YSR రైతు భరోసా – PM కిసాన్ డబ్బులను ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నవంబర్ 7వ తేదీన దీపావళి కానుకగా రైతుల ఖాతాలోకి విడుదల చేసింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అర్హత కలిగిన రైతులందరికీ సిఎం జగన్ మోహన్ రెడ్డి నేరుగా ఖాతాలో జమ చేస్తున్నారు.
ఈ YSR రైతు భరోసా – PM కిసాన్ పథకం లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 53.53 లక్షల మంది రైతులకు గాను ₹4,000 చొప్పున విడుదల చేశారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాలలోకి నిధులు జమవుతున్నాయి. మీ ఖాతాలోకి డబ్బులు వచ్చేయా లేదో తెలుసుకోవాలంటే ఈ క్రింది ఉన్న లింకు ద్వారా మీయొక్క స్టేటస్ ని చెక్ చేసుకోండి.
YSR రైతు భరోసా పేమెంట్ స్టేటస్ కోసం దీనిని క్లిక్ చేయండి:- Click here
YSR రైతు భరోసా:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు గాను సీఎం జగన్ రెడ్డి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రైతుల కొరకే ప్రత్యేకంగా తీసుకువచ్చి అమలు చేస్తున్న పథకమే ఈ YSR భరోసా. ఈ యొక్క పథకం కింద అర్హత కలిగిన ప్రతి రైతుకి సంవత్సరానికి ₹13,500 ఆంధ్రప్రదేశ్ మరియు కేంద్ర ప్రభుత్వాలు కలిపి నేరుగా రైతుల ఖాతాలోకి విడతల వారీగా జమ చేస్తాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వాటా ₹7,500 మిగిలిన 6000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం వాటా.
ఈ YSR రైతు భరోసా – PM కిసాన్ పథకంలో భాగంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వాటా అయినటువంటి ₹7,500 రెండు విడతలుగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అర్హులైనటువంటి రైతుల ఖాతాలోకి విడుదల చేస్తుంది. ప్రతి ఏటా సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం మొదటి విడత కింద ₹5,500 రైతుల ఖాతాలోకి మే జూన్ మాసాలలో వేస్తుంది. ఇక మిగిలినటువంటి రెండో విడత కింద ₹2,000 నవంబర్, డిసెంబర్ మాసాలలో వేస్తుంది. ఈ విధంగా ఏపీ సీఎం జగన్ రెండో విడతల్లో కలిపి 7500 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సొంత భూమి కలిగిన భూ యజమానులకు మరియు అటవీ భూమి, దేవాదాయ శాఖకు సంబంధించిన భూమి సాగు చేసుకునే రైతులకు ఈ రైతు భరోసా పథకం కింద నిధులను విడుదల చేస్తుంది.
అంతే కాకుండా ఎవరైనా కవులు రైతులు ఉంటే వాళ్లకి CCR సర్టిఫికెట్లను జారీ చేసి వారికి కూడా 7500 రూపాయలను జమ చేస్తుంది. అందువలన కౌలు రైతులు కూడా వారికి ఇచ్చేటువంటి రైతు భరోసా నగదుతో ఎంతో కొంత ఉంటుందని హర్షం వ్యక్తం చేస్తున్నారు.
PM కిసాన్:
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చి అమలు చేస్తున్న పథకమే ఈ పీఎం కిసాన్ సమ్మన్ నిధి యోజన. ఈ పథకం కింద ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క రైతుకు 6000 రూపాయలను సంవత్సరానికి మూడు విడతల రూపంలో నేరుగా రైతుల ఖాతాలలోకి వేయడం జరుగుతుంది. తొలి విడత కింద ₹2,000 రెండవ విడత కింద ₹2000 మూడో విడత కింద 2000 రూపాయలు విడుదల చేస్తుంది.
YSR రైతు భరోసా – PM కిసాన్ డబ్బులు మీకు పడ్డాయో లేదో తెలుసుకోవడానికి దీనిని క్లిక్ చేయండి: Click here
• ఈ యొక్క PM కిసాన్ యోజన పథకంలో భాగంగా ఎవరైతే సొంత భూమి కలిగిన రైతులు ఉంటారో వారికి మాత్రమే ఈ 6000 రూపాయలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది.
