అమ్మ ఒడి 2023 ఇంకా పడని వారికి సీఎం జగన్ మరో శుభవార్త వెంటనే ఇలా చేయండి

జగనన్న అమ్మ ఒడి 2023 పథకానికి సంబంధించఅ సీఎం జగన్మోహన్ రెడ్డి జూన్ 28వ తేదీన మన్యం జిల్లా కురూపంలో బహిరంగ సభ వేదికగా 4వ విడత నిధులను విడుదల చేశారు. అమ్మ ఒడి 2023 నాలుగో విడత డబ్బులను సీఎం జగన్మోహన్ రెడ్డి దాదాపు 44 లక్షల మంది తల్లులకు పైగా నేరుగా వారి ఖాతాలోకి 15 వేల రూపాయలు చొప్పున విడుదల చేశారు ఈ 15 వేళలో 2000 రూపాయలు స్కూల్ మెయింటెనెన్స్ కి, టాయిలెట్ మెయింటినెన్స్ కి జమ చేసి మిగిలిన 13000 రూపాయలను తల్లుల ఖాతాలోకి విడుదల చేశారు.

ఈ అమ్మ ఒడి 2023 పథకానికి సంబంధించి చాలా మందికి కొన్ని కారణాల వల్ల జమ కాలేదు. ఈ కారణాలను మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే కరెంటు బిల్లు 300 యూనిట్ల కంటే ఎక్కువ రావడం, అమ్మ ఒడి 2023 పథకానికి సంబంధించి eKYC నమోదు చేసుకోకపోవడం అలాగే ఆధార్ కార్డుతో బ్యాంక్ అకౌంట్ NPCI మ్యాపింగ్ చేసుకోకపోవడం ఇలాంటి కారణాలవల్ల ఇంకా చాలామందికి డబ్బులు పడలేదు. ఇలాంటి వారందరికీ ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మరో గుడ్ న్యూస్ చెప్పారు.

అమ్మ ఒడి డబ్బులు పడని వారికి మరో శుభవార్త:

అమ్మ ఒడి 2023 పథకానికి సంబంధించి అర్హత ఉండి కూడా ఇంకా డబ్బులు పడకుండా ఉంటే అటువంటి వారందరికీ జూలై 7వ తేదీన ఖాతాలోకి 13 వేల రూపాయలు చొప్పున నేరుగా జమ చేస్తామని తెలిపారు. అయితే ఈ డబ్బులు మీ ఖాతాలోకి పడాలంటే కచ్చితంగా ఈ కేవైసీ పూర్తి చేసుకోవాలి. ఈ యొక్క ఈకేవైసీని రెండు విధాలుగా చూసుకోవచ్చు ఒకటి ద్వారా రెండు సచివాలయం ద్వారా ఎలా చేసుకోవాలంటే వాలంటీర్ దగ్గర వేలిముద్ర అయినా సరే వేసి లేదా ఫోటో అయినా సరే తీసుకుని చేసుకోవచ్చు రెండవదిగా సచివాలయంలో కూడా వేలిముద్ర వేసి చేసుకోవచ్చు లేదా ఫోటో తీసి ఈ కేవైసీ ని పూర్తి చేసుకోవచ్చు. eKYC పూర్తయిన వారందరికీ కూడా జూలై 7 తేదీకంతా కూడా నేరుగా వారి ఖాతాలోకి నిధులు పడతాయని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.

కొంతమందికి ఈ కేవైసీ పూర్తయినా సరే ఇంకా ఖాతాలోకి నిధులు జమకాలేదు అటువంటివారు మీయొక్క బ్యాంక్ అకౌంట్ కి ఆధార్ కార్డు మ్యాపింగ్ అంటే NPCI లింక్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. NPCI లింకులు లేకపోతే మీకు పేమెంట్ అనేది విడుదల చేసినప్పటికీ మీ ఖాతాలోకి కాబట్టి నిర్లక్ష్యం చేయకుండా మీ యొక్క బ్యాంకు క సంప్రదించి NPCI మ్యాపింగ్ చేసుకోండి.

