AP Free Housing Scheme 2025 మీరు ఆంధ్ర ప్రదేశ్ వాసులా? మీకు ఇప్పటివరకు సొంతిల్లుగానీ, ఇంటిస్థలంగానీ లేదా? అయితే చంద్రబాబు సర్కార్ ఉచితంగా అందించనున్న ఇంటి స్థలాలకు మీరు అర్హులే.
ఈ పథకానికి సంబంధించిన పూర్తి డిటెయిల్స్…
AP Free Housing Scheme 2025:
ప్రతి మనిషికి కూడు,గూడు, గుడ్డ… ఈ మూడు వుంటేచాలు మనిషి ఆనందంగా జీవిస్తాడు. కూడు(ఆహారం) మనిషి బ్రతికేందుకు అవసరం అయితే… గూడు(ఇళ్లు), గుడ్డ(బట్టలు) ఆత్మగౌరవంగా బ్రతికేందుకు అవసరం అవుతాయి. ఇలా ప్రతి మనిషి మంచి ఇళ్లు, బట్టలు, అహారాన్నే ప్రతిఒక్కరు కోరుకునేది… వీటిని సంపాదించుకునేందుకే కష్టపడేది. పాలకులు కూడా ప్రజలకు మంచి అహరం, మంచి ఇళ్లు, మంచి జీవనాన్ని అందించేందుకు ప్రయత్నిస్తుంటారు.
ఏపీ ప్రభుత్వం కూడా ఏపీ రాష్ట్ర ప్రజల కోసం సరికొత్త పథకాలను తీసుకువస్తోంది. ఇందులో భాగంగా నిరుపేదల సొంతింటికలను నిజం చేసే దిశగా చర్యలు చేపట్టింది. గత ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు నిరుపేదలకు ఉచితంగా [AP Free Housing Scheme 2025] ఇంటి స్థలాలు కేటాయిస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే… ఈ హామీని నమ్మి ప్రజలు కూటమిని గెలిపించారు. ఇప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా వున్నారు… ఈ క్రమంలో ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ ఉచిత ఇంటి స్థలాల పంపిణీకి సంబంధించి అధికారిక ఉత్త్వర్వులను విడుదల చేసారు.
చంద్రన్న ఇల్లు కోసం అప్లై చేసుకొనే లింక్ : Click here
దారిద్య్రరేఖకు దిగువన (BPL) కుటుంబాలకు ఇంటి స్థలం కేటాయించాన్న ఏపీ ప్రభుత్వ నిర్ణయం మేరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేసారు. ఇంటి స్థలాల పొందాలంటే ఏ అర్హతలు వుండాలి? లబ్దిదారుల ఎంపిక ఎలా జరుగుతుంది? కేటాయించిన స్థలంలో ఇంటిని ఎప్పట్లోపు ఇళ్లు కట్టుకోవాలి? తదితర వివరాలతో మార్గదర్శకాలను విడుదల చేసారు.
అందరికీ ఇల్లు పథకం
ఉచిత ఇంటిస్థలం [AP Free Housing Scheme 2025] పొందేందుకు అర్హతలు :
ఏపీలోని ప్రతి కుటుంబానికి సొంతిల్లు వుండాలనేదే చంద్రబాబు సర్కారు లక్ష్యంగా పెట్టుకుంది… అందుకోసమే ‘అందరికీ ఇల్లు’ పథకాన్ని తీసుకువచ్చింది. ఏపీ ప్రభుత్వం ఈ పథకం కింద మొట్టమొదటగా నిరుపేదలకు ఇంటి స్థలాల పంపిణీకి సిద్దమయ్యారు. మరి ఈ ఇందుకు అర్హులు ఎవరో తెలుసుకుందాం.
