయండి: Click here