కేంద్రం నుండి రైతులకు కొత్త రుణాలు ఆధార్ కార్డు ఉంటె చాలు | Credit Guarantee Scheme 2025

కేంద్రం నుండి రైతులకు కొత్త రుణాలు

కేంద్రం నుండి రైతులకు కొత్త రుణాలు: దేశంలో రైతులకు వచ్చేటువంటి ఆదాయాన్ని పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. రైతులకు సులువుగా బ్యాంకుల నుండి రుణాలు ఇచ్చేందుకు మరో కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది మన యొక్క కేంద్ర ప్రభుత్వం.
బ్యాంకు నుండి రుణం గ్యారెంటీ పథకం కింద.. రూ.1000 కోట్లు కేటాయిస్తున్నట్లు సెంట్రల్ గవర్నమెంట్ ఆహార శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి సోమవారం ప్రకటించారు. ఈ క్రెడిట్ గ్యారెంటీ పథకం కింద పంటకాలం పూర్తిఐ పంట కోసిన తర్వాత ఎలక్ట్రానిక్ గిడ్డంగి రసీదుల ద్వారా ఈ బ్యాంక్ లోన్లు పొందవచ్చని పేర్కొన్నారు.

వేర్‌హౌసింగ్ డెవలప్‌మెంట్ అండ్ రెగ్యులేటరీ అథారిటీ- డబ్ల్యుడీఆర్‌ఏ రిజిస్టర్డ్ రిపోజిటరీలు జారీ చేసిన ఎలక్ట్రానిక్ నెగోషియబుల్ వేర్‌హౌస్ రసీదులకు ఈ-ఎన్‌డబ్ల్యుఆర్‌లు బ్యాంకులు.. వ్యవసాయం చేస్తున్నటువంటి రైతులకు రుణాలు అందించడమే ఈ క్రెడిట్ గ్యారెంటీ పథకం లక్ష్యమని ఆహార శాఖ కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి స్పష్టం చేశారు.

క్రెడిట్ గ్యారెంటీ స్కీమ్:

వ్యవసాయం చేస్తూ జీవనం సాగించేటువంటి రైతుల కోసం తీసుకువచ్చిన క్రెడిట్ గ్యారెంటీ స్కీమ్(రుణ హామీ పథకం)ను ఆహార శాఖ కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి సోమవారం ప్రకటించారు. చేతికొచ్చిన పంట కోసిన తర్వాత దాని మీద వ్యవసాయం చేసేటువంటి రైతులకు లోన్లు ఇచ్చేందుకు ఈ పథకాన్ని తీసుకువచ్చినట్లు ఆహార శాఖ central minister ప్రహ్లాద్ జోషి తెలిపారు. ఈ నేపథ్యంలోనే క్రెడిట్ గ్యారెంటీ స్కీమ్‌ కోసం రూ.1000 కోట్లు రూపాయలు కేటాయిస్తున్నట్లు కేంద్ర ఆహార శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి స్పష్టం చేశారు. అయితే ఈ లోన్లు తీసుకునేందుకు వ్యవసాయం చేసేటువంటి రైతులు సంబంధిత వ్యవసాయానికి సంబంధించినటువంటి భూమి పత్రాలను తప్పనిసరిగా బ్యాంకుల్లో తనఖా కింద ఉంచి.. బ్యాంకు నుంచి డబ్బులు తీసుకోవచ్చని వెల్లడించారు.

Picsart 24 12 18 14 25 54 788
pm kisan

పీఎం కిసాన్ యోజన 19 వ విడత అర్హుల లిస్ట్ కోసం దీనిపై నొక్కండి : Click Here

ఈ రుణహామీ పథకం కింద.. ఎలక్ట్రానికల్ గిడ్డంగులకు సంబంధించిన రసీదులను ఇచ్చి రైతులు పంట అనంతరం రుణాలను చాలా సులభంగా పొందవచ్చు. రైతులు తమ పంట ఉత్పత్తులను ఉంచిన తర్వాత.. వేర్‌హౌసింగ్ డెవలప్‌మెంట్ అండ్ రెగ్యులేటరీ అథారిటీ (డబ్ల్యుడీఆర్‌ఎ) రిజిస్టర్డ్ రిపోజిటరీలు ఇచ్చే ఎలక్ట్రానిక్ నెగోషియబుల్ వేర్‌హౌస్ రిసిప్ట్‌ (ఈ-ఎన్‌డబ్ల్యుఆర్‌)లను బ్యాంకులకు అందించడం ద్వారా లోన్లు చాలా సులభంగా పొందవచ్చని తెలిపారు. అయితే ఈ ఈ-ఎన్‌డబ్ల్యుఆర్‌లను తీసుకుని.. సదరు బ్యాంకులు లోన్లు ఇవ్వకపోవడం అనే ప్రస్తావనే ఉండకుండా చూసుకోవడమే ఈ పథకం యొక్క లక్ష్యమని ఆయన వివరించారు.

ఈ-ఎన్‌డబ్ల్యుఆర్‌లను తీసుకుని సంబంధిత బ్యాంకులు సకాలంలో వ్యవసాయం చేసే రైతులకు రుణాలు అందించనున్నాయని పేర్కొన్నారు. బ్యాంకులు ఉదారవాద విధానాల తో వ్యవసాయం చేసే రైతులకు రుణాలు ఇచ్చేలగా ప్రోత్సహించడమే ఈక్రెడిట్ గ్యారెంటీ స్కీమ్ లక్ష్యమని కేంద్ర మంత్రి జోషి తెలిపారు. ప్రస్తుతం రైతులు తీసుకుంటున్న లోన్లలో పంట కాలం పూర్తయి పంట కోసిన తర్వాత తీసుకునే లోన్లు చాలా తక్కువ అని కేంద్ర ఆహార శాఖ కార్యదర్శి సంజీవ్ చోప్రా తెలిపారు.

కేంద్ర

దేశంలో రైతులు తీసుకున్న మొత్తం వ్యవసాయ రుణాలు రూ. 21 లక్షల కోట్లు రూపాయలు అయితే.. అందులో పంట అనంతర రుణాలు కేవలం రూ. 40 వేల కోట్లు రూపాయలు మాత్రమేనని పేర్కొన్నారు. ప్రస్తుతం, ఈ-ఎన్‌డబ్ల్యుఆర్‌లపై తీసుకున్న లోన్లు కేవలం రూ.4వేల కోట్లు రూపాయలు మాత్రమేనని స్పష్టం చేశారు. ఇక రానున్న 10 సంవత్సరాల్లో పంట పూర్తయిన అనంతర రుణాలు రూ. 5.5 లక్షల కోట్ల రూపాయలు పెరుగుతాయని ఆశిస్తున్నట్లు సంజీవ్ చోప్రా గారు తెలిపారు.

క్రెడిట్ గ్యారంటీ స్కీం అప్లికేషన్ కోసం దీనిని నొక్కండి: Click Here

Verified by MonsterInsights