- దారిద్య్రరేఖకు (BPL) కు దిగువన వుండి అత్యంత పేదరికంలో మగ్గుతూ తలదాచుకోడానికి సొంతిల్లు లేనివారికి ఇంటిస్థలం కేటాయిస్తారు. అయితే వీరివద్ద తెల్లరేషన్ కార్డు తప్పనిసరిగా వుండాలి. లేదంటే వారి పేదరికాన్ని సూచించే మరేదైనా దృవపత్రం సమర్పించాలి.
- లబ్దిదారులకు ఏపీ రాష్ట్రంలో ఎక్కడా కూడా ఇంటిస్థలంగానీ, అలాగే సొంతిల్లుగానీ వుండకూడదు. సొంతూళ్లలో ఇల్లు వుండి జీవనోపాధి కోసం పట్టణాల్లో నివాసంవుండే నిరుపేదలకు ఈ పథకం వర్తించదు. అలాగే తమ నివాస ప్రాంతంలోనే కాదు ఏపీ రాష్ట్రంలో ఇంకెక్కడా స్థలం వున్నా అనర్హులే.
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల గృహనిర్మాణ పథకాల్లో ఇప్పటివరకు లబ్దిపొంది వుండకూడదు. అలా గతంలోనే ప్రభుత్వం నుండి ఇంటి స్థలాన్ని పొందుకొని ఉంటే ఇప్పుడు మళ్లీ ఇంటిస్థలం కావాలంటే కుదరదు. వీరు నిరుపేదలే అయినా ఇంటి స్థలానికి అర్హులు కారు.
ఇంటిస్ధలం ఎంత ఇస్తారు? - అందరికి ఇళ్లు పథకం కింద గ్రామాల్లో అయితే 3 సెంట్లు, ఇంటి స్థలం పట్టణాల్లో అయితే 2 సెంట్ల ఇంటిస్థలాన్ని కేటాయించనున్నారు. ఈ స్థలాన్ని కుటుంబంలోని మహిళల పేరిట కేటాయిస్తారు. పదేళ్ల కాలపరిమితితో ఫ్రీహోల్డ్ హక్కులు కల్పిస్తూ కన్వేయన్స్ డీడ్ ఇవ్వనున్నారు. అంటే పదేళ్ల తర్వాత ఆ ఇంటిస్థలం ఆ కుటుంబం సొంతం అవుతుందన్నమాట… అప్పటివరకు కేవలం ఆ స్థలంలో ఇంటిని నిర్మించుకుని జీవించడమే తప్ప ఎలాంటి యాజమాన్య హక్కులు వుండవు.
- ఇక ఇంటి స్థలాన్ని కేటాయించిన రెండేళ్లలోపే ఇంటిని నిర్మించుకోవాలి. ఇలా ఇంటిస్థలాన్ని ఓ కుటుంబానికి ఒకేసారి కేటాయిస్తామని… ఇక ఆ కుటుంబంలో ఇంకెవ్వరికీ ఇవ్వబోమని స్పష్టం చేసారు. అంటే జీవితకాలంలో ఒకేసారి ఉచితంగా ఇంటిపట్టా ఇవ్వనున్నారు.
- ఆంధ్ర ప్రదేశ్ లోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ప్రభుత్వ భూములను పేదల ఇంటిస్థలాల కోసం కేటాయించనున్నారు. గతంలో మాదిరి నివాస ప్రాంతాలకు దూరంగా ఎక్కడో వాగులు వంకల్లో స్థలాలు కేటాయించకూడదని ఇప్పటికే అధికారులకు కూటమి ప్రభుత్వం ఆదేశించింది. కాబట్టి గ్రామాలు, పట్టణాలకు దగ్గర్లో ఇళ్ల నిర్మాణానికి అనువైన స్థలాలనే అధికారులు గుర్తిస్తున్నారు. త్వరలోనే ఈ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టనుంది కూటమి ప్రభుత్వం
చంద్రన్న ఇల్లు మీకు వస్తుందో రాదో తెలుసుకోండి: Click Here