రేషన్ కార్డు లేనివారికి అదిరిపోయే శుభవార్త చెప్పిన సీఎం జగన్ వెంటనే తెలుసుకోండి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు లేని వారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో పెద్ద శుభవార్తను తెలియజేసింది. రేషన్ కార్డు లేనటువంటి వారికి త్వరలో 1.67 లక్షల మందికి కొత్తగా రేషన్ కార్డులు విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న వారికి పవర్ సరఫరాల శాఖ కమిషనర్ 1.6 లక్షల మందికి కొత్తగా రేషన్ కార్డులు ఇవ్వనున్నట్లు తెలిపారు.

ప్రస్తుతం 1.46 కోట్ల మంది పేదలకు ప్రతినెల 2.11 లక్షల టన్నుల బియ్యాన్ని సరఫరా చేస్తున్నామని ఆయన తెలిపారు. ఇందుకోసం నెలకు 846 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. తాజాగా మరో 1.67 లక్షల మందికి కొత్తగా రేషన్ కార్డులు మంజూరు చేసినట్లు ఆయన తెలిపారు త్వరలోనే వీటిని సంబంధిత లబ్ధిదారులకు వాలంటీర్ల ద్వారా అందజేస్తామని ఆయన తెలిపారు.

దారిద్ర రేఖకు దిగువుగా ఉన్నటువంటి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డ్ లను పంపిణీ చేస్తుంది ఈ రేషన్ కార్డ్ వలన పేదలకు అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయి. రేషన్ కార్డ్ ఒక కుటుంబానికి ఒకటి మాత్రమే ఉంటుంది. కుటుంబంలో ఎంతమంది ఉన్నా రేషన్ కార్డ్ లో మాత్రం కుటుంబంలో ఉన్న వారందరూ కూడా ఒక యూనిట్ గా పరిగణిస్తారు.

రేషన్ కార్డు అప్లికేషన్ స్టేటస్ కోసం దేని క్లిక్ చేయండి Click here

రేషన్ కార్డ్ ఉన్నవారికి మరో శుభవార్త:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డ్ దారులందరికీ రేషన్ వాహనాల ద్వారా ఇంటింటికి రేషన్ పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ యొక్క రేషన్ కార్డు కలిగినటువంటి వారందరికీ ప్రస్తుతం మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తున్నటువంటి బియ్యంతో పాటు రాగులు పంపిణీ చేయనున్నారు.

దీనిని మొట్టమొదటగా పైలెట్ ప్రాజెక్టు కింద రాయలసీమలో ప్రారంభించగా ప్రస్తుతం జూలై మాసం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాలలో కూడా ఈ రాగులు పంపిణీ విధానాన్ని అమలు చేస్తున్నారు.

రేషన్ కార్డ్ కలిగి ఉన్నవారు ప్రస్తుతం బియ్యం కావాలంటే బియ్యం లేదా రాగులు కావాలంటే రాగులు తీసుకోవచ్చు. లేదా మొత్తంగా బియ్యం కాకుండా ఒక కేజీ రాగులు తీసుకుని మిగిలినవి బియ్యం తీసుకునే సదుపాయం ఉంది.

20230717 205243

రేషన్ కార్డ్ వలన ప్రయోజనాలు:

రేషన్ కార్డ్ వలన తక్కువ ధరతో అంటే సబ్సిడీతో చౌక ధరల దుకాణం అనగా రేషన్ షాపుల ద్వారా వస్తువులను అందివ్వడం జరుగుతుంది. బియ్యం, చక్కర, కందిపప్పు, గోధుమలు, జొన్నలు, రాగులు మొదలైన నిత్యవసర సరుకులు తక్కువ ధరతో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది.

అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వమైనా, కేంద్ర ప్రభుత్వమైన ఏదైనా పథకానికి అర్హులను గుర్తించడానికి ఈ రేషన్ కార్డు చాలా ప్రాముఖ్యం కలిగి ఉంటుంది. మరి ముఖ్యంగా చెప్పాలంటే రేషన్ కార్డుకి కలిగి ఉన్న వారికి మాత్రమే ప్రభుత్వ పథకాలు వర్తిస్తాయి.

రేషన్ కార్డ్ రకాలు:

రేషన్ కార్డ్ సాధారణంగా మూడు రకాలు వాటిలో అంత్యోదయ అన్న యోజన కార్డులు, పింక్ రేషన్ కార్డులు, తెల్ల రేషన్ కార్డులు. వీటిలో అంత్యోదయ అన్న యోజన కార్డులు కింద అర్హులైన లబ్ధిదారులకు ఒక నెలకు 35 కిలోల బియ్యం చొప్పున రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తుంది.