• అటవీ భూమి సాగు చేసేవారు, దేవాదాయ శాఖ భూములను సాగు చేసేవారు మరియు కౌలు రైతులు కూడా ఈ పథకానికి సంబంధించి అనర్హులు.
• ప్రధానమంత్రి కిసాన్ సమ్మన్ నిధి యోజన పథకంలో భాగంగా అనేకుల అనర్హులను ఏరు వేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ కేవైసీ ని ప్రవేశపెట్టింది.
ఈ ఈ కేవైసీ ఎవరైతే పూర్తి చేసుకోరో అటువంటి వారందరినీ మన యొక్క కేంద్ర ప్రభుత్వం అనర్హులుగా గుర్తించి వారికి పథకాన్ని రద్దు చేస్తుంది. పథకానికి సంబంధించిన డబ్బులను కూడా వేయకుండా ఆపివేస్తుంది.
కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే అర్హత కలిగిన రైతులకు 15 విడతల డబ్బులను విడుదల చేసింది. అంటే ఒక్క విడతలు 2000 రూపాయల చొప్పున విడుదల చేస్తుంది కాబట్టి 15 విడతలకు మొత్తంగా కలిపి ఒక రైతు ఖాతాలకి 30 వేల రూపాయలను విడుదల చేసింది అన్నమాట.
రైతులకు మరొక శుభవార్త ఏంటంటే ప్రస్తుతం ఈ పీఎం కిసాన్ పథకంలో భాగంగా ఇస్తున్నటువంటి 6000 రూపాయలను ఎనిమిది వేలకు పెంచాలని కొంతమంది నిపుణులు కేంద్రానికి సూచిస్తున్నారు. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ఈ సూచనల మేరకు ప్రస్తుతం ఇస్తున్నటువంటి 6000 రూపాయలను పెంచి ఎనిమిది వేల రూపాయలు కనుక చేసినట్లయితే ఇకనుంచి ఒక్క రైతుకి నాలుగు విడతల్లో విడతకి ₹2000 చొప్పున అర్హత కలిగిన ప్రతి రైతు ఖాతాలోకి కేంద్ర ప్రభుత్వం చేస్తుంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ YSR రైతు భరోసా – PM కిసాన్ పథకంలో భాగంగా ప్రతి ఏడాది కూడా కొత్త రైతులను ఈ పథకం లోకి చేరుస్తుంది. ప్రస్తుతం ఈ పథకం ద్వారా ఇస్తున్నటువంటి ఈ నగదు ని రైతులు తమ పెట్టుబడికి వినియోగించుకుంటారనే మంచి ఉద్దేశంతో వారికి చేయూతనివ్వాలని ఆశతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు తన ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించి, ప్రకటించిన దానిని విడవకుండా ప్రతి ఏడాది కూడా అమలు చేస్తూ వస్తున్నారు.
ఈ పథకం కింద తాజాగా విడుదల చేసిన నిధులు కేంద్రా మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల ఖాతాలోకి ప్రస్తుతం జమ చేస్తూ ఉన్నాయి. YSR రైతు భరోసా – PM కిసాన్ అర్హులైనటువంటి రైతులందరికీ కూడా 2024 జనవరిలో మరో ₹2,000 రూపాయలను సంక్రాంతి కానుకగా జమ చేస్తుంది. అంటే కేంద్ర ప్రభుత్వం రైతులకు ప్రస్తుతం ఇస్తున్నటువంటి ఆరువేల రూపాయలలో 2023వ సంవత్సరానికి సంబంధించిన ఆ డబ్బులను రెండు విడుదల మాత్రమే వేసింది. ఇక మూడో విడత కింద అనగా 16వ విడత కింద 2024 జనవరిలో సంక్రాంతికి ముందుగా రైతులకు జమ చేస్తుంది.
రైతు భరోసా పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోండి:- Click here
PM కిసాన్ పేమెంట్ స్టేటస్ కోసం దీన్ని క్లిక్ చేయండి: Click here