Runamafi (రైతు రుణమాఫీ) ప్రక్రియ రేపటి నుంచి మొదలు ప్రకటించిన రేవంత్ రెడ్డి Rythu Runamafi 2024

రైతు రుణమాఫీ (Runamafi) ప్రక్రియ

రుణమాఫీ (Runamafi) పై రైతులకు ఊహించని శుభవార్త వచ్చేనెల అనగా జూలై నెలలో ఈ రుణమాఫీ పై పూర్తి ప్రక్రియ మొదలు పెట్టినట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇందుకు సంబంధించిన విధి విధానాలను ఖరారు చేయాలని అధికారులను ఆదేశించింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రుణమాఫీ చేయాలంటే 31 వేల కోట్లు అవసరమవుతాయని ఇప్పటికే అంచనా వేసిన సంగతి మనందరికీ తెలిసిన విషయమే అయితే ఈ అమౌంట్ ని వివిధ కోణాలలో సర్దుబాటు చేసేందుకు పూర్తి అధికార వర్గం తెలిపింది. ఈ రుణమాఫీ(Runamafi) కి సంబంధించి ఊహించని శుభవార్తని తెలంగాణ రాష్ట్ర మంత్రి పొంగులేటి తెలిపారు. ఆయన నిన్న పాలేరు నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రస్తుతం చాలా మంది అనర్హులు ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్నారని తెలిపారు.

అర్హులు అనర్హులను గుర్తించే ప్రక్రియ

రాష్ట్రంలో అనర్హులను గుర్తించి వారందరికీ రేషన్ కార్డులు, ఆసరా పెన్షన్లు తొలగిస్తామని మంత్రి తెలిపారు ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా ₹2,00,000 రైతు రుణ మాఫీచేస్తామని రుణమాఫీ (Runamafi) ప్రాసెస్ ను వచ్చే నెల నుండిప్రారంభిస్తామని క్లారిటీ తెలిపారు. ₹2,00,000 రుణమాఫీకి తెలంగాణ కేబినెట్ సైతం ఆమోదం తెలిపిందని విషయాన్ని ఆయన ఈ సందర్భంగా మరోసారి గుర్తు చేశారు. గత కేసీఆర్ ప్రభుత్వం పేదలకు గజం స్థలం కూడా ఇవ్వలేదు కానీ మేం మాత్రం అర్హులైన పేదలందరికీ ఇళ్లు నిర్మిస్తామని పొంగులేటి హామీ ఇచ్చారు. పాలేరులో CC రోడ్లు, డ్రైనేజీల నిర్మాణాలు పూర్తి చేస్తామని మంత్రి పొంగులేటి చెప్పుకొచ్చారు.

రైతు రుణమాఫీ నిధుల సమీకరణ

రైతు రుణమాఫీ కోసం తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా కసరత్తులు చేస్తోందని తెలిపారు. రూ.₹2,00,000 లోపు రైతు రుణాలను ఏక కాలంలో మాఫీ చేస్తామని ఎన్నికల ముందు ప్రచారంలో హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఆగస్టు 15 లోగా రుణమాఫీ(Runamafi) చేస్తామని ప్రకటించింది. ఈ రుణమాఫీ కోసం నిధుల సమీకరణకు రేవంత్ రెడ్డి సర్కారు తీవ్ర ప్రయత్నాలుచేస్తోందని ఈ సందర్భంగా తెలిపారు. రుణమాఫీ కోసం రూ.31 వేల కోట్లు అవసరమని అంచనా వేస్తున్న తెలంగాణ ప్రభుత్వం.. రూ.10 వేల కోట్ల మేర రుణాలు సేకరించేందుకు RBI అనుమతి కోరింది. మిగిలిన రూ.21 వేల కోట్ల రూపాయల మొత్తాన్ని వివిధ మార్గాల్లో సర్దుబాటు చేసే ప్రయత్నాలలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం బిజీగా ఉంది.

