ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలలో కూడా అనేక రకాల సంక్షేమ పథకాలను అమలు చేస్తూ వస్తుంది. అందులో భాగంగానే 2023 అక్టోబర్ నెలలో (AP October Schemes 2023) అమలయ్యే పథకాల లిస్ట్ను విడుదల చేసింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నవరత్నాలలో భాగంగా పేద ప్రజలకు సంక్షేమ పథకాలను అమలు చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించారు. దాని ప్రకారం ఆయన సీఎం అయిన తర్వాత ప్రతి నెలలో కూడా అనేక రకాల సంక్షేమ పథకాలను అమలు చేస్తూ వస్తున్నారు. ఇందులో భాగంగా ఈ అక్టోబర్ నెలలో అమలు చేసే 5 భారీ పథకాలు ఏంటో తెలుసుకుందాం.
ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ అక్టోబర్ నెలలో అమలయ్యే మొట్టమొదటి పథకం.
1.AP జగనన్న చేదోడు
AP రాష్ట్ర వ్యాప్తంగా సొంత షాప్ కలిగి ఉన్న టైలర్లు, రజకులు, నాయి బ్రాహ్మణులకు సంవత్సరానికి పదివేల రూపాయలు చొప్పున ఆర్థిక సాయం అందిస్తూ వస్తుంది మన జగన్ సర్కార్.
టైలర్లు అనగా సొంత షాప్ కలిగిన దర్జీలు 1,25,926 మంది గాను గత ఏడాది మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం పదివేల రూపాయలు చొప్పున నేరుగా వారికి ఖాతాలోకి విడుదల చేసింది ఈ ఏడాది అక్టోబర్ నెలలోనే విడుదల చేయనున్నారు.
రజకులు అనగా సొంత షాప్ పెట్టుకుని ఇస్త్రీ పనులు చేసుకునేవారు గత ఏడాది 82,347 మందికి గాను గత ఏడాది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పదివేల రూపాయలు చొప్పున నిధులను విడుదల చేసింది ఇక ఈ సంవత్సరానికి సంబంధించిన నిధులను అక్టోబర్ నెలలోనే విడుదల చేయనున్నారు.
నాయి బ్రాహ్మణులు అనగా సొంతంగా షాపులు పెట్టుకుని కటింగ్ హెయిర్ సొల్యూన్స్ పెట్టుకునే వారికి 38,767 మందికి గాను గత ఏడాది మన యొక్క AP రాష్ట్ర ప్రభుత్వం పదివేల రూపాయలు చొప్పున విడుదల చేసింది మొత్తంగా ఈ జగనన్న చేదోడు పథకం కింద అర్హత కలిగిన ₹2,47,040 మంది కుటుంబాలకు లబ్ధి చేకూర్చింది.
ఈ 2023వ సంవత్సరానికి సంబంధించి జగనన్న చేదోడు పథకం కింద కొత్తగా అప్లై చేసుకోవాలి అన్న అలాగే పాత వారికి కూడా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం వాలంటీర్ల ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తుంది.
ఈ పథకానికి సంబంధించి మీరు అర్హులో కాదో తెలుసుకోవాలంటే కింద ఉన్న లింక్స్ ద్వారా చెక్ చేసుకోండి:
Click Here
2. వైయస్సార్ చేయూత
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపు వయసున్న మహిళలకు AP రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తూ వస్తున్న పథకాలలో ఈ “వైయస్సార్ చేయూత” పథకం చాలా ప్రాముఖ్యమైనది.
ఈ వైయస్సార్ చేయూత పథకం లో భాగంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన మహిళలకు సంవత్సరానికి ₹18,750 మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం నేరుగా వారి ఖాతాలోకే జమ చేస్తుంది.
వైయస్సార్ చేయూత పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమనగా మహిళలు సామాజిక బడుగు బలహీన వర్గాల నుంచి స్వయం ఉపాధి దిశగా అడుగులు వేయడానికి సహాయం గా అందించేదే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ వైఎస్ఆర్ చేయూత పథకంలో భాగంగా మన యొక్క AP రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి ₹18,750 బదులుగా గొర్రెలను, గేదెలను వైయస్సార్ జీవ క్రాంతి పథకం కింద ఎంచుకునే అవకాశం కల్పించింది. ఈ వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించిన 2023 వ సంవత్సరంలో డబ్బులు విడుదలను ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ అక్టోబర్ నెలలోనే విడుదల చేయాలని నిర్ణయించింది. గత ఏడాది మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ వైఎస్ఆర్ చేయూత పథకం కింద 23 లక్షల మందికి పైగా లబ్ధి చేకూర్చింది.
