ఏపి కొత్త పెన్షన్లు :
ఏపి కొత్త పెన్షన్లు ఆంధ్రప్రదేశ్లో అనర్హుల పెన్షన్ల ఏరివేత ప్రక్రియను ఏపీ రాష్ట్రప్రభుత్వం ప్రారంభించింది. ఇప్పటికే ప్రతి గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగ సిబ్బంది తో చర్యలు చేపట్టాలని సెర్ప్ CEO వీర పాండియన్ ఉత్తర్వులు జారీ చేశారు. అర్హులకు మాత్రమే పెన్షన్లు అందాలనే ప్రభుత్వ విధానపరమైన నిర్ణయంలో భాగంగా డిసెంబర్ నెల 9,10 తేదీల్లో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక పెన్షన్ల తనిఖీ చేపట్టారు. ఈ తనిఖీల్లో పెద్ద సంఖ్యలో అనర్హుల పెన్షన్ దారులను గుర్తించారు. దాదాపు 11వేల పెన్షన్లను తనిఖీ చేస్తే అందులో 563మంది లబ్ధిదారులు అర్హత లేకున్నా పెన్షన్లు అందుకుంటున్నట్టు తనిఖీ బృందాలు తనిఖీ అనంతరం గుర్తించాయి.
అనర్హుల పెన్షన్ డబ్బులను తక్షణం నిలిపివేయాలని కలెక్టర్ల సదస్సుల్లో ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశించారు. రాష్ట్రంలో దాదాపు 6 లక్షల మంది అనర్హులు పెన్షన్లు అందుకుంటున్నట్టు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారికి వివరించారు.
ఈ నేపథ్యం లో మంగళవారం నాడు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ అనగా సెర్ప్ ఉత్తర్వులు జారీ చేసింది. వయసు పైబడినటువంటి వృద్ధులు, వికలాంగులు, భర్త మరణించినటువంటి వితంతువులకు గౌరవప్రదమైన జీవితాన్ని గడిపేందుకు పెన్షన్లను జారీ చేస్తున్నట్టు, అర్హులకు మాత్రమే వాటిని అందించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.ఈ క్రమంలో అధికారులు అనర్హులను గుర్తించిన వెంటనే వారి పెన్షన్లను రద్దు చేయాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
ఏపి కొత్త పెన్షన్లు పొందడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందించిందని వాటి ఆధారంగా ఇప్పుడు అనర్హులను తొలగిస్తున్నామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అనర్హుల లిస్టులో ఉన్నటువంటి జాబితాలను ఎంపిడిఓ, మునిసిపల్ కమిషనర్ల లాగిన్లలో అందుబాటులో ఉంచారు. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగ సిబ్బంది ద్వారా అనర్హులకు నోటీసులు జారీ చేయాలని, వారికి విధించినటువంటి నిర్దిష్ట గడువులోగా వారి నుంచి సమాధానాలు తీసుకోవాలని పేర్కొన్నారు. నోటీసులు అందుకోని వారి పెన్షన్లను చెల్లించకుండా నిలిపివేయాలని సూచించారు.
మూడు నెలల్లో పెన్షన్ల ప్రక్షాళన..
ఆంధ్రప్రదేశ్లో అనర్హులకు పెన్షన్ల చెల్లింపు వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారు కలెక్టర్ల సమావేశంలో స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. పెన్షన్లను గుర్తించడం పై ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టినటువంటి పైలట్ సర్వే లో నకిలీ పెన్షన్లను గుర్తించడం జరిగిందని, ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా 6 లక్షల మంది అనర్హులకు పెన్షన్లు చెల్లిస్తుండొచ్చని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ముఖ్యమంత్రి చంద్రబాబు కి వివరించారు. పెన్షన్ల జారీ చేసే సమయంలో ఉద్దేశపూర్వకంగా కొంతమంది అధికారులు అనర్హులను అర్హుల జాబితాలోనికి చేర్చేశారని వివరించారు.
దీంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారు మూడునెలల్లో అనర్హులను గుర్తించే ప్రక్రియ పూర్తి చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. అనర్హుల యొక్క పెన్షన్ల తనికీ పూర్తైన తర్వాత తాను మరో సారి కొత్తగా కనీసం 5% పెన్షన్లను ర్యాండమ్ తనిఖీ చేయిస్తానని అధికారులను హెచ్చరించారు ఏపీ రాష్ట్ర ముఖ్య మంత్రి నారా చంద్ర బాబు నాయుడు. అందులో కూడా అనర్హులు బయటపడితే కలెక్టర్లు బాధ్యత వహించాల్సి ఉంటుందని, మూడు నెలల్లో ఈ ప్రక్రియ పూర్తి కావాలని ఆదేశించారు ఆదేవించారు.
కేంద్రం నుండి రైతులకు కొత్త పథకం : Click here
NTR భరోసా పెన్షన్ పథకం కింద ఏపీ రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 64 లక్షల మందికి ప్రతి నెల పెన్షన్లు చెల్లిస్తోంది. సామాజిక పెన్షన్లలో వయసు పై పడినటువంటి వృద్ధులకు రూ.4 వేల రూపాయలు చెల్లిస్తుండగా ఇతర క్యాటగిరీల్లో వివిధ మొత్తాలను చెల్లిస్తున్నారు. ఈ క్రమంలో నకిలీ పెన్షన్లపై అధిక మొత్తంలో ఫిర్యాదులు రావడంతో పైలట్ ప్రాజెక్టు కింద రెండు రోజుల క్రితం ఏపీరాష్ట్ర వ్యాప్తంగా ఒక్కో క్లస్టర్లో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో దాదాపు 500 మంది లబ్ధిదారులు అనర్హులుగా కమిటీలు గుర్తించాయి.
వికలాంగుల క్యాటగిరీలోనే ఎక్కువ..
ఏపి కొత్త పెన్షన్లు అనర్హులు:
ఏపీరాష్ట్ర వ్యాప్తంగా వికలాంగుల కేటగిరీలో పెద్ద సంఖ్యలో అనర్హులు పింఛన్లు డబ్బులు పొందుతున్నట్టు సెర్ప్ అధికారులు భావిస్తున్నారు. వికలాంగులకు రూ.15వేల రూపాయల వరకు పెన్షన్ చెల్లస్తున్నారు. భర్త మరణించినటువంటి వితంతువుల విభాగంలో కూడా బోగస్ పెన్షన్లు ఉన్నట్టు పేదరిక నిర్మూలన సంస్థ ఉద్యోగ సిబ్బంది క్షేత్ర స్థాయి తనిఖీల్లో గుర్తించారు. ఏపీ {ఆంధ్రప్రదేశ్} రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి, గ్రామ వార్డు సచివాలయాల పరిధిలోనూ దివ్యాంగుల కోటాలో అనర్హులు పింఛన్లు పొందుతున్నట్టు పెన్షన్ల తనిఖీ చేస్తున్న అధికారులు గుర్తించారు.
మీకు వచ్చే నెల పెన్షన్ వస్తుందో రాదో దీనిపై క్లిక్ చేసి తెలుసుకోండి: Click Here
బధిరులు సర్టిఫికెట్లతో వికలాంగుల పెన్షన్లు పొందుతున్నారు. పెన్షన్ లబ్ధిదారుల కుటుంబంలో ఎవరికైనా సొంత కారు ఉన్నా, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉన్న ప్రభుత్వం నిర్దేశించిన దాని కంటే పంట పొలం ఎక్కువగా ఉండటం వంటి అంశాలను గుర్తించారు. ఈ నేపథ్యంలో ఏపీ రాష్ట్రప్రభుత్వం మూడునెలల్లో పెన్షన్ అనర్హులను గుర్తించాలని, విచారణ జరిపి వాటిని రద్దు చేయాలని ఏపీ రాష్ట్రముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారు ఆదేశించారు.