రేషన్ కార్డులు రేషన్ సరఫరాలో అక్రమాలకు అడ్డుకట్ట వేయాలనే ఉద్దేశంతో చేపట్టిన ఈ కేవైసీ ప్రక్రియ గడువును ప్రభుత్వం మరోసారి పొడిగించింది. సెప్టెంబరు నెల చివరి వారంలోనే ఈకైవేసి కార్యక్రమం ముగిసినప్పటికీ చాలా మంది రేషన్ కార్డ్ లబ్ధిదారులు ఈ కైవేసీ కి దూరంగా ఉన్నారు. దీంతో రేషన్ సరుకుల పంపిణీలో భారీ అక్రమాలు జరుగుతున్నట్లు ప్రభుత్వ అధికారులు భావిస్తున్నారు. ఇలా రేషన్ సరుకుల పంపిణీ విషయాల్లో జరిగే అక్రమాలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వ ఉన్నతాధికారులు రేషన్ కార్డ్ లబ్ధిదారుల కొరకు కేవైసీకి మరో చాన్స్ ఇచ్చారు. ఈసారి ఈ కేవైసీ ప్రక్రియను పూర్తిచేసుకోకపోతే రేషన్ కార్డులో పేరును తొలగించేందుకు ప్రభుత్వ ఉన్నత అధికారులు సిద్ధమవుతున్నారు. రేషన్ కార్డుల ఈ కేవైసీకి లబ్ధిదారుల అనాసక్తి
రేషన్ పంపిణీలో భారీగా అక్రమాలు!
రంగారెడ్డి జిల్లాలో 69 శాతం ఉన్నటువంటి రేషన్ కార్డులు కే ఈ కేవైసీ తుదిగడువును మరోమారు పొడిగించిన ప్రభుత్వం ఇదే చివరి అవకాశమని హెచ్చరిక రేషన్ సరఫరాలో అక్రమాలకు అడ్డుకట్ట వేయాలనే ఉద్దేశంతో చేపట్టిన ఈ కేవైసీ ప్రక్రియ గడువును ప్రభుత్వం మరోసారి పొడిగించింది. సెప్టెంబరు నెల చివరి వారంతో ఈ కార్యక్రమం ముగిసినప్పటికీ చాలామంది ఈ కైవేసీ కి దూరంగా ఉన్నారు. దీంతో రేషన్ సరుకుల పంపిణీలో భారీ అక్రమాలు జరుగుతున్నట్లు అధికారులు భావిస్తున్నారు. ఇలా జరుగుతున్నటువంటి అక్రమాలకు చెక్ పెట్టేందుకు కేవైసీకి మరో చాన్స్ ఇచ్చారు ఉన్నతాధికారులు. ఈసారి రేషన్ కార్డుకు సంబంధించినటువంటి లబ్ధిదారులు ఈ కేవైసీ ప్రక్రియను గనుక పూర్తి చేసుకోకున్నట్లయితే రేషన్ కార్డులో పేరును తొలగించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.
రేషన్ బియ్యం పంపిణీ
రేషన్ బియ్యం పంపిణీ విషయాల్లో జరిగే ఏటువంటి అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు కొంత మేర ఫలించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రేషన్ కార్డుదారులకు ఈ కేవైసీ (ఎలకా్ట్రనిక్ నో యువర్ కస్టమర్) తప్పనిసరి చేయడంతో కొందరి బండారం బయటపడుతోంది. రేషన్ కార్డులో పేరున్న ప్రతీ కుటుంబ సభ్యునికి ఈ కేవైసీ తప్పనిసరి చేసింది. కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ఈకేవైసీ చేయించుకోకపోతే వారి పేరును కార్డులో నుంచి తొలగించి మిగతా వారికి రేషన్ ఇస్తారు. అయితే ప్రభుత్వం ఇచ్చిన గడువు పూర్తయినప్పటికీ ఉమ్మడి జిల్లాలో దాదాపు 25 శాతానికి పైగా రేషన్ కార్డుదారులు ఇంకా ఈ కేవైసీ చేయించుకోలేదు. గడువు ముగిసినా కూడా భారీ సంఖ్యలో కొందరు కేవైసీ చేయించుకోకపోవడం చూస్తే రేషన్ పంపిణీలో భారీగా అక్రమాలు జరుగుతున్నట్లు అధికారులు భావిస్తున్నారు. అయితే భారీ సంఖ్యలో కేవైసీ చేసుకోని వారు ఉండడంతో ప్రభుత్వం మరో మారు ఈ ప్రక్రియ గడువు పొడిగించింది. ఇదే చివరి చాన్స్ అంటూ హెచ్చరించింది. ఇదిలా ఉంటే పేదలకు అందాల్సిన రేషన్ బియ్యం భారీగా పక్కదారి పడుతున్నట్లు కొన్నేళ్లుగా ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే.
