August Schemes; ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాల్లో భాగంగా ప్రతి నెలలో కూడా అనేక రకాల సంక్షేమ పథకాలను అమలు చేస్తుంది. ప్రతి పథకానికి సంబంధించి అప్లై చేసుకోవడానికి కొంత గడువును ఇస్తుంది. తర్వాత అప్లై చేసుకున్నటువంటి వారందరికీ అర్హుల లిస్టు విడుదల చేసి ఎవరైతే అర్హత సాధిస్తారో వారికి మాత్రం నేరుగా వారి యొక్క ఖాతాలోకి ఆయా పథకాలకు సంబంధించిన నిధులను విడుదల చేస్తుంది.
అందులో భాగంగానే సంక్షేమ క్యాలెండర్ ను ముందుగా విడుదల చేసి అందులో ప్రకటించిన విధంగా ఆయా నెలలో పథకాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వివిధ వర్గాల సంక్షేమం కోసం అమలు చేస్తూ వస్తుంది.
ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇప్పటివరకు రైతు భరోసా, అమ్మ ఒడి, నేతన్న నేస్తం, వసతి దీవెన, విద్య కానుక, మత్స్యకార భరోసా, వైయస్సార్ లానేస్తం వంటి పథకాల పేరుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అర్హులందరికీ డబ్బులను జమ చేసింది మన రాష్ట్ర ప్రభుత్వం.
ఇక ఈ యొక్క ఆగస్టు నెలలో అమలు కాబోయే పథకాలకు సంబంధించి చూసినట్లయితే ఈ యొక్క ఆగస్టు నెలలో నాలుగు పథకాలను అమలు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కసరత్తులు చేస్తుంది.
August Schemes 2023; ఆగస్టు నెలలో అమలయ్యే పథకాలు:
- డ్వాక్రా సున్నా వడ్డీ
- జగనన్న విద్యా దీవెన
- వైయస్సార్ కాపు నేస్తం
- వైయస్సార్ వాహన మిత్ర
- అమ్మబడి గత నెలలో పడని వారికి
ఈ పథకాలను మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయబోతుంది.
డ్వాక్రా సున్నా వడ్డీ:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా 0 వడ్డీకే రుణాలు ఇస్తామని ప్రకటించారు. అందులో భాగంగానే డ్వాక్రా మహిళలందరికీ ఇప్పుడు వరకు మూడు విడుదల సున్నా వడ్డీ డబ్బులను ఖాతాలలోకి జమ చేశారు.
ఇక నాలుగో విడతకు సంబంధించి డ్వాక్రా సున్నా వడ్డీ డబ్బులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆగస్టు నెలలో డ్వాక్రా మహిళల ఖాతాలోకి వెయ్యబోతోంది. దీనికి సంబంధించిన డబ్బులను గత జులై నెలలో వేయాల్సి ఉండగా కొన్ని అనివార్యమైన కారణాలవల్ల ఈ పథకాన్ని ఆగస్టు 10వ తేదీకి వాయిదా వేయడం జరిగింది. ఆగస్టు పదో తేదీన ఈ 0 వడ్డీ డబ్బులను అర్హత కలిగిన ప్రతి ఒక్క డ్వాక్రా మహిళ ఖాతాలలోకి నీరుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి కంప్యూటర్ల బటన్ నొక్కి విడుదల చేయనున్నారు.
డ్వాక్రా మహిళలకు 0 వడ్డీతో పాటు రుణమాఫీని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. ఇప్పటివరకు ఈ యొక్క రుణమాఫీ కింద 3 విడతలు చేయగా ఇక నాలుగో విడతగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 2023 సంవత్సరంలో త్వరలో చేయనుంది.
Eligible List
Payment Status Check
జగనన్న విద్యా దీవెన:
ఈ జగనన్న విద్యా దీవెన పథకానికి సంబంధించి ఎవరైతే డిగ్రీ ఆ పైన చదువుతున్నటువంటి విద్యార్థులు ఉంటారో అటువంటి వారందరికీ ఈ పథకం కింద పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ను అందివ్వడం జరుగుతుంది.
