ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నటువంటి పథకాలలో ఒకటవ తరగతి నుంచి ఇంటర్మీడియెట్ వరకు చదివే విద్యార్థుల కోసం తీసుకువచ్చిన పథకమే AP అమ్మఒడి.
ఈ పథకం కింద అర్హత కలిగిన ప్రతి ఒక్క విద్యార్థిని విద్యార్థులకు ప్రతి సంవత్సరం ₹15000 రూపాయలను నేరుగా వారి యొక్క తల్లి ఖాతాలోకి DBT ద్వారా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కంప్యూటర్లో బటన్ నొక్కి జమ చేయడం జరుగుతుంది. ఈ పథకం కింద ఇప్పటి వరకు 3 విడతల డబ్బులను తల్లుల ఖాతాలలోకి జమ చేసిన ప్రభుత్వం ఇప్పుడు 4వ విడత నిధులు విడుదల చేసేందుకు అన్ని ప్రయత్నాలను సిద్ధం చేస్తుంది. AP అమ్మ ఒడి పథకానికి కేటాయించిన ₹15,000 రూపాయలలో ప్రభుత్వ స్కూళ్లలో చదివే విద్యార్థులకు ₹1000 రూపాయలు స్కూల్ మెయింటినెన్స్ కి మరొక వెయ్యి రూపాయలు టాయిలెట్ మెయింటినెన్స్ కి ₹2000 రూపాయల వరకు నేరుగా స్కూల్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేస్తారు. మిగిలినటువంటి ₹13 వేల రూపాయలను విద్యార్థి యొక్క తల్లి ఖాతాలోకి జమ చేయడం జరుగుతుంది.
ఈ పథకానికి సంబంధించిన డబ్బులు అర్హుల ఖాతాల్లోకి జూన్ 28వ తేదీన నేరుగా DBT ద్వారా కంప్యూటర్లో బటన్ నొక్కి సీఎం జగన్మోహన్ రెడ్డి వారి ఖాతాలోకి జమ చేయడం జరుగుతుంది. జూన్ 24వ తేదీన AP అమ్మ ఒడి పథకానికి సంబంధించిన ఫైనల్ అర్హుల లిస్టు కూడా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయనుంది. ఈ ఫైనల్ అర్హుల లిస్టులో ఎవరి పేరు అయితే ఉంటుందో వారికి మాత్రమే ఈసారి AP అమ్మ ఒడి పథకానికి సంబంధించిన డబ్బులును వారి యొక్క తల్లి ఖాతాలోకి జమ చేస్తారు.
ఇది కూడా చదవండి : విద్యాదీవెన డబ్బులు విడుదల తేదీ ఇదే
AP అమ్మ ఒడి పథకానికి సంబంధించిన అర్హతలు :
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వారై ఉండాలి.
- తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలి.
- విద్యుత్ వినియోగం 300 యూనిట్లు కంటే ఎక్కువ దాటకూడదు.
- కుటుంబ ఆదాయం గ్రామీణ ప్రాంతాలలో పదివేలు పట్టణ ప్రాంతాలలో 12 వేల రూపాయల లోపు కలిగిన వారు మాత్రమే అర్హులు.
- ప్రతి విద్యార్థికి హాజరు 75% శాతం అనేది కచ్చితంగా కలిగి ఉండాలి.
- కుటుంబంలో పిల్లలు ఎంతమంది ఉన్నా ఒకరికి మాత్రమే ఈ అమ్మ ఒడి పథకం వర్తిస్తుంది.
- పొలం తడి నేలయితే మూడు ఎకరాలు మెట్టైతే ఏడు ఎకరాల లోపు మొత్తం మీద పది ఎకరాల లోపు మాత్రమే ఉండాలి.
- కుటుంబంలో ఇన్కమ్ టాక్స్ పే చేసేవారు ఉండకూడదు.
- పట్టణ ప్రాంతాలలో 1000 చదరపు అడుగుల స్థలం కంటే ఎక్కువ ఉండకూడదు.
- నాలుగు చక్రాల వాహనం కుటుంబంలో కలిగి ఉండకూడదు. (ట్రాక్టర్లు, టాక్సీలు, మ్యాక్స్ క్యాబ్లు వీటికి మినహాయింపు ఇచ్చారు)
- కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగం చేసేవారు ఉండకూడదు అయితే మున్సిపాలిటీ పరిధిలో పనిచేసే కార్మికులకు మాత్రం సడలింపు నిచ్చారు.
- ప్రభుత్వ ఉద్యోగం చేసి రిటైర్డ్ అయిన తర్వాత వచ్చే పెన్షన్ తీసుకునే వారు కూడా అనర్హులు.