ఈ వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించిన అర్హుల లిస్టులు చెక్ చేసుకోవాలంటే ఈ క్రింద ఉన్న లింక్ ని క్లిక్ చేయండి:
Click here
3. వైయస్సార్ రైతు భరోసా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ వైయస్సార్ రైతు భరోసా పథకం కింద సంవత్సరానికి ₹13,500 మన యొక్క AP రాష్ట్ర ప్రభుత్వం విడతల వారీగా అందిస్తూ వస్తుంది. ఈ వైఎస్ఆర్ చేయూత పథకంలో భాగంగా ప్రతి రైతుకి పెట్టుబడి సాయం అందించి ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు కోసం ప్రత్యేకంగా తీసుకు వచ్చిన పథకం.
ఈ వైయస్సార్ రైతు భరోసా పథకంలో భాగంగా AP రాష్ట్ర ప్రభుత్వం ₹7,500 రెండు విడతల్లో ఇస్తుంది. మిగిలిన 6000 రూపాయలను కేంద్ర ప్రభుత్వం మూడు విడతలుగా రైతుల ఖాతాలోకి పిఎం కిసాన్ సంబంధించిన విడుదల చేస్తుంది. ఈ వైఎస్ఆర్ చేయూత పథకంలో భాగంగా మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సొంత భూమి కలిగిన వారికి అలాగే కౌలు రైతులకు కూడా ₹7,500 పెట్టుబడి సాయంగా అందిస్తుంది
అయితే కేంద్ర ప్రభుత్వం వాటా అయిన ₹6,000 రూపాయలను మాత్రం సొంత భూమి కలిగిన వారికి మాత్రమే అందిస్తుంది. భూమిలేని కౌలు రైతులకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ₹6,000 రూపాయలు జమ కావు. ఈ వైయస్సార్ రైతు భరోసా పథకానికి సంబంధించిన అర్హత కలిగిన రైతులు ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాలలో ఈ క్రాప్ ను నమోదు చేసుకోవాలి. ఈ యొక్క ఈక్రాప్ నమోదు వల్ల అనేక లాభాలు ఉన్నాయి వాటిలో విత్తనాలు కొనుగోలు ఎరువుల సబ్సిడీ పంట నష్టపరిహారం ఈ విధంగా రైతులకు మొదలైన ఉపయోగాలు ఉంటాయి. కాబట్టి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ క్రాప్ ని కచ్చితంగా నమోదు చేసుకోవాలని సూచిస్తుంది.
ఈ వైఎస్ఆర్ రైతు భరోసా పథకంలో భాగంగా 2023వ సంవత్సరంలో మొదటి విడత కింద మన యొక్క AP రాష్ట్ర ప్రభుత్వం ₹5,500 విడుదల చేసింది ఇక రెండో విడతగా మా యొక్క రాష్ట్ర సర్కార్ అక్టోబర్ నెలలోనే ₹2000 రూపాయలను విడుదల చేయనుంది.
ఈ వైయస్సార్ చేయూత పథకానికి సంబంధించిన అర్హుల జాబితా కోసం వెంటనే కింద ఉన్న లింక్ ని క్లిక్ చేయండి :
Click here
PAYMENT STATUS CHECK
4. జగనన్న విద్యా దీవెన
జగనన్న విద్యా దీవెన పథకంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అర్హత కలిగిన ప్రతి ఒక్క విద్యార్థి తల్లి ఖాతాలోకి కాలేజీ ఫీజులు అనగా పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ ని మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం నేరుగా ఖాతాలోకి విడుదల చేస్తుంది.
ఈ జగనన్న విద్యా దీవెన పథకం కింద అర్హత కలిగిన ప్రతి ఒక్క విద్యార్థికి వాళ్లు చదివే కాలేజీలో ఉన్న ఫీజులను ఆధారంగా మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ నాలుగు విడతలలో అందిస్తుంది.
జగనన్న విద్యా దీవెన పథకానికి సంబంధించిన అర్హుల లిస్టు చెక్ చేసుకోవాలనుకుంటే ఈ క్రింద ఉన్న లింక్ ని క్లిక్ చేయండి:
Sir ma papa BTech 3rd year chaduvutondi. Ma papaku 3year 4quarter fee jvd amount padaledu sir … nenu Anganwadi karyakarthanu andari karyakarthala pillalaku paddayi sir