మీ బ్యాంక్ అకౌంట్ కి ఆధార్ తో ఆధార్ కార్డు తో అనుసంధానం (NPCI) లింక్ అయిందో లేదో తెలుసుకునేందుకు దీనిని Click here

మరి కొంతమందికి కరెంట్ బిల్లు 300 యూనిట్లు కంటే ఎక్కువగా రావడం. గడచిన ఏప్రిల్ మే జూన్ నెలలో అధికమైన ఎండల వల్ల చాలామంది కరెంటు ని ఎక్కువగా వినియోగించారు అంటే ఫ్యాన్లు ఏసీలు, కూలర్లు ఇలాంటివి ఎక్కువగా వాడటం వల్ల 300 యూనిట్లు కంటే ఎక్కువగా కరెంట్ బిల్లు వచ్చింది.

ఇలాంటివారు మీ దగ్గరలోని కరెంట్ ఆఫీస్ కి వెళ్లి ఆర్ఐ దగ్గర క్లియరెన్స్ లెటర్ తీసుకొని సచివాలయంలో అమ్మబడి 2023 పథకానికి సంబంధించి మళ్లీ గ్రీవెన్స్ పెట్టుకుంటే మీకు సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ పూర్తి చేసి మీకు నిజంగా అర్హత ఉంటే మరోసారి అమ్మ ఒడి 2023 పథకానికి సంబంధించిన 13 వేల రూపాయలను మీ ఖాతాలోకి వేయడం జరుగుతుంది. పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకున్నప్పుడు Remarks లో Eligible అని ఉంటే మీకు ఖచ్చితంగా డబ్బులు మీ ఖాతాలోకి వస్తాయి. Eligible కాకుండా Not Eligible ఉంటే వెంటనే గ్రీవెన్సీ పెట్టుకోండి. అర్హత ఉండి కూడా డబ్బులు పడని వారికి మరోసారి ఖాతాలో సిఎం జగన్ నిధులు విడుదల చేస్తామని తెలిపారు.

జగనన్న అమ్మ ఒడి 2023 పడని వారికి శుభవార్త
అమ్మ ఒడి 2023 పడని వారికి శుభవార్త

అమ్మ ఒడి 2023 పథకానికి సంబంధించిన సాధారణ రూల్స్:

  1. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నివాసి అయి ఉండాలి.
  2. విద్యార్థి మరియు తల్లి లేక సంరక్షకులు ఒకే హౌస్ ఓల్డ్ మ్యాపింగ్ లో ఉండాలి.
  3. విద్యార్థులకు 75% అటెండెన్స్ కచ్చితంగా కలిగి ఉండాలి.
  4. నెలవారి ఆదాయం పట్టణ ప్రాంతాలలో 12000, గ్రామీణ ప్రాంతాలలో అయితే 10000 మించకూడదు.
  5. ఇంటి యొక్క విస్తీర్ణం పట్టణ ప్రాంతాలలో 1000 చదరపు అడుగులకు మించ కూడదు.
  6. రైస్ కార్డ్ కలిగి ఉండాలి.
  7. నాలుగు చక్రాల వాహనాలు కలిగి ఉండకూడదు. టాక్సీలు, క్యాబ్లు, ట్రాక్టర్లు వీటికి మాత్రం మినహాయింపు ఉంది.
  8. భూమి అయితే మెట్ట 7 ఎకరాలు అయితే 3 ఎకరాలు కలిగి ఉండాలి. లేదా మొత్తం కలిపి 10 ఎకరాలకు మించి ఉండకూడదు. ఇలా ఉంటే ఈ పథకానికి అనర్హులు.
  9. తల్లి లేక సంరక్షకుల బ్యాంకు ఖాతాకు ఆధార్ కార్డును కచ్చితంగా NPCI మ్యాపింగ్ కలిగి ఉండాలి.
  10. తల్లి లేక సంరక్షకుల ఆధార్ కార్డుకు ఫోన్ నెంబర్ లింక్ కలిగి ఉండాలి.