రైతు రుణమాఫీ విధివిధానాలు:-

  • రైతు కచ్చితంగా తెలంగాణ నివాసి ఉండాలి.
  • ఆధార్ కార్డులో అడ్రస్ పాస్ బుక్ ఉన్నటువంటి ఏరియా ఒకే విధంగా ఉండాలి
  • కుటుంబంలో ఎంత మంది ఉన్నా సరే ఒకరికి మాత్రమే ఈ పథకం వర్తించనుంది
  • పది ఎకరాల లోపు పొలం కలిగిన వారికి మాత్రమే రుణమాఫీ వర్తిస్తుంది
  • వ్యవసాయ భూములకు మాత్రమే రుణమాఫీ వర్తిస్తుంది
  • వ్యవసాయానికి కాకుండా వివిధ రకాలుగా వ్యవసాయ భూమిని వాడితే రుణమాఫీ వర్తించదు
  • రెండు లక్షల కంటే ఎక్కువగా ఎంత రుణం కలిగి ఉన్నా కేవలం రెండు లక్షల మాత్రమే మాఫీ అవుతుంది
  • రుణమాఫీ తీసుకున్న బ్యాంక్ అకౌంట్ కి ఆధార్ కార్డు నెంబర్ ‌‌‌‌‌‌‌NPCI లింక్ కలిగి ఉండాలి
  • మీ యొక్క ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ ని కూడా లింక్ చేసుకోవాలి
  • సొంత భూమి కలిగిన వారికి మాత్రమే రుణమాఫీ వర్తించనుంది
  • కౌలు రైతులు రుణమాఫీకి అనర్హులు
  • భూ యజమానదారుడు చనిపోయి ఉంటే ఈ పథకానికి అధికారుల వద్ద అప్లై చేసుకోవాలి
  • వ్యవసాయం పైన బంగారు రుణం తీసుకున్నవారు రుణమాఫీకి అర్హులు

రుణమాఫి అర్హుల లిస్ట్ కోసం దీనిని క్లిక్ చేయండి:- Click here

రుణమాఫీ, రైతు భరోసాల అర్హుల లిస్టులు కోసం దీనిపై క్లిక్ చేయండి :- Click here

రైతు భరోసా కూడ విడుదల

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఈ యొక్క రుణమాఫీ తో పాటు రైతు భరోసా పథకంలో భాగంగా సంవత్సరానికి 15 వేల రూపాయలను మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క రైతు ఖాతాలోకి రెండు విడతలలో విడుదల చేస్తుంది. అయితే ఈ పథకం కింద ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త గైడ్లైన్స్ త్వరలో విడుదల చేయనుంది. ప్రస్తుత సమాచార ప్రకారం పది ఎకరాల లోపు పొలం కలిగిన వారికి మాత్రమే ఈ రుణమాఫీ అందరూ ఉన్నట్లు సమాచారం. అలాగే రైతు బంధు పథకం కూడా ఇదే నియమావళిని అనుసరించి తొలి విడత వచ్చే నెల మొదటి వారంలో విడుదల చేయనున్నట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికి స్పష్టం చేసింది.

రెండు విడతలక ఈ యొక్క రైతుబంధు డబ్బులను కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయనుంది ఒక్క విడతలో 7500 చొప్పున రెండు విడుదల కలిపి 15000 నేరుగా రైతుల ఖాతాలోకి విడుదల చేయనుంది. అయితే ఈ యొక్క రైతుబంధు పథకానికి పేరును మార్చి రైతు భరోసా పథకంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. ఈ ఒక రైతు భరోసా పథకంలో భాగంగా ఎవరైతే వ్యవసాయం చేస్తారు వారికి మాత్రమే ఈ డబ్బులు పడనున్నాయి. వ్యవసాయ భూమిని మరి ఇతర పనులు కోసం వాడిన అనగా రియల్ ఎస్టేట్లో, ఇల్లు కట్టుకోవడానికి వాడితే ఈ పథకం వర్తించదు.

ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కథ ప్రభుత్వం ఉంచిన రైతు బంధు మార్గదర్శకాలకు అనుగుణంగా గతంలో ప్రభుత్వం ఏర్పాటు అయిన వెంటనే 5000 చొప్పున రైతులు ఖాతాలోకి విడుదల చేసింది. కానీ ఇప్పుడు పూర్తి మార్గదర్శకాలను మరో రెండు రోజుల్లో విడుదల చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఎవరు అర్హులు ఎవరు అనర్హులు గుర్తించనుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రైతుబంధు పథకానికి కూడా కౌలు రైతుల అనర్హులు. సొంత భూమి సాగు చేసుకునే వారికి మాత్రమే రైతుబంధు డబ్బులను విడుదల చేస్తామని తెలిపింది. తెలంగాణ రైతు భరోసాగా పథకానికి పేరు మార్చడమే కాకుండా ఈ పథకం కింద అర్హులైన రైతులకు 15 వేల రూపాయలు చొప్పున ఇచ్చేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ నిధుల సమీకరణకు వివిధ మార్గాలను అన్వేషిస్తుంది.

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ ఈ రెండు పథకాల ద్వారా రేవంత్ రెడ్డి ప్రభుత్వం జూలై మాసంలో శుభవార్తలను ప్రకటించనుంది.

Verified by MonsterInsights