కొత్త పెన్షన్ (NTR bharosa Pensions) కోసం దరఖాస్తు చేసుకునే వారికి ముఖ్యమైన సమాచారం
ప్రభుత్వం అందించే సామాజిక భద్రతా పెన్షన్ (NTR bharosa Pensions) పథకాల్లో కొత్తగా అర్హత పొందే వారికి దరఖాస్తుల స్వీకరణకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభమైంది. పెన్షన్ పొందేందుకు అర్హత ఉన్నవారు నిర్ణీత సమయంలో దరఖాస్తు చేసుకోవడంతో పాటు, తమ కేటగిరీకి సంబంధించిన అవసరమైన ధృవపత్రాలను సమర్పించాల్సి ఉంటుంది.
NTR bharosa Pensions అవసరమైన పత్రాలు ఏమిటి?
పెన్షన్ రకం ఆధారంగా పత్రాల్లో కొంత తేడా ఉంటుంది. సాధారణంగా
- ఆధార్ కార్డు,
- రేషన్ కార్డు లేదా
- ఆదాయానికి సంబంధించిన ధృవపత్రం అవసరం అవుతుంది.
- వృద్ధాప్య పెన్షన్ కోసం వయస్సును నిర్ధారించే ఆధారం లేదా ఆధార్ వివరాలు సమర్పించాలి.
- వితంతు పెన్షన్ కోరుకునే వారు భర్త మరణ ధృవపత్రంతో పాటు అవసరమైన గుర్తింపు పత్రాలు ఇవ్వాలి.
- వివాహిత ఒంటరి మహిళలు తమ పరిస్థితిని నిర్ధారించే సంబంధిత ధృవపత్రాన్ని సమర్పించాల్సి ఉంటుంది.
- అవివాహిత ఒంటరి మహిళలకు తహసీల్దార్ నుంచి పొందిన ధృవపత్రం అవసరం.
దివ్యాంగుల పెన్షన్ కోసం 40 శాతం లేదా అంతకంటే ఎక్కువ వైకల్యాన్ని నిర్ధారించే సదరం సర్టిఫికెట్ తప్పనిసరి. అలాగే చేనేత కార్మికులు, మత్స్యకారులు, దప్పు కళాకారులు, చర్మకారులు, కల్లు గీత కార్మికులు, ట్రాన్స్జెండర్లు తమ వృత్తి లేదా అర్హతను నిర్ధారించే సంబంధిత శాఖల ధృవపత్రాలను అందించాలి.

దరఖాస్తు ఎక్కడ, ఎప్పుడు చేయాలి?
కొత్త పెన్షన్ల (NTR bharosa Pensions) కోసం సెప్టెంబర్ 7 నుంచి 16వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. అర్హత ఉన్న వ్యక్తులు తమ గ్రామ లేదా వార్డు సచివాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చు. అక్కడి డిజిటల్ అసిస్టెంట్ ద్వారా దరఖాస్తు నమోదు ప్రక్రియ చేపట్టబడుతుంది.
దరఖాస్తు చేసిన తర్వాత ఆన్లైన్ రిజిస్ట్రేషన్, ఈ-కేవైసీ వంటి ప్రక్రియలు కూడా పూర్తి చేయాల్సి ఉంటుంది. అనంతరం సంబంధిత అధికారులు దరఖాస్తుదారుడి వివరాలు, అర్హత, సమర్పించిన పత్రాలను పరిశీలిస్తారు.
తల్లికి వందనం డబ్బులు ఇంకా పడలేదా ఈ 1 పని చేస్తే చాలు : Click Here
అధికారుల పరిశీలన తర్వాతే తుది నిర్ణయం
దరఖాస్తుల పరిశీలనలో గ్రామస్థాయి నుంచి మండల, డివిజన్ స్థాయి వరకు సంబంధిత అధికారులు తమ పరిధిలో ధృవీకరణ చేపడతారు. అర్హత ఉన్నవారిని గుర్తించి తదుపరి దశకు పంపిస్తారు. నిర్ణయించిన గడువులో పరిశీలన, ధృవీకరణ ప్రక్రియ పూర్తయ్యేలా అధికారులు చర్యలు తీసుకోనున్నారు.
