AP రైతులకు ఇన్పుట్ సబ్సిడీ 2023; మరోసారి ఖాతాలోకి నిధులు విడుదల అర్హుల జాబితా ప్రకటించిన జగన్

రైతుల ఖాతాలలోకి 1,117.21 కోట్లు విడుదల:

AP రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి రైతులకు మరోసారి శుభవార్త తెలిపారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో రేపు జరగబోయేటువంటి కార్యక్రమంలో రైతులకు ఇన్పుట్ సబ్సిడీ అమౌంట్ను కంప్యూటర్లో బటన్ నొక్కి సీఎం జగన్ విడుదల చేయనున్నారు. ప్రతి ఏటా వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతిని రైతు దినోత్సవం గా జరుపుకుంటున్న విషయం తెలిసిందే అయితే ఈ రైతు దినోత్సవం నాడు ఆంధ్రప్రదేశ్ రైతులకు సీఎం జగన్ ఇన్పుట్ సబ్సిడీ నిధులను విడుదల చేయాలని ఖరారు చేశారు.

ఈ ఇన్పుట్ సబ్సిడీ పథకానికి సంబంధించిన డబ్బులను శనివారం అనగా జూలై 8 2023న విడుదల చేయాలని జీవో జారీ చేశారు. 2022 ఖరీఫ్ కు సంబంధించిన వాతావరణ బీమా ఫసల్ బీమా కింద రాష్ట్రంలోని రైతులకు చేయూతనిచ్చే విధంగా సీఎం జగన్ కంప్యూటర్లో బటన్ నొక్కి ఇన్పుట్ సబ్సిడీ కింద నిధులను విడుదల చేయనున్నారు. ఈ కార్యక్రమం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో రైతు దినోత్సవం సందర్భంగా బహిరంగ సభ ఏర్పాటు చేసి నిధులను విడుదల చేయనున్నారు.

ఏ సీజన్లో నష్టపోయిన రైతులకు అదే సీజన్లో సాయం చేసి చేయూతనందించాలని మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా వైయస్సార్ జన్మదినోత్సవం రోజునే ప్రభుత్వం రైతు దినోత్సవం నిర్వహించి ఈ నిధులను విడుదల చేస్తుంది. ఈ పథకానికి సంబంధించి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సీఎం జగన్ మోహన్ రెడ్డి రైతుల పక్షపాతి అని రైతుల కోసం అనేక రకాల సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి వాటిని ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నారని రైతులను ఆదుకునే దిశగా పోరాటం చేస్తున్నారని ఈ ఘనత మన సీఎం జగన్ కే దక్కుతుందని ఆయన తెలిపారు.

20230707 132315

వైయస్సార్ ఉచిత పంటల బీమా అభ్యంతరాలకు సంబంధించిన ముఖ్యమైన తేదీ:

వైయస్సార్ ఉచిత పంటల బీమా పథకానికి సంబంధించి అర్హులైన రైతుల జాబితాలను రైతు భరోసా కేంద్రాలలో ఇప్పటికే నోటీసు బోర్డులో ఉంచడం జరిగింది. రైతులకు ఏవైనా అభ్యంతరాలు కనుక ఉన్నట్లయితే జూలై 5వ తేదీ లోపు వారి యొక్క అభ్యంతరాలను తెలియజేయాలని వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్ హరి కిరణ్ తెలిపారు.

గడిచిన 5 రోజుల లబ్ధిదారుల జాబితాలను సోషల్ ఆడిట్ కోసం రైతు భరోసా కేంద్రాలలో ప్రదర్శించిన విషయం తెలిసిందే దీనికి సంబంధించిన గడువు తేదీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జూలై 5 వరకు మరోసారి పొడిగించడం జరిగింది. దీనికి సంబంధించి ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే లిఖితపూర్వకంగా స్వీకరించడం జరుగుతుందని వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్ హరి కిరణ్ తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా 10.2 లక్షల మంది రైతులకు పరిహారం:

జూలై 8వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి రైతు దినోత్సవం సందర్భంగా వైయస్సార్ జయంతి రోజున అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో రైతుల ఖాతాలోకి ఉచిత పంటల బీమాను జమ చేయనున్నారు.

ఈసారి రాష్ట్రవ్యాప్తంగా 10.2 లక్షల మంది రైతుల ఖాతాలలోకి 1,117.21 కోట్ల రూపాయలను నేరుగా కంప్యూటర్లో బటన్ నొక్కి నిధులను విడుదల చేయనున్నారు. 2022 సంవత్సరంలో అకాల వర్షాల వల్ల పంటలు నష్టపోయిన ఈ ఇన్పుట్ సబ్సిడీ ని రైతుల ఖాతాలోకి విడుదల చేయనున్నారు.

