PM KISAN 19 వ విడత:
PM KISAN 19 వ విడత భారతదేశవ్యాప్తంగా వ్యవసాయం చేస్తున్నటువంటి రైతులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. అది ఏంటంటే ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం ఈ(PM-KISAN) స్కీం కింద వ్యవసాయం చేసే రైతులకు 19వ విడత డబ్బుల సాయం అందించే తేదీ ఖారారైంది.
ఈ క్రమంలో ఫిబ్రవరి నెల 24 గవ తేది, 2025 వ సంవత్సరం న విడుదల చేయబోతున్నట్లు కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటించారు. ఈ పథకం కింద ప్రధాని నరేంద్ర మోదీ బీహార్ రాష్ట్రం నుంచి ఈ 19వ విడతకు సంబంధించిన డబ్బులను విడుదల చేయనున్నారు.
PM-KISAN యోజన పథకం కింద అర్హత కలిగిన రైతు ఖాతాకు రూ. 2,000 చొప్పున మంజూరు చేస్తారు.
వ్యవసాయ శాఖ మంత్రి.. గత 18వ విడతకు సంబంధించి, 2023 అక్టోబర్ 5న మహారాష్ట్రలోని వాషిమ్ నుంచి విడుదలయ్యింది. ఇందులో 9 కోట్ల వ్యవసాయం ద్వారా జీవనం సాగిస్తున్నటువంటి రైతుల ఖాతాలకు రూ. 20,000 కోట్లను జమ చేశారు. ఈ విషయాన్ని బీహార్ రాజధాని పాట్నాలో జరిగిన కర్పూరి ఠాకూర్ 101వ జయంతి వేడుకల్లో కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ “వ్యవసాయం, రైతుల అభివృద్ధికి బీహార్ ప్రభుత్వం అద్భుతంగా పని చేస్తుందని ప్రస్తావించారు. ఈ క్రమంలో 19వ విడత పంపిణీకి ప్రధాని బీహార్ రాబోతున్నారని స్పష్టం చేశారు.
మూడు విడతలుగా…
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి {PM KISAN SAMMAN NIDHI YOJANA} పథకాన్ని 2019లో భారతదేశ ప్రభుత్వం ప్రారంభించింది. ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశ్యం రైతులకు ఆర్థిక సహాయం అందించడం మరియు వారి జీవనోపాధిని మెరుగుపరచడమే లక్ష్యంగా కేద్ర ప్రభుత్వం దీనిని రూపొందించింది. ఈ పథకం కింద అర్హత పొందినటువంటి రైతులకు ఏడాదికి 6,000 రూపాయల చొప్పున వ్యవసాయ అవసరతల కొరకు కేంద్ర ప్రభుత్వం మూడు విడతలు చొప్పున ఆర్థిక సహాయం అందిస్తారు. ఈ మొత్తం ఒక సంవత్సరానికి మూడు విడతలుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో 2,000 వేల రూపాయల చొప్పున జమ చేస్తారు.
ఈ పీఎం కిసాన్ పథకం ద్వారా రైతులకు మేలు చేయడమే కాక, వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించడానికి నగదు రూపంలో సాయం అందిస్తున్నారు. ఈ పీఎం కిసాన్ సంబంధించిన పథకం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు 18 విడతలుగా రూ. 2 లక్షల కోట్ల రూపాయలకు పైగా రైతుల ఖాతాలకు జమ చేశారు.
PM కిసాన్ అర్హుల లిస్ట్:
పీఎం కిసాన్ లబ్ధిదారులు వారి జాబితాను ఎలా చూసుకోవాలంటే..
రైతులు తమ గ్రామం మరియు జిల్లాతో పాటు రాష్ట్రం డీటెయిల్స్ పూర్తిగా ఎంటర్ చేసి PM కిసాన్ యోజన లబ్ధిదారుల జాబితాను సులభంగా తెలుసుకోవచ్చు. లభ్యమయ్యే సమాచారాన్ని తెలుసుకోవడానికి, మీరు ఈ క్రింది విధానాలను పాటించాలి.
ముందుగా PM-KISAN అధికారిక వెబ్సైట్ https://pmkisan.gov.in ను సందర్శించండి
- ఆ తర్వాత నో యూవర్ స్టేటస్ పై క్లిక్ చేయండి
- అక్కడ మీరు నమోదు చేసిన రిజి స్ట్రేషన్ నంబర్, క్యాప్చా కూడా ఎంటర్ చేయండి
- ఆ తర్వాత మీరు అప్లై చేసుకున్న సమాచారం మీకు చూపిస్తుంది
- అర్హుల జాబితాలో మీ పేరు ఉంటే మీరు ఈ ప్రధానమంత్రి కిసాన్ సమ్మనిది పథకం కింద ఆర్థిక సహాయం పొందవచ్చు
రైతుల కోసం..
ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) పథకాన్ని ప్రతి సంవత్సరమూ కొనసాగించడమే కాక, క్రమం తప్పకుండా విడతలుగా రైతుల ఖాతాలకు డబ్బు జమ చేయడం ద్వారా, రైతులకు గణనీయమైన ఆర్థిక సహాయం ప్రభుత్వం అందిస్తోంది. ఈ పథకం రైతుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి, వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడానికి దోహదపడుతోంది.
PM కిసాన్ అర్హుల లిస్ట్ చెక్ చేసుకొనేందుకు దీనిని క్లిక్ చేయండి: Click Here