AP Intermediate Results :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మార్చి ఒకటో తారీకు నుంచి 20వ తారీకు వరకు ఇంటర్మీడియట్ ప్రధమ మరియు ద్వితీయ సంవత్సర విద్యార్థులకు పరీక్షలను నిర్వహించింది ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు. ఇంటర్ మీడియట్ పరీక్షలు పూర్తయిన 20 రోజులకే అత్యంత వేగంగా ఇంటర్మీడియట్ ఫలితాలను విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.
శనివారం అనగా ఏప్రిల్ 12 వ తారీకు ఉదయం 11 గంటలకు ఫలితాలను విడుదల చేస్తున్నట్లు ఇంటర్మీడియట్ బోర్డు వెల్లడించింది. ఇప్పటికే మూల్యాంకనం, రీ వెరిఫికేషన్, కంప్యూటరీకరణ తదితర ప్రక్రియలను చేపట్టి ఫలితాల విడుదల సిద్దమైంది. నంద్యాల జిల్లాలో ఈ ఏడాది 15,692 మంది మొదటి సంవత్సరం విద్యార్థులు, 13,400 మంది (AP Intermediate) ద్వితీయ సంవత్సరం విద్యార్థులు పరీక్షలు వ్రాయడం జరిగింది. పరీక్షలు రాసిన విద్యార్థులు అందరూ ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇంటర్ బోర్డు అధికారిక వైబ్‌సైట్‌తో పాటు ఇటీవల ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన మన మిత్ర వాట్సాప్ ద్వారా ఫలితాలు అందుబాటులోకి రానున్నాయి.
ఉత్తీర్ణత శాతం పెరిగేనా…?
2023-24 విద్యాసంవత్సరంలో నంద్యాల జిల్లాలో 12,022 మంది (AP Intermediate) ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులు పరీక్షలు రాయగా 7,102 మంది విద్యార్థులు పాసయ్యారు. అలాగే 9,165 మంది ద్వితీయ సంవత్సరం విద్యార్థులు పరీక్షలు రాయగా 6,429 మంది విద్యార్థులు పాసయ్యారు. మొత్తంగా 56% ఉత్తీర్ణతతో నంద్యాల జిల్లా 13వ స్థానంలో నిలిచింది. మొత్తం ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థులు 45.56%, ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 64.87% ఉత్తీర్ణత సాధించారు. 57 ప్రైవేట్ జూనియర్ కళాశాలలో మొదటి సంవత్సరం విద్యార్థులు 59.89%, ద్వితీయ సంవ త్సరం విద్యార్థులు 68.99 శాతం విద్యార్థులు పాసయ్యారు. 19 మోడల్ జూనియర్ కళాశాలల్లో మొదటి సంవత్సరం విద్యార్థులు 60.44%, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 72.67% పాసయ్యారు.
అదేవిధంగా గతేడాది జిల్లాలోని 24 ఒకేషనల్ జూనియర్ కళాశాలల్లో (AP Intermediate) మొదటి సంవత్సరం విద్యార్థులు 60.04 శాతం, ద్వితీయ సంవత్సరంలో 70.04 శాతం ఉత్తీర్ణత సాధించారు. మొత్తంమీద ఈ ఏడాది జిల్లాలో మరింత ఉత్తీర్ణత శాతం మెరుగుపడుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఇంటర్మీడియట్ ఫలితాలు రెండు విధాలుగా తెలుసుకోవచ్చు ఒకటి ఆన్లైన్లో ద్వారా మరి ఒకటి వాట్సాప్ గవర్నర్ మనమిత్ర ద్వారా

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వాట్సాప్ గవర్నెన్స్ అంటే మన మిత్ర ద్వారా ఇలా ఇంటర్మీడియట్ ఫలితాలను (AP Intermediate) ఈ విధంగా తెలుసుకోవాలి..
Step 1: ఏపీ వాట్సాప్ గవర్నెన్స్ నంబర్ 9552300009 కు హాయ్ అని మెసేజ్ పంపాలి.
Step 2: ఆ తర్వాత సెలెక్ట్ సర్వీస్‌లో విద్యాసేవలు ఎంచుకోవాలి.
Step 3: డౌన్‌లోడ్ ఏపీ ఇంటర్ ఫలితాలు-2025 ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
Step 4: మార్కుల మెమో పొందడానికి మీ హాల్‌టికెట్ నంబర్‌ను నమోదు చేయాలి.
Step 5: పీడీఎఫ్ రూపంలో ఫలితాలు కనిపిస్తాయి.
ఆన్లైన్ ద్వారా తెలుసుకునే ప్రాసెస్:
దీనిపై క్లిక్ చేయండి వెంటనే మీకు ఒక పేజీ ఓపెన్ అవుతుంది.అందులో మీకు సంబంధించినటువంటి హాల్ టికెట్ నెంబర్ ని ఎంటర్ చేసి మీరు (AP Intermediate) ఫస్ట్ ఇయర్ లేక సెకండ్ ఇయర్ సెలెక్ట్ చేసుకుని రిజల్ట్స్ ఈజీగా తెలుసుకోవచ్చు.
Inter 1st Year Results Check Link: Click Here
2nd Second Year Results Check link : Click Here
1st year Vocational Results : Click Here
2nd year Vocational Results : Click Here
AP Inter Results Check Link : Click Here