ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఊహించని శుభవార్త వచ్చేసిందండి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాలోకి అన్నదాత సుఖీభవ పథకం కింద 7వేల రూపాయలను డిబిటి పద్ధతిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారు ఖాతాలోకి విడుదల చేయబోతున్నారు.

దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 46.86 లక్షల మంది రైతుల ఖాతాలోకి నేరుగా 3700 కోట్ల రూపాయలకు పైగా నిధులను విడుదల చేయబోతున్నారు.
గతంలో మాదిరిగా కాకుండా ఈసారి అర్హులకు మాత్రమే నిధులు అందేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రభుత్వం రైతుల ఖాతాలోకి 5000 మరియు కేంద్ర ప్రభుత్వం 2000 రూపాయల చొప్పున అర్హత కలిగినటువంటి రైతుల ఖాతాలోకి నవంబర్ 19 వ తారీఖున విడుదల చేయనున్నాయి.
AP రైతులకు
2025 ఆగస్టు నెలలో కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సంబంధించిన 20వ విడత డబ్బులను విడుదల చేసింది. దాదాపు 11 కోట్ల మంది రైతులకు ఖాతాలోకి నిధులను విడుదల చేసింది. ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం మూడు లక్షల 77 వేల కోట్లు రూపాయలను రైతులకు పెట్టుబడి సాయంగా అందించింది. తాజాగా అన్నదాత సుఖీభవ పథకంలోని అర్హులకు కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సంబంధించిన పథకం ద్వారా రెండు వేల రూపాయలను 46.86 లక్షల మంది రైతులకు డిబిటీ పద్ధతిలో డబ్బులు వేయనున్నారు.
అన్నదాత సుఖీభవ పథకాన్ని కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి అమలు చేస్తున్న విషయం తెలిసిందే.

ఇందులో రాష్ట్ర ప్రభుత్వం వాటా 14000 కేంద్ర ప్రభుత్వం వాటా 6000 రూపాయలు ఈ నిధులను ఒకేసారి కాకుండా విడతల వారీగా అంటే కేంద్ర ప్రభుత్వం మూడు సమాన వాయిదాలుగా ప్రతి వాయిదాలో 2000 రూపాయలు చొప్పున రైతులకు పెట్టుబడి సాయాన్ని అందిస్తుంది.
రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రైతులకు మూడు విడతలుగా మొదటి విడతలో 5000 రెండవ విడతలో 5000 మూడవ విడతలో 4000 చొప్పున నేరుగా రైతుల ఖాతాలోకి నిధులను విడుదల చేస్తుంది.
ఈరోజు ఎవరెవరి ఖాతాలోకి డబ్బులు వస్తాయో ఈ లింకు ద్వారా తెలుసుకోండి:- Click here
కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ యోజన పథకం కింద 21 విడత నిధుల విడుదలకు ముందు ఒక రెండు కొత్త రూల్స్ ని విడుదల చేసింది. అవి ఈ కేవైసీ ఇంకా ఎవరైనా చేసుకొని రైతులు ఉంటే అటువంటి వారికి 21వ విడత నిధులు జమ కావని తెలిపింది. ఇక రెండోదిగా చూస్తే ఒకే కుటుంబంలో ఒకరి కంటే రైతులు ఎక్కువగా ఉన్న అటువంటి కుటుంబంలోని రైతులను అనర్హుల లిస్టులో పెట్టింది.
మూడోదిగా 2019 తర్వాత ఎవరైతే భూములు కొని వారి పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అటువంటి వారికి కూడా పథకాన్ని తొలగిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం కేవలం ఎవరైతే సొంత భూమి కలిగి ఐదు ఎకరాల కంటే భూమి తక్కువ ఉన్నటువంటి వారికి మాత్రమే డబ్బులనిస్తుంది.
AP రైతులకు ఈ రోజు నుంచి
రాష్ట్ర ప్రభుత్వం కౌలు రైతులకి మరియు సొంత భూమి కలిగిన వారికి అన్నదాత సుఖీభవ డబ్బులను విడుదల చేస్తుంది. అయితే కవులు రైతులు కవులు రైతు కార్డు ని తీసుకుని రైతు సేవా కేంద్రాలలో అప్లై చేసుకోవాలి.
కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి ఈ పథకాలను అమలు చేస్తున్నాయి కాబట్టి ఎవరైనా రైతులు ఈ పథకాల కోసం అప్లై చేసుకోవడానికి పిఎం కిసాన్ సంబంధిత అయితే సిఎస్సి సెంటర్ అనగా కామన్ సర్వీస్ సెంటర్ లోకి ఆధార్ బ్యాంక్ అకౌంట్ పట్టాదార్ పాస్ బుక్ ఈ డాక్యుమెంట్స్ తీసుకుని వెళ్లి ఆధార్ లింక్ అయిన ఫోన్ నెంబర్ తో ఓటీపీ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అర్హత ఉన్నట్లయితే కేంద్ర ప్రభుత్వం డబ్బులు విడుదల చేస్తుంది.

రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి రైతు సేవా కేంద్రాలలో అప్లై చేసుకోవాలి ఆధార్ లింక్ అయిన ఫోన్ నెంబర్ తో పాటు పట్టాదారు పాసుబుక్ ఫోన్ నెంబర్ ఆధార్ కార్డు తీసుకుని వెళ్లి అప్లై చేసుకోవాలి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారు మరియు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ పథకాలకు విడివిడిగా కలిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 46.86 లక్షల మంది రైతుల ఖాతాలోకి 3700 కోట్ల రూపాయలను నేరుగా డిబిటీ పద్ధతిలో విడుదల చేయనున్నారు. నవంబర్ 19 తారీకు నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నల ఖాతాలోకి ఈ నిధులు విడుదల కానున్నాయి.
అన్నదాత సుఖీభవ అర్హుల లిస్ట్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి :- Click here
పిఎం కిసాన్ యోజన అర్హుల లిస్ట్ కోసం ఈ లింకు క్లిక్ చేయండి:- Click here