అయితే ఈ యొక్క జగనన్న విద్యా దీవెన పథకానికి సంబంధించి 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇప్పటికే మొదట విడత కింద నిధులను విడుదల చేయగా, ఇప్పుడు తాజాగా రెండో విడత నిధులను విడుదలకు ఈ ఆగస్టు నెలలో ఇప్పటికే జగనన్న విద్యా దీవెన పథకానికి సంబంధించిన అర్హుల యొక్క పూర్తి వివరాలను సేకరించింది. అర్హులైన విద్యార్థి తల్లుల ఖాతాలోకి ఆగస్టు నెలలోనే రెండో విడత నిధులను విడుదల చేయనుంది.
Eligible List
Payment Status Check
వైయస్సార్ కాపు నేస్తం:
వైయస్సార్ కాపు నేస్తం పథకం కింద అర్హత కలిగిన కాపు వర్గానికి చెందిన 45 నుంచి 60 సంవత్సరాల లోపు మహిళలకు 15000 రూపాయల చొప్పున సంవత్సరానికి నేరుగా లబ్ధిదారుల ఖాతాలోకి సీఎం జగన్ మోహన్ రెడ్డి విడుదల చేయనున్నారు. ఈ పథకం కింద మొత్తంగా ఇప్పటివరకు రెండు విడతల డబ్బులను విడుదల చేయగా ఇక మూడో విడతగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కాపు మహిళలకు ఈ ఆగస్టు నెలలోనే నిధులను విడుదల చేయనున్నారు.
ఈ కాపు నేస్తం పథకానికి సంబంధించి కొత్త లబ్ధిదారుల దరఖాస్తులు సేకరణ పూర్తి చేయడం జరిగింది. క్యాస్ట్ సర్టిఫికెట్లు, ఇతర డాక్యుమెంట్స్ పరిశీలన జరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అర్హులందరికీ సోషల్ ఆడిట్ నిర్వహించి అర్హుల జాబితాను ఫైనలైజ్ చేస్తారు. ఈ సోషల్ ఆడిట్ వారం రోజులు పాటు ఉంటుంది.
తుది జాబితాలో పేర్లు ఉన్న వారందరికీ ఆగస్టు 15వ తేదీన ఈకేవైసీ వాలంటీర్ల ద్వారా గాని లేదా గ్రామ వార్డు సచివాలయాల ద్వారా గాని చేయించడం జరుగుతుంది. అనంతరం జిల్లా కలెక్టర్ల ఆమోదం తరువాత లబ్ధిదారుల కథలోకి 15 వేల రూపాయల చొప్పున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కంప్యూటర్లో బటన్ నొక్కి నిధులను జమ చేయనున్నారు.
Eligible List
Payment Status Check
వైయస్సార్ వాహన మిత్ర:
ఈ వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం కింద ఆటో, టాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరానికి ₹10,000 చొప్పున నేరుగా డ్రైవర్ల ఖాతాలోకి విడుదల చేయడం జరుగుతుంది. ఈ వైయస్సార్ వాహన మిత్ర పథకానికి సంబంధించి వెరిఫికేషన్ ప్రక్రియ ప్రస్తుతం జరుగుతుంది. వాహనాలు, డ్రైవర్ల లైసెన్సులు, రేషన్ కార్డులు, బ్యాంకు అకౌంట్లు వంటి పత్రాలను పరిశీలించి పై అధికారులు ఆమోదానికి పంపుతున్నారు.
ఈ ఆగస్టు నెల రెండో వారంలో ఈ కేవైసీ పూర్తయిన లబ్ధిదారుల ఖాతాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నేరుగా కంప్యూటర్ల బటన్ నొక్కి ₹10,000 రూపాయలు విడుదల చేస్తుంది.
సొంత వాహనం లేకపోయినా, ప్రభుత్వం నిర్దేశించిన అర్హతలు లేకపోయినా ఈ పథకానికి సంబంధించిన డబ్బులు మీ యొక్క అకౌంట్లోకి జమ కావు.
ఈ ఆగస్టు నెలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి నవరత్నాలలో భాగంగా ఏపీ ప్రజలకు అమలు చేసే సంక్షేమ పథకాలు ఇవే. ఈ పథకాలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సమయాను కులాన్ని బట్టి తేదీలను నిర్ణయిస్తుంది. అలాగే తేదీలలో మార్పులు కూడా చేసే అవకాశం ఉంటుంది. Upcoming August Schemes 2023