తెలంగాణ రైతులకు జూన్ 26 న 3 పథకాల డబ్బులు విడుదల వెంటనే తెలుసుకోండి

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ మూడు పథకాల డబ్బులను ఒకేసారి ఖాతాలోకి జమ చేయనున్నారు. ఈ మూడు పథకాలు ఏంటో ఎవరెవరు ఈ పథకాలకి అర్హులు ఏ తేదీన డబ్బులను విడుదల చేయబోతున్నారో పూర్తిగా తెలుసుకుందాం.
కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు పెట్టుబడి సాయంగా అనేక రకాల పథకాలను అమలు చేస్తూ వస్తుంటారు అందులో భాగంగానే ఈ జూన్ నెలలో ఒక మూడు పథకాలకు సంబంధించిన డబ్బులను రైతులు ఖాతాలోకి జమ చేయనున్నారు. వివరాలు చూసుకున్నట్లయితే..

రైతుల ఖాతాలోకి నిధులు విడుదల తేది:-

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు వానాకాలం పెట్టుబడి సాయం కింద రైతుబంధు నిధులను జూన్ 26వ తేదీన ఒక్కో ఎకరానికి ₹5000 రూపాయలు చొప్పున జమ చేయనున్నారు. మొదటగా ఒక ఎకరం పొలం కలిగిన వారికి తరువాత రెండు ఎకరాలు తరువాత మూడెకరాలు ఇలా జమ చేయడం జరుగుతుంది. అలాగే జూన్ 24వ తేదీన పోడు భూములు కలిగినటువంటి వారికి ఒక లక్ష యాభై వేల మంది రైతులకు కొత్తగా పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేయునట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ కొత్తగా పాస్ పుస్తకాలు పొందినటువంటి రైతులకు కూడా వానాకాలం సీజన్ కు సంబంధించిన రైతుబంధు డబ్బులను నేరుగా వారి ఖాతాలోకే జమ చేస్తామని సీఎం కేసీఆర్ నిన్న జరిగిన మీటింగ్ లో వెల్లడించారు.
అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు జూన్ 26వ తేదీన మరో పథకాన్ని కూడా అమలు చేయబోతున్నారు దానికి సంబంధించిన వివరాలు చూసుకుంటే..

pm kisan రైతులకు
pm kisan రైతులకు

కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకం పీఎం కిసాన్ సంబంధించినది. ఈ పథకం కింద ఒక ఏడాదికి గాను ప్రతి రైతుకు మూడు విడతలలో ₹6000 రూపాయలను అందజేస్తూ వస్తుంది ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాలోకి 13 విడతల డబ్బులను విడుదల చేసింది తాజాగా 14వ విడత నిధులను జూన్ 26వ తేదీన విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ పీఎం కిసాన్ సమ్మన్ నిధి పథకం కింద రైతులకు 13వ విడత డబ్బులు కొంతమందికి వారి ఖాతాలోకి పడకుండా ప్రాసెసింగ్ లో ఉన్నాయి. అటువంటి వారికి మాత్రమే 13వ విడత అలాగే 14 విడత రెండు కలిపి నాలుగు వేల రూపాయల వరకు జమ అయ్యే అవకాశం ఉంది.

Note :- ఈ పీఎం కిసాన్ సంబంధించిన పథకానికి సంబంధించిన 14వ విడత నిధులు పడాలంటే కచ్చితంగా రైతులు ఈ కేవైసీ చేసుకోవాల్సి ఉంటుంది ఈ కేవైసీని ఆన్లైన్ లో చేసుకోవచ్చు లేదా ఆఫ్లైన్లో మీ దగ్గర్లోని సిఎస్సి సెంటర్ కి వెళ్లి ఈ కేవైసీ పూర్తి చేసుకోవచ్చు.
దీనికి సంబంధించి మీరు ఆన్లైన్లో చేసుకోవాలంటే కింద ఉన్న లింక్ ని క్లిక్ క్లిక్ చేయండి.

Click here

ఈ విధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ వానాకాలం సీజన్ రైతుబంధు పథకానికి సంబంధించిన ₹5000 అలాగే పిఎం కిసాన్ సంబంధించిన పథకానికి సంబంధించిన కొంతమందికి ₹4000 మరికొంతమందికి ₹2000 ఈ విధంగా మొత్తం మీద రైతులకు జూన్ 26వ తేదీన ₹9000 రూపాయల వరకు నేరుగా వారికి ఖాతాలలో జమ కానుంది.

Verified by MonsterInsights