- తల్లి యొక్క ఆధార్ కార్డు తో బ్యాంక్ అకౌంట్ ని అనుసంధానం చేసుకోవాలి. దీనినే NPCI మ్యాపింగ్ అంటారు.
- హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో తల్లి అలాగే పిల్లలు ఒకే ప్రదేశంలో మ్యాపింగ్ అయి ఉండాలి. అంటే తల్లి ఒకచోట పిల్లలు మరొకచోట హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అయి ఉండకూడదు.
Click Here
అర్హుల లిస్టు చెక్ చేసుకునే విధానం :
ELIGIBLE LIST CHECK NOW
☝ పైన ఎరుపు రంగులో ఉన్న లింక్ ని క్లిక్ చేయండి.
తరువాత మీకు ఈ పేజీ ఓపెన్ అవుతుంది.
ఇందులో మీరు ఏ పథకానికి సంబంధించి అర్హుల లిస్టు చెక్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ పథకాన్ని మొదటగా సెలెక్ట్ చేసుకోవాలి.
తరువాత ఉన్న బాక్స్ లో తల్లి లేదా సంరక్షకుని యొక్క ఆధార కార్డు నంబర్ ఎంటర్ చేయాలి.
తరువాత కింద క్యాప్చ కోడ్ కనిపిస్తుంది ఆ కోడ్ ని దాని కింద ఉన్నటువంటి బాక్స్ లో వేసి గెట్ ఓటిపి అనే బటన్ కనిపిస్తుంది దానిని నొక్కాలి.
తర్వాత మీ ఆధార్ కార్డ్ కి లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్ కు ఒక ఓటిపి వస్తుంది. ఎంటర్ చేసి పక్కనే వెరిఫై అని ఒక చిన్న ఆప్షన్ కనిపిస్తుంది కనిపిస్తూ ఉంటుంది. దానిని నొక్కాలి. అప్పుడు ఓటిపి వెరిఫై అవుతుంది తర్వాత కిందకి స్క్రోల్ చేస్తే ఈ విధంగా ఎలిజిబులిస్టు ఓపెన్ అయిపోతుంది.
ఇందులో స్టేటస్ దగ్గర ఎలిజిబుల్ ఉంటే కచ్చితంగా మీకు కూడా ఖాతాలోకి డబ్బులు విడుదల చేసినప్పుడు వస్తాయి. ఒకవేళ మీకు స్టేటస్ దగ్గర ఎలిజిబుల్ లేకుండా ఏదైనా రిమార్క్స్ ఉంటే అక్కడ వాళ్ళు మెన్షన్ చేస్తారు దాని ప్రకారం సచివాలయం కి వెళ్లి సరి చేసుకుంటే మళ్లీ డబ్బులు విడుదల చేసినప్పుడు మీ ఖాతాలోకి పడే అవకాశం ఉంటుంది.
గమనిక: ఆన్లైన్లో అర్హుల లిస్టు చెక్ చేసుకునే విధానంలో తల్లి లేదా సంరక్షకుని యొక్క ఆధార్ కార్డుకు ఫోన్ నెంబర్ను కచ్చితంగా లింక్ అనేది కలిగి ఉండాలి లేకపోతే ఈ ప్రాసెస్ మీరు చేయలేరు.
ఈ AP అమ్మ ఒడి పథకానికి సంబంధించి మీరు ఆఫ్లైన్లో మీకు సంబంధించిన గ్రామ అవార్డు సచివాలయానికి వెళ్లి నోటీస్ బోర్డ్ లో చూసినట్లయితే అక్కడ మీకు అర్హులు లిస్ట్ అనేది కనిపిస్తుంది. అందులో మీ పేరు ఉంటే మీకు డబ్బులు కూడా వస్తాయి.
అమ్మ ఒడి పథకం యొక్క ముఖ్య ఉద్దేశం:
నిరుపేద కుటుంబంలో పిల్లల చదువు భారంగా మారుతున్న నేపథ్యంలో వాళ్లని స్కూలుకు పంపకుండా ఏవైనా చిన్న చిన్న పనులకు పంపడం వల్ల వాళ్ళ భవిష్యత్తు నాశనం కాకూడదని మన ఆంధ్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పిల్లలను స్కూలుకు పంపే ప్రతి ఒక్క తల్లికి AP అమ్మ ఒడి పథకం కింద ₹13 వేల రూపాయలను ప్రోత్సాహంగా అందివ్వడం ద్వారా వారి పిల్లలను స్కూలుకు పంపేందుకు ఎక్కువ మంది మహిళలు ఆసక్తి చూపి వారి భవిష్యత్తును మార్చేందుకు సహాయపడుతున్నారు. మొత్తం మీద ఈ యొక్క పథకం ఉద్దేశం ఏమిటంటే ప్రతి పిల్లవాడు కూడా చదువుకోవాలి.
I am not in veleru job purpose another village