మిగిలిన కార్డుదారులకు కార్డులో ఉన్న ప్రతి వ్యక్తికి ఐదు కిలోల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తుంది. ఈ అంత్యోదయ అన్ని యోజన కార్డుల కింద కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద ఉచితంగా గ్యాస్ సిలిండర్లను కూడా పంపిణీ చేస్తుంది.

రేషన్ కార్డ్ గ్రీవెన్స్ స్టేటస్ కోసం దీనిని క్లిక్ చేయండి Click here

20230717 205109

రేషన్ కార్డు కావాలంటే కలిగి ఉండవలసిన అర్హతలు:

  • దారిద్ర రేఖకు దిగువుగా ఉన్న కుటుంబాలకు మాత్రమే ఈ రేషన్ కార్డ్ అందిస్తారు
  • గ్రామాలలో నెలసరి ఆదాయం ₹10000, పట్టణ ప్రాంతాలలో అయితే ₹12,000కి మించకుండా ఉండాలి.
  • నాలుగు చక్రాల వాహనం కలిగి ఉండకూడదు. అయితే ట్రాక్టర్లు , టాక్సీలకు మాత్రం మినహాయింపు కల్పించారు.
  • భూమి మాగాణి మూడు ఎకరాలు మెట్టైతే ఏడు ఎకరాలు కలిగి ఉండాలి. లేదా రెండు కలిపి పది ఎకరాల లోపు ఉండాలి.
  • కుటుంబంలో ప్రభుత్వ పెన్షన్ దారులు ఉండకూడదు.
  • ఇన్కమ్ టాక్స్ కట్టేవారుగా ఉండకూడదు. ఇలాంటివారు ఈ రేషన్ కార్డ్ కి అర్హులు
  • ప్రభుత్వ ఉద్యోగులు రేషన్ కార్డు పొందడానికి అనర్హులు.
  • కరెంట్ బిల్లు 300 యూనిట్లకు మించి రాకూడదు.

పైన తెలిపిన అర్హతలకు అనుగుణంగా ఎవరైతే ఉంటారో వారికి మాత్రమే రేషన్ కార్డును అందిస్తారు.

20230717 205124

రేషన్ కార్డ్ కు సంబంధించిన కొత్త రూల్స్:

  1. ఒక కుటుంబానికి ఒక రేషన్ కార్డ్ మాత్రమే ఉంటుంది.
  2. ఒక రేషన్ కార్డ్ లో రెండు కుటుంబాలు (తల్లి, తండ్రి మరియు కొడుకు, కోడలు) ఉంటే కొడుకు కోడల్ని వేరు చేసి కొత్త రేషన్ కార్డ్ ను మంజూరు చేస్తారు.
  3. రేషన్ కార్డ్ లో ఒక వ్యక్తిని డిలీట్ చేయాలి అంటే ఆ వ్యక్తి చనిపోతే మాత్రమే డిలీట్ చేసే అవకాశం ఉంటుంది.
  4. రేషన్ కార్డ్ లో ఎవరినైనా స్ప్లిట్ చేయాలంటే ఆ రేషన్ కార్డ్ లో కచ్చితంగా ఇద్దరినీ ఉంచి మిగిలిన వారిని స్ప్లిట్ చేయొచ్చు. చేసేటప్పుడు కచ్చితంగా ఇద్దరిని మాత్రమే స్ప్లిట్ చేసే అవకాశం ఉంటుంది. ఒకరిని స్ప్లిట్ చేయడం కుదరదు.
  5. రేషన్ కార్డ్ లో ఎవరినైనా కొడుకు, కూతురుగా చేసుకోవాలంటే యాడ్ చేసుకునే వ్యక్తికి 15 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు కలిగి ఉండాలి. 15 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉన్న వారిని కొడుకు లేదా కూతురు రిలేషన్తో రేషన్ కార్డ్ లో యాడ్ చేసుకోలేము.
  6. రేషన్ కార్డ్ కలిగి ఉన ప్రతి ఒక్కరు కూడా eKYC పూర్తి చేసుకోవాలి.
  7. సింగల్ పర్సన్ కి రేషన్ కార్డ్ ప్రస్తుతం మన రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తున్నారు.
  8. రేషన్ కార్డ్ ని ఆధార్ కార్డుతో అనుసంధానించడం వల్ల రేషన్ కార్డ్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి రేషన్ సరుకులు తీసుకోవచ్చు.

పైన తెలిపిన రూల్స్ అన్నీ కూడా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం అమలు చేస్తుంది.

రేషన్ కార్డ్ కు ఈ కేవైసీ స్టేటస్ చెక్ చేసుకునేందుకు దీన్ని క్లిక్ చేయండి Click here

1 thought on “రేషన్ కార్డు లేనివారికి అదిరిపోయే శుభవార్త చెప్పిన సీఎం జగన్ వెంటనే తెలుసుకోండి”

Comments are closed.

Verified by MonsterInsights