పైన తెలిపిన రూల్స్ కి అనుగుణంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అమ్మబడి పథకానికి సంబంధించి లబ్ధిదారులను గుర్తిస్తుంది. ఎవరైతే ఈ పథకానికి సంబంధించి అర్హత కలిగి ఉంటారో వారి పేర్లను అర్హుల జాబితాలో ఉంచుతారు. ఈ అర్హుల జాబితాలన్నీ గ్రామ అవార్డు సచివాలయాల నోటీసు బోర్డులలో ప్రదర్శిస్తారు. నోటీసు బోర్డులో పెట్టినటువంటి అమ్మబడి అర్హుల జాబితాలలో ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే అటువంటివారిని కూడా తిరిగి గ్రీవెన్స్ పెట్టి ఫైనల్ ఎలిజిబుల్స్ ని విడుదల చేస్తారు ఈ ఫైనల్ ఎలిజిబుల్ లిస్టులో ఎవరి పేరు అయితే ఉంటుందో వారికి మాత్రమే అమ్మ ఒడ పథకానికి సంబంధించిన నిధులను విడుదల చేస్తారు.

Payment Status Check

అమ్మ ఒడి పథకం యొక్క విడుదల తేదీలు:

అమ్మ ఒడి పథకానికి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు నాలుగు విడతల డబ్బులను విడుదల చేసింది. ఈ నాలుగు విడతలకు సంబంధించిన తేదీలను ఇప్పుడు మనం పూర్తిగా చూద్దాం.

అమ్మ ఒడి పథకానికి సంబంధించిన డబ్బులను సీఎం జగన్ మోహన్ రెడ్డి 9 తేదీ జనవరి 2020 సంవత్సరమున మొదటి విడత కింద తల్లులు ఖాతాలోకి నిధులను విడుదల చేశారు. రెండవ విడత కింద 9 జనవరి 2021 వ సంవత్సరమున విడుదల చేశారు. ఇక మూడో విడత కింద జూన్ 26వ తేదీన 2022 సంవత్సరంలో నిధులను తల్లులు ఖాతాలోకి విడుదల చేశారు సీఎం జగన్మోహన్ రెడ్డి.

ఇక నాలుగో విడత కింద ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి జూన్ 28వ తేది 2023న దాదాపు 44 లక్షల మంది తల్లులకు నిధులను విడుదల చేశారు. ఈ నాలుగో విడత డబ్బులు ఈ కేవైసీ పూర్తి చేసుకుని అర్హుల లిస్టులో పేరు గనక ఉంటే జూలై 7 తేదీ వరకు లబ్ధిదారుల ఖాతాలోకి నిధులు జమవుతాయని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.

మీ ఖాతాలోకి అమ్మ ఒడి 2023 పథకానికి సంబంధించిన డబ్బులు వచ్చాయా లేదా తెలుసుకునేందుకు దీనిపై క్లిక్ చేయండి. Click here

అమ్మ ఒడి 2023
అమ్మ ఒడి 2023

అమ్మ ఒడి పథకం యొక్క ముఖ్య ఉద్దేశం:

మన రాష్ట్రవ్యాప్తంగా అక్షరాస్యతను పెంచే దిశగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో కృషి చేస్తూ విద్యార్థుల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు పరుస్తున్నారు. అందులో భాగంగానే ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివే విద్యార్థుల యొక్క తల్లులకు అమ్మబడి పథకం కింద సంవత్సరానికి 15000 రూపాయలను జమ చేస్తారు. పిల్లల చదువులు తల్లిదండ్రులకు భారం కాకూడదని సీఎం జగన్ మోహన్ రెడ్డి ఈ పథకాలను అమలు చేస్తున్నారు. సంవత్సరానికి కొంత ఆర్థిక సాయం పిల్లలను బడికి పంపించే తల్లులకు ఇచ్చినట్లయితే వారు తమ పిల్లలను బడికి పంపించడంలో ఎక్కువ శ్రద్ధ చూపి పిల్లల భవిష్యత్తు చదువు ద్వారా మెరుగుపరచబడుతుందని ఈ పథకాన్ని మన ముఖ్యమంత్రి అయిన సీఎం జగన్ మోహన్ రెడ్డి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని అమలు చేస్తున్నారు.

అమ్మ ఒడి 2023
అమ్మ ఒడి 2023
Verified by MonsterInsights