పెన్షన్‌కు అర్హత ఉన్నవారు చివరి తేదీ వరకు వేచి ఉండకుండా ముందుగానే దరఖాస్తు చేసుకోవడం మంచిది. అవసరమైన అన్ని పత్రాలను సిద్ధంగా ఉంచుకుని, దరఖాస్తులో ఇచ్చే వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో ఒకసారి పరిశీలించుకోవాలి. ఇలా చేస్తే దరఖాస్తు ప్రక్రియలో అనవసరమైన ఆలస్యాలు లేదా ఇబ్బందులు తలెత్తకుండా ఉంటుంది.
ఆంధ్రాలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల (NTR bharosa Pensions) దరఖాస్తుల ప్రక్రియ శరవేగంగా ప్రారంభమైంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని అర్హులైన వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు మరియు ఒంటరి మహిళలు తమ సమీప గ్రామ, వార్డు సచివాలయాలకు చేరుకుని అప్లికేషన్లు సమర్పిస్తున్నారు.
NTR bharosa Pensions ముఖ్యమైన తేదీలు & ప్రక్రియ:
- ఈ నెల 16 వరకు: సచివాలయాల్లో దరఖాస్తుల స్వీకరణ
- ఈ నెల 17 నుండి 21 వరకు: క్షేత్రస్థాయి పరిశీలన
- ఈ నెల 22 నుండి 24 వరకు: MPDOలు, మున్సిపల్ కమిషనర్ల పరిశీలన
- ఈ నెల 25, 26 తేదీల్లో: నూతన పింఛన్లకు నిధుల ప్రతిపాదన మరియు SERP CEO, సోషల్ వెల్ఫేర్ అధికారుల పర్యవేక్షణలో మంజూరు
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అమలులోకి రాకముందే ఈ ప్రక్రియను పూర్తి చేసి, దఫదఫాలుగా లబ్ధిదారులకు పింఛన్లు అందించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

కావలసిన పత్రాలు:
దరఖాస్తుతో పాటు ఆధార్ కార్డు, రైస్ కార్డు, ఆదాయ ధ్రువీకరణ పత్రం, కుల ధ్రువీకరణ పత్రం (సదరం సర్టిఫికేట్ దివ్యాంగులకు) జత చేయాల్సి ఉంటుంది.
మొదటిరోజు సర్వర్ సమస్యలు:
రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి అప్లికేషన్ల స్వీకరణ ప్రారంభం కావడంతో తొలిరోజు పలు సచివాలయాల్లో ఆన్లైన్ సర్వర్ మందగించి ప్రక్రియకు కొంత అంతరాయం కలిగింది. ఉదాహరణకు సాలూరు, కురుపాం, పాచిపెంట ప్రాంతాల్లో భారీగా అప్లికేషన్లు రాగా, సర్వర్ సమస్యల వల్ల కొన్ని మాత్రమే ఆన్లైన్ అయ్యాయి.
NTR bharosa Pensions దరఖాస్తులకు కేవలం వారం రోజులే గడువు ఉండటంతో మూడేళ్లుగా ఎదురుచూస్తున్న అర్హులు పెద్ద సంఖ్యలో సచివాలయాలకు తరలివస్తున్నారు. మరోవైపు ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో వివిధ రాజకీయ పార్టీల నాయకులు కూడా అర్హులను నేరుగా సచివాలయాలకు తీసుకెళ్లి దరఖాస్తులు చేయిస్తున్నారు.
NTR Bharosa Pension Application Download : Click Here
NTR NTR Bharosa Pension Online Apply : Click Here