ఇన్పుట్ సబ్సిడీ అర్హుల జాబితా కోసం దీనిని క్లిక్ చేయండి Click here

ఈ వైఎస్ఆర్ ఇన్పుట్ సబ్సిడీకి ఎలా అప్లై చేసుకోవాలి:

వైయస్సార్ ఇన్పుట్ సబ్సిడీకి మీరు అప్లై చేసుకోవాలంటే మొదటగా మీ పేరు మీద వ్యవసాయ భూమి కలిగి ఉండాలి. మీ యొక్క పట్టాదారు పాసుబుక్ తో పాటు మీ ఆధార్ కార్డు తీసుకుని రైతు భరోసా కేంద్రాలలోకి వెళ్ళనట్లయితే అక్కడున్న సంబంధిత అధికారులు మీకు ఈ క్రాప్ లో నమోదు చేసి ఈ వైఎస్ఆర్ ఇన్పుట్ సబ్సిడీ పథకానికి అర్హులో కాదో స్టెప్ వెరిఫికేషన్ చేసిన తర్వాత మీకు నిజంగా అర్హత ఉన్నట్లయితే అర్హులుగా గుర్తించడం జరుగుతుంది.

వైయస్సార్ ఇన్పుట్ సబ్సిడీ పథకానికి సంబంధించి ఎవరైతే అర్హులు ఉంటారో అటువంటి వారందరికీ అకాల వర్షాల వల్ల గాని, వరదల వల్ల గాని పంట నష్టం సంభవించితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నష్టపోయినటువంటి పంటగాను రైతులకు కొంత సొమ్మును నేరుగా వారి ఖాతాలోకి పంపి వారికి కొంత చేయూతనిస్తుంది.

YSR ఇన్పుట్ సబ్సిడీ 2023
YSR ఇన్పుట్ సబ్సిడీ

ఈ క్రాప్ నమోదవడం వల్ల ఉపయోగాలు:

రైతు భరోసా కేంద్రాలలో ఈ క్రాప్ నమోదు చేసుకున్న ప్రతి రైతుకి అనేక ప్రయోజనాలు ఉన్నాయి. రైతులకు సబ్సిడీతో నాణ్యమైన విత్తనాలు ఇవ్వడం, సబ్సిడీతో ఎరువులు ఇవ్వడం, అకాల వర్షాల వల్ల లేదా వరదల వల్ల నష్టపోయినటువంటి పంటకు నష్టపరిహారాన్ని రైతులకు చెల్లించడం లో ఈ క్రాప్ అనేది ముఖ్య పాత్ర పోషిస్తుంది.

కాబట్టి ప్రతి రైతు కూడా ఈ క్రాప్ లో నమోదవ్వాలని ఈ క్రాప్ లో నమోదైన రైతులకు అనేక రకాలుగా ప్రయోజనాలు ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు విరివిగా తెలియజేస్తుంది.

మీరు ఈ క్రాప్ లో నమోదు చేసుకున్నారో లేదో తెలుసుకునేందుకు దేనిని క్లిక్ చేయండి click here

ఈ వైఎస్ఆర్ ఇన్పుట్ సబ్సిడీ ముఖ్య ఉద్దేశం:

YSR ఇన్‌పుట్ సబ్సిడీ అనేది ఆంధ్రప్రదేశ్‌లోని రైతులకు సహాయం చేయడానికి ఉద్దేశించిన వ్యవసాయ మద్దతు కార్యక్రమం. ఈ పథకం కింద, అర్హులైన రైతులు విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు మరియు వ్యవసాయ యంత్రాలు వంటి వివిధ వ్యవసాయ ఇన్‌పుట్‌లకు సబ్సిడీ రూపంలో ఆర్థిక సహాయం పొందుతారు.

రైతులపై ఆర్థిక భారాన్ని తగ్గించడం మరియు వారికి అవసరమైన ఇన్‌పుట్‌లు అందుబాటులో ఉండేలా చూడడం ద్వారా వ్యవసాయ ఉత్పాదకతను ప్రోత్సహించడం మరియు పెంచడం YSR ఇన్‌పుట్ సబ్సిడీ యొక్క లక్ష్యం. సబ్సిడీలను అందించడం ద్వారా, వ్యవసాయ పద్ధతులను మెరుగుపరచడం, పంట దిగుబడిని పెంచడం మరియు చివరికి రైతుల సామాజిక-ఆర్థిక స్థితిని పెంచడం ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

YSR ఇన్‌పుట్ సబ్సిడీ పథకం గురించి ఒక తీర్మానం చేయడానికి, ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయ రంగంపై దాని ప్రభావం, సబ్సిడీ పంపిణీ యంత్రాంగం యొక్క ప్రభావం మరియు రైతులకు మొత్తం ప్రయోజనాలను అంచనా వేయాలి. అదనంగా, పథకం యొక్క ఆర్థిక స్థిరత్వం మరియు దాని నిరంతర అమలుకు ప్రభుత్వం యొక్క నిబద్ధతను పరిగణనలోకి తీసుకోవడం అవసరం.

YSR ఇన్పుట్ సబ్సిడీ 2023
YSR ఇన్పుట్ సబ్సిడీ

PAYMENT STATUS

Verified by MonsterInsights