పీఎం కిసాన్ 2023; కేంద్రం నుండి రైతులకు మరో గుడ్ న్యూస్ ₹6000 ఈ తేదీ జమ

కేంద్ర ప్రభుత్వం అనేక రకాల సంక్షేమ పథకాలను తీసుకువచ్చింది. అందులో రైతుల కోసం తీసుకువచ్చిన పథకాలలో పీఎం కిసాన్ సంబంధించిన చాలా ప్రాముఖ్యమైనది. ఈ పథకం ద్వారా అర్హత కలిగిన ప్రతి రైతుకి సంవత్సరానికి ₹6000 చొప్పున నేరుగా రైతుల ఖాతాలలోకి జమ చేస్తుంది.

ఈ ₹6000 రూపాయలను ఒకేసారి కాకుండా మూడు వాయిదాల రూపంలో ఒక వాయిదాకు ₹2000 రూపాయలు చొప్పున నేరుగా అర్హత కలిగిన రైతుల ఖాతాలోకే విడుదల చేస్తుంది.

మొదటి వాయిదా జనవరి నెల నుంచి ఏప్రిల్ లోపు, రెండో విడత మే నుంచి ఆగస్టు లోపు, ఇక మూడో విడత సెప్టెంబర్ నుంచి డిసెంబర్ లోపు ఈ విధంగా మూడు వాయిదాలలో కేంద్ర ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయంగా ₹6000 రూపాయలను అందజేస్తుంది.

ఈ పీఎం కిసాన్ పథకం కింద ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం 13 విడతల డబ్బులను విడుదల చేసింది. అంటే 26 వేల రూపాయలు ఇక తాజాగా 14 విడతకు సంబంధించి ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. అందులో భాగంగానే ఈ పీఎం కిసాన్ పథకానికి సంబంధించి అనర్హులను ఇయరి వేసేందుకు కేంద్ర ప్రభుత్వం వెరిఫికేషన్ చేస్తుంది.

ఈ వెరిఫికేషన్ లో భాగంగా కేంద్ర ప్రభుత్వం కొన్ని రూల్స్ ను ప్రవేశపెట్టింది ఈ రూల్స్ లో భాగంగా ఈసారి 14 విడత పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఎక్కువ సంఖ్యలో రైతులు అనర్హులుగా తొలగించబడుతున్నారు.

PM Kisan 2023
PM Kisan

పీఎం కిసాన్ కొత్త రూల్స్:

  • భారతదేశానికి సంబంధించిన నివాసి అయి ఉండాలి.
  • ఆధార్ కార్డు కచ్చితంగా కలిగి ఉండాలి.
  • సొంత భూమి కలిగి ఉండాలి.
  • కౌలు రైతులు ఈ పథకానికి అనర్హులు.
  • ఇన్కమ్ టాక్స్ కట్టేవారు ప్రభుత్వ ఉద్యోగులు ఈ పథకానికి అనర్హులు. పారిశుద్ధ కార్మికులకు వెసులుబాటు కల్పించారు.
  • రేషన్ కార్డు కలిగి ఉండాలి.
  • బ్యాంక్ అకౌంట్ కు ఆధార్ కార్డుతో లింక్ అంటే NPCI మ్యాపింగ్ కలిగి ఉండాలి.
  • ఈ పీఎం కిసాన్ పథకానికి ఆధార్ కార్డుతో అనుసంధానం చేసుకోవాలి. దీనినే eKYC అంటారు.

ఈ యొక్క రూల్స్ ను బట్టి కేంద్ర ప్రభుత్వం అర్హులను అనర్హులను గుర్తిస్తుంది అర్హులకు మాత్రమే ఈ పథకానికి సంబంధించిన నిధులు కేంద్ర ప్రభుత్వం DBT పద్ధతిలో డబ్బులను వేయడం జరుగుతుంది. ఈ DBT ద్వారా డబ్బులు రైతుల ఖాతాలోకే నేరుగా పడాలంటే ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్ కి ఆధార్ కార్డు నెంబర్ తో NPCI మ్యాపింగ్ చేసుకోవాలి.

NPCI మ్యాపింగ్ చేసుకునే విధానం:

మీరు మీ యొక్క బ్యాంకుకు బ్రాంచ్ కి వెళ్లి మీ యొక్క ఆధార్ కార్డు నెంబర్ తో మీ బ్యాంకు అకౌంట్ కు NPCI మ్యాపింగ్ చేసుకోవాలని సంబంధిత అధికారులతో మాట్లాడినట్లయితే, వాళ్లు మీ దగ్గర మీ యొక్క బ్యాంకు అకౌంట్ పాసుబుక్కు, ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకొని మీకు NPCI మ్యాపింగ్ చేస్తారు.

NPCI మ్యాపింగ్ అయిందో లేదో చెక్ చేసుకునేందుకు దీన్ని క్లిక్ చేయండి. Click here

ఈ NPCI మ్యాపింగ్ ప్రక్రియ పూర్తవడానికి 48 గంటల లోపు టైం పడుతుంది. ఆ తర్వాత విజయవంతంగా NPCI మ్యాపింగ్ అయిపోతుంది. ఇది పూర్తయితేనే ప్రభుత్వం నుంచి డబ్బులు విడుదల చేసినప్పుడు నేరుగా లబ్ధిదారుల ఖాతాలో నిధులు జామవుతాయి.

pm kisan రైతులకు పీఎం కిసాన్
pm kisan రైతులకు పీఎం కిసాన్

eKYC చేసుకునే విధానం:

ఈ యొక్క eKYC ఈ పీఎం కిసాన్ పథకానికి రెండు విధాలుగా చేసుకోవచ్చు. ఒకటి మీ యొక్క మొబైల్ తో చేసుకోవచ్చు. దీనిని Online ప్రాసెస్ అంటారు. రెండవదిగా Offline ప్రాసెస్.

