తల్లికి వందనం 15,000:
తల్లికి వందనం 15,000 కూటమిని ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చిన పథకాల్లో తల్లికి వందనం అనే పథకం కూడా ఒకటి. ఈ తల్లికి వందనం అనేటువంటి పథకం ఎప్పుడు అమలు అవుతుందని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం మొత్తం ఆసక్తిగా ఆశగా ఎదురుచూస్తోంది.
(AP) ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వ ఘన విజయానికి కారణంగా నిలిచినటువంటి ప్రధానమైన సూపర్ సిక్స్ పథకాల హామీలు అమలుపై ఇంకా ఖచ్చితమైనటువంటి క్లారిటీ రావడం లేదు.
ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో గేమ్ ఛేంజర్ గా నిలిచిన అమ్మ ఒడి అనేటువంటి పథకంపై రకరకాల ఊహాగానాలు ఏపీ ప్రజలకు వినిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇప్పటికే ఆరు నెలలు పూర్తయింది. అమ్మ ఒడి పథకం తోపాటు సూపర్ సిక్స్ హామీలను ఎప్పుడు అమలు చేస్తారని విపక్ష వైసీపీ కూటమి ప్రభుత్వాన్ని నిలదీస్తోంది. ఈ విద్యాసంవత్సరంలో కచ్చితంగా తల్లికి వందనం ఇస్తామని కూటమి ప్రభుత్వం ఇంతకాలం చెబుతూ వస్తోంది.
2019లో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పుడు ప్రవేశపెట్టిన అమ్మ ఒడి పథకాన్ని 2020 జనవరి మాసంలో ప్రవేశపెట్టిందని ప్రస్తుత అధికారంలో ఉన్నటువంటి ఏపీ కూటమి ప్రభుత్వానికి గుర్తు చేసింది. అంటే తమకు ఆరేడు నెలల సమయం కావాలని పరోక్షంగా చెప్పకనే చెప్పింది కూటమి ప్రభుత్వం. ఇప్పుడు కూటమి కోరుకున్న సయయం కూడా దగ్గర పడటంతో అమ్మ ఒడి పథకంను ఎప్పుడు అమలు చేస్తారని ఇటు చదువుకునే విద్యార్థులు అటు వారి తల్లిదండ్రులు అంతా ఆసక్తితో అమ్మ ఒడి పథకం కోసం ఎదురుచూస్తున్నారు.
164 సీట్లతో ఘనమైనటువంటి విజయం అందుకున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ఆరు నెలల పాటు చాలా రకాలైన పరిపాలనా సంస్కరణలు తీసుకువచ్చారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి రాజధాని అలాగే అమరావతితోపాటు పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై ఎక్కువ ఫోకస్ చేశారు. సంపద స్రుష్టించాలనే దృఢమైన సంకల్పంతో పనిచేస్తున్నారు. ఏపీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా సరిగా లేకపోవడంతో కొత్తగా అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో చెప్పినటువంటి సంక్షేమ పథకాలను ఇన్నాళ్లు పెద్దగా ఆశించలేదనే చెప్పాలి. కానీ, ఆర్నెల్ల హనీమూన్ పీరియడ్ ముగిసిపోవడంతో సంక్షేమం పథకాలు ఎప్పుడిస్తారంటూ ఏపీ ప్రజలు ఆరా తీయడం ఎప్పుడు ఇస్తారా అని తెలుసుకోవాలన్న ఆశ మొదలైంది. ఇన్నాళ్లు విపక్షం గోలగోల చేసినా పట్టించుకోని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇప్పుడు నూతన 2025 సంవత్సరంలోనికి అడుగుపెట్టిన తరువాత సంక్రాంతి పండగ సమయంలో అయినా అమ్మ ఒడి పథకం కింద చదువుకునే విద్యార్థులకు ఆర్థిక సాయం చేస్తారా? లేదా? అని అటు తల్లులు ఇటు విద్యార్థులు అందరూ కూడా ఆశగా ఎదురుచూస్తున్నారు.
తల్లికి వందనం పథకం పూర్తి వివరణ:
ఏపీ కూటమి ఘన విజయంలో అమ్మ ఒడి పథకం పాత్ర ఎక్కువ శాతం ఉందనే విశ్లేషణలు ఉన్నాయి. ఈ అమ్మ ఒడి పథకం కింద ఒక ఇంట్లో తల్లితండ్రులకు ఎంత మంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు ఒక్కొక్కరికి 15 వేల రూపాయల చొప్పున ఇస్తామని ఎన్నికల్లో కూటమి నేతలు హామీనిచ్చారు. గత అధికారంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వంలో ఇదే పథకాన్ని అమ్మ ఒడి పథకం అనే పేరుతో అమలు చేశారు. గతంలో అమ్మ ఒడి పథకం కింద ఒక్కోఇంట్లో ఒకరికే ఈ అమ్మ ఒడి పథకం డబ్బు చెల్లించేవారు. తొలుత 2020 జనవరి నెలలో అమ్మ ఒడి చెల్లింపులు చేసిన గత అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం ఆ తర్వాత ఏడాది నుండి జూన్ నెలకు మార్చింది. ఈ విధానంలో గత గడిచినటువంటి ఐదేళ్ల పాలనలో నాలుగేళ్లు మాత్రమే ఈ అమ్మ ఒడి పథకాన్ని అమలు చేసింది.