కొత్త రేషన్ కార్డు కోసం అప్లై చేసుకోండి: Click Here
నిత్యం ఏదో ఒక ప్రాంతంలో రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తూ పట్టుబడిన సంఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. అధికారులు చేస్తున్న నామ మాత్రపు తనిఖీల్లో కూడా క్వింటాళ్ల కొద్దీ రేషన్ బియ్యం పట్టుబడుతున్నాయి. దీంతో రేషన్ సరఫరాలో అక్రమాలతో పాటు అక్రమ రవాణాను అరికట్టి రేషన్ సరుకులు తీసుకోవడానికి తగినటువంటి అర్హులకే బియ్యం అందేలా చూసేందుకు గత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే అప్పట్లోనే ఎన్నికలు రావడంతో అప్పటి కెసిఆర్ ప్రభుత్వం దీన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కేవైసీ ప్రక్రియను పూర్తి చేసేందుకు సెప్టెంబర్ నెలాఖరు నాటికి గడువు విధించింది. కానీ లక్షల సంఖ్యలో కార్డుదారులు ఇంకా ఈ కేవైసీ చేయించుకోలేదు.
రేషన్ కార్డులు ఈకేవైసీ
ఇందులో కొందరు నిర్లక్ష్యంతో ఈ ప్రక్రియకు దూరంగా ఉన్నప్పటికీ ఎక్కువ మంది ఇతర కారణాలతో ఈ కేవైసీ చేయలేదు. కొందరికీ ఆధార్ కార్డ్ నవీకరణ, వేలిముద్రలు వంటి సాంకేతిక మైనటువంటి సమస్యలు ఎదురవుతున్నాయి. అలాగే పదేళ్లలో అనేక మంది చనిపోయారు. వివాహాలు చేసుకొని కొందరు యువతులు అత్తారింటికి వెళ్లిపోయారు. మరికొందరు కొత్తగా కాపురాలు పెట్టారు. వీరికి రేషన్ కార్డులు మంజూరు కాలేదు. ఇలాంటి వారి పేర్లు తల్లి దండ్రులతో పాటు రేషన్ కార్డుల్లో కొనసాగుతున్నాయి. అయితే ఆధార్ అనుసంధాన సమయంలో చిరునామాలు తేడా రావడంతో ఈ ప్రక్రియ లో సమస్యలు ఎదురవుతున్నాయి. ఇక చనిపోయిన వారు, నకిలీ పేర్లు కూడా భారీగానే ఉన్నట్లు సమాచారం. క్షేత్రస్థాయిలో పలు సమస్యలు ఉన్నప్పటికీ కొత్త కార్డులు లేకున్నా గతంలో కొందరికి ఇచ్చిన ఆహార భద్రత కార్డులు ఆధారంగా రేషన్ బియ్యం పంపిణీ సాగుతోంది.
ఇదిలా ఉంటే రేషన్ కార్డులు లబ్ధిదారుల పేరుతో కొందరు రేషన్ దుకాణాల డీలర్లు రేషన్ సరుకుల నిల్వలను పక్కదారి పట్టిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ కేవైసీ తో ఇప్పుడు వీటన్నింటికీ చెక్ పడనుంది. సెప్టెంబరు నెలాఖరు తో ఈ కేవైసీకి గడువు ముగిసినా.. ఇంకా పెద్ద సంఖ్య లో కార్డుదారులు ఈ ప్రక్రియ చేయించుకోక పోవడంతో ప్రభుత్వం డిసెంబరు 31 వరకు గడువు పొడిగించింది. అయితే మరోమారు పొడిగింపు ఉండదని, ఇదే చివరి చాన్స్ అని పేర్కొంది. ఈ విషయంలో నిర్లక్ష్యంగా ఉండే రేషన్ కార్డులు లబ్ధిదారులు భవిష్యత్తులో రేషన్ పొందలేరని స్పష్టం చేసింది ఉన్నతాధికారుల వ్యవస్థ. అలాగే ప్రభుత్వ పథకాలు పొందే విషయంలో తీవ్ర ఇబ్బంది పడాల్సి ఉంటుందని హెచ్చరించింది.
కొత్త రేషన్ కార్డులు మంజూరు
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డుదారులందరికీ ఇప్పుడిప్పుడే మరో ఊహించని అప్డేట్ ని ప్రకటించింది రేవంత్ రెడ్డి గారి సర్కార్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రేషన్ కార్డులు లబ్ధిదారులకు ఈకేవైసీ చేయని కార్డులన్ని కూడా రద్దుచేసి వాటి స్థానంలో అక్టోబర్ మొదటి వారం నుంచి కొత్త రేషన్ కార్డులను ఇవ్వడం కోసం దరఖాస్తులను స్వీకరించాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖను సీఎం రేవంత్ రెడ్డి గారు ఆదేశించారు
మీ రేషన్ కార్డు active గా ఉందొ లేక రద్దయిపోయిందో స్టేటస్ చెక్ చేసుకోండి: Click Here
మూడు జిల్లాల్లో ఇలా రంగారెడ్డి జిల్లాలో 931 రేషన్ షాపులు ఉన్నాయి. మొత్తం పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని 5.58లక్షల రేషన్ కార్డుదారులకు ఈ రేషన్ షాపుల ద్వారా బియ్యం సరఫరా చేస్తున్నారు. అయితే ఇందులో 69 శాతం కార్డుదారులు మాత్రమే ఈ కేవైసీ చేయించుకున్నారు. అలాగే వికారాబాద్ జిల్లాలో 72.9శాతం మంది, మేడ్చల్ జిల్లాలో 80శాతం మంది ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకున్నారు.