Offline ప్రాసెస్ చేసే విధానం: ఈ యొక్క Offline ప్రాసెస్ లో మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి CSC సెంటర్ లేదా మీసేవ కేంద్రంలో గాని చేసుకోవాలి. మీ ఆధార్ కార్డు తీసుకొని వెళితే వాళ్లు మీ యొక్క వేలిముద్ర వేసి లేదా ఐరిస్ ద్వారా గాని eKYC పూర్తి చేస్తారు.

Online ప్రాసెస్ చేసే విధానం: ఈ విధానంలో మనం మన చేతిలో ఉన్న మొబైల్ తో కానీ లేదా కంప్యూటర్ ల గాని సులభంగా చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలో చూద్దాం.

  • మొదటగా మీరు మొబైల్ లో గాని లేదా కంప్యూటర్ ల గాని వెబ్ బ్రౌజర్ ని ఓపెన్ చేయండి.
  • తర్వాత https://pmkisan.gov.in సైట్లోకి వెళ్లాలి.
  • అందులో మనకు కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి. వాటిలో eKYC అని ఆప్షన్ ఉంటుంది దానిని క్లిక్ చేయాలి.
  • తర్వాత మీకు ఒక కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అందులో మీయొక్క పీఎం కిసాన్ బెనిఫిషరీ ఐడి ఎంటర్ చేయాలి.
  • తర్వాత మీయొక్క ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేయాలి. పక్కనే ఉన్న Get OTP పైన క్లిక్ చేయండి.
  • తర్వాత మీ యొక్క ఆధార్ కార్డు నెంబర్ కు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్ కు ఒక OTP వస్తుంది.
  • దానిని ఎంటర్ చేసి verify పై క్లిక్ చేస్తే అది వెరిఫై అవుతుంది.
  • తర్వాత పేజీలో eKYC “Successful” అని చూపిస్తుంది.

eKYC అయిందో లేదో తెలుసుకునేందుకు దీనిపై క్లిక్ చేయండి. Click here

పైన తెలిపిన రెండు విధానాలను మీరు ఏ విధంగా అయినా సరే eKYC కచ్చితంగా పూర్తి చేసుకోవాలి. eKYC పూర్తికాని వారికి 14వ విడత నిధులు జమ కావని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పలుమార్లు రైతులకు సూచించింది.

కేంద్ర ప్రభుత్వం అసలైన అర్హులకు మాత్రమే ఈ పథకం చెందాలని ఉద్దేశంతో ఈ eKYC ప్రవేశపెట్టింది. పైన తెలిపిన అర్హత ప్రమాణాలను బట్టి అర్హత సాధిస్తారు వారికి మాత్రమే ఈసారి 14వ విడత ₹2000 రూపాయలు నేరుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ DBT ద్వారా విడుదల చేసినప్పుడు ఖాతాలో జమవుతాయి.

pm కిసాన్ యోజన పీఎం కిసాన్
pm కిసాన్ యోజన 2023

PM కిసాన్ అర్హుల లిస్టు చెక్ చేసుకునే విధానం:

  1. మొదటగా మీరు మీ యొక్క మొబైల్ లో గాని లేదా కంప్యూటర్ లో గాని వెబ్ బ్రౌజర్ ని ఓపెన్ చేయాలి.
  2. తర్వాత మీరు pm kisan.gov.in టైప్ చేసి సెర్చ్ చేయండి. వెంటనే మీకు పీఎ కిసాన్ పథకానికి సంబంధించిన Official Website ఓపెన్ అవుతుంది.
  3. తర్వాత మీకు చాలా ఆప్షన్స్ కనిపిస్తాయి. అందులో “Beneficiary List” ఆప్షన్ కనిపిస్తుంది దానిపై క్లిక్ చేయండి.
  4. తర్వాత మీకు ఒక పేజీ ఓపెన్ అవుతుంది. అందులో మీయొక్క State, District, Sub-District District, Village ఎంచుకోవాలి.
  5. తర్వాత మీకు submit అనే ఆప్షన్ కనిపిస్తుంది ‌ దానిని క్లిక్ చేయాలి.
  6. తర్వాత మీకు ఒక పేజీలో అర్హుల జాబితా ఓపెన్ అయిపోతుంది. అందులో మీ పేరు ఉందో లేదో చూసుకోండి పేరు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా eKYC పూర్తయి ఉంటే 14వ విడత డబ్బులు పడుతుంది.

పీఎం కిసాన్ ఎలిజిబుల్ లిస్ట్ మరియు పేమెంట్స్ చాట్ కోసం దీన్ని క్లిక్ చేయండి. Click here

1 thought on “పీఎం కిసాన్ 2023; కేంద్రం నుండి రైతులకు మరో గుడ్ న్యూస్ ₹6000 ఈ తేదీ జమ”

Comments are closed.

Verified by MonsterInsights