అదే సందర్భంలో తొలి ఏడాది మాత్రమే అమ్మ ఒడి పథకం కింద ఒక కుటుంబంలో ఒక విద్యార్థికి రూ.15 వేలు రూపాయలు ఇచ్చి ఆ తర్వాత సంవత్సరం రూ.14 వేలు, రూపాయలు ఇచ్చింది అటు తరువాత సంవత్సరం ఏకంగా ఒకేసారి రూ.13 వేలు రూపాయలకి తగ్గించింది. ప్రస్తుత అధికారంలో ఉన్నటువంటి కూటమి నేతలు మాత్రం అలా కాదు తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే కచ్చితంగా రూ.15 వేలు రూపాయల చొప్పున ఎంతమంది చదువుకుంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం పథకం వర్తింపజేస్తామని కూటమి ప్రభుత్వ అధినేతలు ఎన్నికల సమయాల్లో ప్రకటించారు. దీంతో ప్రజలు కూటమివైపు మొగ్గారని చెబుతున్నారు. ఎన్నికలు పూర్తయిన ఆరు నెలలైనా సరే ఇప్పటికీ తల్లికి వందనం ఎప్పుడు అమలు చేస్తారనేది ఇంకా కూడా క్లారిటీ లేకపోవడంతో రకరకాల విమర్శలు ఏపీ ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి.
కొత్త పెన్షన్లు అప్లికేషన్ కోసం వెంటనే దీనిని నొక్కండి: Click Here
తల్లికి వందనం పథకంపై ఇన్నాళ్లు గత అధికారంలో ఉన్న వైసీపీ నేతలు విమర్శలు చేస్తే, ఇంకా సమయం ఉందని ప్రస్తుత అధికారంలో ఉన్నటువంటి కూటమి నేతలు చెప్పుకొచ్చారు. ఏపీ రాష్ట్ర గౌరవనీయులైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుగారి ఏకైక కుమారుడు నారా లోకేశ్ గారు ఏపీ ప్రభుత్వ విద్యాశాఖ మంత్రి కావడంతో కచ్చితంగా తల్లికి వందనం పథకం అమలు అవుతుందని ఏపీ ప్రజలుఅంతా ఆశించారు. ఇన్నాళ్లు 2025 నూతన సంవత్సర సంక్రాంతికి వస్తుందని ఏపీ ప్రజలు ఆశించగా, ఏపీ కూటమి ప్రభుత్వంలో ఎలాంటి కదలిక లేకపోవడంతో ఈ నూతన సంవత్సర 2025 సంక్రాంతి పండుగకి తల్లికి వందనం డబ్బులు అందడం డౌటేనంటున్నారు .
తల్లికి వందనం పథకం విడుదల :
2025 ఏప్రిల్ నెల వరకు ఈ విద్యా సంవత్సరం ఉండటంతో ఆ లోగా ఎప్పుడైనా నిధులు విడుదల చేస్తామని ఏపీ కూటమి ప్రభుత్వం చెబుతోంది. ఒక వేళ ఈ నూతన సంవత్సర సందర్భంగా 2025 సంక్రాంతికే ఇవ్వాలంటే వచ్చే నెల 10లోగా విద్యార్థుల డేటా పూర్తిస్థాయిలో సేకరించాల్సివుంది. 2025వ సంవత్సరం జనవరి నెల 10 తేదీ నుంచి సంక్రాంతి సెలవులు ఉండటంతో ఆ లోగా పాఠశాలల నుంచి సమాచారం సేకరించాల్సివుంది. ఈ డిసెంబర్ నెలలో పాఠశాల స్థాయిలో మెగా పేరెంట్ అండ్ టీచర్ మీటింగ్ నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లికి వందనం పై ఎలాంటి సంకేతాలు ఇంకా ఇవ్వలేదు. దీంతో ఈ తల్లికి వందనం పథకం ఎప్పుడు అమలు చేస్తారు? ఈ సందర్బంగా రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి విధి విధానాలు అమలు చేస్తారనే చర్చ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున జరుగుతోంది.
తల్లికి వందనం పథకం అర్హుల లిస్ట్ కోసం దీనిని నొక్కండి: Click Here